మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -378
· 378-నిర్మాత ,రాజకీయ నాయకుడు ,తెలంగాణా రాష్ట్ర సినీ టివీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ –పుష్కర్ రామమోహనరావు
పుష్కర్ రామ్మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సినీ జీవితం
పుష్కర్ రామ్మోహన్ రావు మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా సినీ ఎగ్జిబిటర్‌గా, పంపిణీదారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా 250కిపైగా సినిమాలను విడుదల చేశాడు. ఆయన 1993 నుండి 95 వరకు కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా, ది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో మే 2017లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) తొలి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]
నిర్మించిన సినిమాలు
· లవ్ స్టోరీ
· లక్ష్య[4]
· ది ఘోస్ట్ (2022)
· ప్రిన్స్ (2022)
· మైఖేల్ (2023)
· చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొలి చైర్మన్‌గా పని చేశాడు.
· 379- అర్జున్ రెడ్డి సినీ నిర్మాత –ప్రణయ్ రెడ్డి వంగా
ప్రణయ్ రెడ్డి వంగా భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినవాడు.
ప్రారంభ జీవితం
ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. ఆయన తన ప్రాథమిక విద్యను వరంగల్ లోని ప్లాటినం జూబ్లీ హైస్కూలు లో పూర్తిచేసాడు. ఆయన సోదరుడు సందీప్ రెడ్డి వంగా 2017లో నిర్మితమైన అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించాడు.
కళాశాల జీవితం
ఆయన కర్ణాటక లోని భల్కీలో ఉన్న గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టాను పొందాడు. ఉన్నత చదువులకు 2001లో ఆయన యూరోప్ వెళ్ళాడు. అచటా స్వీడన్ లోని డలర్నా విశ్వవిద్యాలయం నుండి 2003లో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆయన స్విర్జర్లాండ్ లోణి బెర్న్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజిమెంటు డిగ్ర్రీని పొందాడు.
జీవిత విశేషాలు
ప్రణయ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నాడు. ఆయన అమెరికాలోని కాపిటల్ ఒన్, కైసెర్ పెర్మనెంటె, కోగ్నిజంట్ కంపెనీలకు ఇ.టి.ఎల్ కన్సల్టంట్ గా పనిచేస్తున్నాడు. ఆయన వర్జీనియా లో గత 13 యేళ్ల నుండి నివసిస్తున్నారు.
అర్జున్ రెడ్డి
ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో తన తండ్రితో కలసి ఆయన భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 25, 2017న విడుదలయింది. ఈ చిత్రం హిట్ కావడంతో ప్రణయ్ నిర్మాతగా గుర్తింపు పొందాడు.
వివాదాలు
ఈ సినిమాలో పొగత్రాగడం, డ్రగ్స్ సేవించడం వంటి అంశాల వల్ల సెన్సార్ బోర్డులో యిబ్బందులు వచ్చాయి. ఈ చిత్రం పోస్టర్ కూడా ముద్దు సన్నివేశంతో కూడుకొన్నందున యిబ్బందులెదురైనా తెలంగాన ఫిలిం చాంబర్ చే ఆమోదించబడినది.
పునర్నిర్మాణం
ఈ చిత్రం కన్నడం, హిందీ, తమిళ భాషలలో పునర్నిర్మించబడినది.
వ్యక్తిగత జీవితం
ఆయన శ్వేతను వివాహమాడాడు. ఆయనకు రిషిక్ నందన్ రెడ్డి వంగా (జ.2009), విభుం స్మారణ్ వంగా ( జ.2011) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
380-‘’ఈగ’’ చిత్ర నిర్మాత ,గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ లో భాగస్వామి ,ఉదారుడైన స్పాన్సర్ –ప్రసాద్ వి .పొట్లూరి
ప్రసాద్ వి. పొట్లూరి (జ.సెప్టెంబరు 8, 1970) (పి.వి.పిగా సుపరిచితుడు) సీరియల్ వ్యవస్థాపకుడు, లోకోపకారి, విద్యావేత్త. [3][4] ఆయన పూర్తి పేరు పొట్లూరి వరప్రసాద్. ఆయన స్వంతంగా పి.వి.పి సినిమా అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. పివిపి సినిమా బేనర్‌పై ఇప్పటి వరకు తమిళం, తెలుగులో పలు భారీ సినిమాలు నిర్మించాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రాన్ని తమిళంలో ‘నాన్ఈ’ పేరుతో పివిపి సినిమా వారు ప్రొడ్యూస్ చేసాడు.
గ్లోబల్ అవుట్ సోర్సింగ్ సర్వీసు రంగంలోని సీరియల్ వ్యవస్థాపకునిగా ఆయన మూడు కంపెనీలను విజయవంతంగా నిర్మించి వాటిని “ఫోర్టూన్ 1000 మార్కెట్ ప్లేస్” యొక్క అవసరాలను తీర్చడానికి అమ్మారు.[5] [6] గ్లోబల్ ఇన్వెస్టుమెంటు సమాజంలో ఆయన గౌరవ ప్రథమైన నాయకుడు.
ఆ వ్యవస్థాపక-ప్యాక్ దశాబ్దంలో, అతను ప్రోకాన్, ఓరియన్ కంపెనీ ఎల్ ఎల్ సి, ఐరెవ్నా లిలిటెడ్[7] [8][9]వంటి అనేక సంస్థల వెనుక చోదక శక్తిగా ఉన్నాడు.[10] ప్రోకాన్ ఐ.ఎన్.సి టెక్నాలజీస్ ను 1998 లో కొనుగోలు చేసాడు. AOC, LLC లను 2000 లో SSI[11] ద్వారా INR 2.92 లకు కొనుగోలు చేసాడు.[12] అప్పటికి అది అతి పెద్ద వ్యవహారం. ఇరెవ్నా లిమిటెడ్ 2005 లో CRISIL (S&P భారతదేశం) ద్వారా కొనుగోలు చేసాడు. ఆయన మావెన్ కార్ప్, కార్వే కన్సల్టెంట్స్[13] లలో వ్యూహాత్మక పెట్టుబడిదారుడు.[14][15], సిబై సిస్టమ్*స్ కు స్థాపక ఇన్వెస్టరు.[16][17][18][19]
ప్రస్తుతం ఆయన పి.వి.పి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు. [20] ఈ సంస్థల్ రియాల్టీ, మీడియా, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంటు రంగాలలో ఇన్వెస్టుమెంటు ఆసక్తితో నాయకునిగా పరిణమిస్తుంది. ప్రతి వాటాదారునికి ప్రయోజనం కలిగించే ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా వృద్ధి చెందుతోంది.[21][22][23] పివిపి బహిరంగంగా వర్తకం చేసే వ్యాపార సంస్థ. ఇది 35,000 మంది షేర్ హోల్డర్లతో BSE, [24] NSE[25] & LSE[26] పై ట్రేడింగ్ చేస్తుంది. జూలై 2010లో పి.వి.పి గ్రూపు భారతీయ మీడియా&ఎంటర్‌టైన్‌మెంటు రంగంలో “పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్” ద్వారా అడుగు పెట్టింది. ఇది భారతీయ ఎంటర్‌టైన్‌మెంటు పరిశ్రమ యొక్క ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించే భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత మీడియా కేపిటల్ హౌస్.
పి.హె.ఎం.ఎల్ ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో పి.వి.పి సినిమా బ్యానర్ తో అడుగిడింది. అది దేశంలో అతి పెద్ద నిర్మాణ సంస్థ.[27][28][29][30]
ఆయన విజయవాడ లోని “ప్రసాద్ వి. పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ “కి ముఖ్య పోషకుడు.[31][32][33] ఆయన ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కూడా దాతగా ఉన్నాడు.[34] ఆయాన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ కు యజమాని.[35][36][37] ఆయన ఇండియన్ బ్యాడ్‌మెంటన్ లీగ్ కు గల ఆరుగురు ఫ్రాంచైజీలలో ఒకరు. ఆయన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్.సికు సహ యజమాని.
ప్రారంభ జీవితం, కుటుంబం
ప్రసాద్ వి. పొట్లూరి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో రాఘవేంద్రరావు, మంగతారా దేవి దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఎన్.ఎస్.ఎం పబ్లిక్ పాఠశాలలో పాఠశాల విద్యనభ్యసించిన తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగులో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు.
ఆయన భార్త ఝాన్సీ సురెడ్డి. ఆయన పిల్లలు పెరల్, పరమ్.
వ్యాపార జీవితం
· సి.ఇ.ఒ/వ్యవస్థాపకుడు, ప్రోకాన్ ఐ.ఇన్.సి. మిచిగాన్, 1996 నుండి 1998[38]
· సి.ఇ.ఒ/వ్యవస్థాపకుడు, ఆల్బియన్ ఓరియన్ కంపెనీ ఎల్.ఎల్.సి., మిచిగా, 2000[39][40]
· చైర్మన్/వ్యవస్థాపకుడు, IREVNA లిమిటెడ్, లండన్, యునైటెడ్ కింగ్‌డం, 2001 నుండి 2005.[41][42]
· చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు, పి.వి.పి వెంచర్స్ లిమిటెడ్, సెప్టెంబరు 2006 నుండి ఇప్పతి వరకు.[43]
దాతృత్వం
ఆయన చదరంగం క్రీడాకారిణి ప్రియాంకా నూతక్కిని ఇరాన్ లో జరిగిన ఆసియన్ చెస్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొనేందుకు గానూ ప్రాయోజితం చేసాడు. [44]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-2023-ఉయ్యూరు