అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -9
9-బి.సి.మాక్లినన్
అమెరికా న్యుఆర్లియన్స్ రాష్ట్రం లో ‘’చాల్మేటి లాండ్రి ‘’చాల ప్రసిద్ధమైంది.ప్రపంచంలోనే ఇది మొదటి లాండ్రి గా రికార్డ్ కెక్కింది .అందులో వారానికి 18వేల బట్టల మూటలు చలువ అంటే ఇస్త్రీ చేయబడతాయి.దాని ఓనర్ స్కాట్ లాండ్ దేశీయుడు బి.సి.మాక్లినన్ .నిరుపేద కుటుంబం లో పుట్టి తన పొట్ట తానె పోషించుకోవాల్సిన వాడు .మొదట్లో ఒక లాండ్రిలో వారానికి 14షెల్లి౦గుల జీతం తో చేరాడు .కడుపు కాల్చుకొని కష్టపడి ఎలాగో 60పౌన్లు నిలవ చేశాడు .ఆడబ్బుతో ఒక దివాలా తీయబోయే లాండ్రి ని కొనేశాడు ధైర్యంగా .రాత్రి పగలు శ్రమించి దాన్ని లాభకరం గా మార్చాడు .వారానికి 4వేల బట్టల మూటలు ఉతికే స్థాయికి ఆ లాండ్రీ ని పెంచాడు .అంతకంటే ఎంతకష్టపడినా పెరగలేదు .
1910లో న్యు ఆర్లియన్స్ లో ఒక పత్రికలో ప్రకటన విభాగానికి చెందినమేనేజర్ ఎ .జి నేమియర్ ఇతడి దగ్గరకు వచ్చి ‘’మీ లాండ్రీ గూర్చి మా పత్రికలో ఒక ప్రకటన ఇవ్వు .నీ వ్యాపారం బాగా పెరగవచ్చు ‘’అని సూచింఛి ఆపత్రికలో సగం పేజీ ఇతడి లాండ్రీ యాడ్ కు ఉచితంగా స్థలం కేటాయించ గలనని చెప్పాడు .తనకు ఉచితంగా ఏమీ వద్దని ,డబ్బు ఇచ్చే వేయిస్తాను అయినా ఆలోచించి తర్వాత తెలియజేస్తానన్నాడు .ఇద్దరూ ఆలోచించి ఒక ప్రకటన వేయటానికి ఒక పధ్ధతి తయారు చేశారు .మొదటి ఏడాది పత్రికలలో ప్రకటనకు మాక్లినన్ వెయ్యి పౌన్లు ఖర్చు చేసేట్లు ఒప్పందం ఖరారై,అమలు జరిగింది . .
మాక్లినన్ కు ఆ ప్రకటన బాగా లాభించింది .చాలామంది కొత్త ఖాతాదారులేర్పడ్డారు .ప్రకటన రుచి తెలిసి ,ఇ౦కా ఎక్కువ డబ్బుతో ప్రకటన ఇవ్వాలను కొన్నాడు .న్యు ఆర్లియన్స్ స్టేట్ లో ఆ రోజుల్లో బట్టలు ఉతికే పని అంతా నల్లజాతి చాకలి వారే చేసేవారు .బట్టలు ఉతికే పధ్ధతి ,ప్రదేశం చాలా అశుచి గా ఉండేది .తన ప్రకటనలలో తన లాండ్రీ లో బట్టలు ఉతికే విధానం ప్రదేశం చాలా శుచిగా ,శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంటాయని తెలియజేసేవాడు. అలాగే ఆనియమాలు పాటి౦చాడు కూడా .ఈ ప్రకటన ప్రతి గృహస్తుని గృహిణిని ఆలోచింపజేసి అతడి లాండ్రీ లోనే బట్టలు ఇచ్చేవారు .
బట్టల మూటలు పెరిగిపోతున్నాయి అనుకొన్న సమయంలో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వటం కష్టంగా మారింది అందుకని ఒక కెమిస్ట్ ను పనికి కుదుర్చుకొన్నాడు .బట్టలు ఉతికే నీటిని ,సబ్బును ఇస్త్రీ చేసే బొగ్గు నాణ్యాన్ని ,ఇతర కెమికల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసి తగిన సలహాలివ్వటం అతడి పని . లాంద్రీకి కావాల్సిన అన్ని యంత్రాలు వాటిని నిర్వహించే సామర్ధ్యం ఉన్నవారిని ఏర్పాటు చేసుకొన్నాడు .అతని ప్రకటన అద్భుత ఫలాలు అతనికి ,అతన్ని నమ్మి బట్టలు వేసినవారికీ బాగా కలిగాయి .ఎప్పటికప్పుడు కాలాను గుణంగా కొత్త పద్ధతులు ప్రవేశపెడుతూ లాండ్రీ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించాడు .కానీ ఒక సమస్య అతడిని బాధిస్తోంది .
ఒక రోజు తన మొదటి ప్రకటనకు ఉత్సాహ పరచిన నేమియర్ దగ్గరకు వెళ్లి ‘’వారానికి మొదటి మూడు రోజులు మా లాండ్రీ లో ఊపిరి సలపనంత పని ఉంటోంది .తర్వాత మూడు రోజులూ అసలు పని లేక ఈగలు తోలుకొంటూ గడుపుతున్నాం .ఆచివరి మూడు రోజుల్లో పని ఒత్తిడి గా ఉండటానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి ‘’అని కోరాడు .నేమియర్ బాగాఆలోచించి ‘’సోమవారం తీసుకొన్న బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి బుధవారం, మంగళవారం తీసుకొన్న బట్టలు గురువారం ,బుధవారం తీసుకొన్నవి శుక్రవారం డెలివరి చేయి .వారం చివర్లో వేసేవాటికి చార్జి కొంచెం తగ్గించు ‘’అని చెప్పాడు .ఈ పధ్ధతి నచ్చి అలాగే చేయటం మొదలుపెట్టగా ,ఇతర లాండ్రీల వారు ‘’పిచ్చోడు బొక్క బోర్లాపడతాడు ‘’అన్నారు వెటకారంగా .కానీ మాక్లినన్ అమలు చేసిన విధానం సత్ఫలాల నిచ్చింది .వరుసగా తన ప్రణాలికను నాలుగైదు ప్రకటల ద్వారా తెలియ బర్చేసరికి కాతాదారులు బాగా అలవాటు పడి సోమవారం ఎన్ని బట్టలు వచ్చేవో శుక్రవారంకూడా తగ్గకుండా అన్ని బట్టలు వచ్చి చేతినిండా వారమంతా పని దొరికింది. కష్టమర్లకూ హాయిగా ఉంది. పని చేసేవారికి సుఖంగా ఉంది. యజమానికి లాభాలే లాభాలు .
బట్టలు తీసుకు రావటానికి లాండ్రీ పని అయి డెలివరి చేయటానికి వాహనాలు –వాన్స్ ఏర్పాటు చేసి వాటిని నడిపెవారికి కష్టమర్ల యెడల ఎలా మర్యాదగా ప్రవర్తించాలో నేర్పేవాడు .దీనితో అద్భుత ఫలితాలు రాబట్టాడు .ఇతర లాండ్రీ వారు తొమ్మిది మంది డీలా పడి,ఇతడి దగ్గరకు వచ్చి ‘’చాల్మేట్రీ లాండ్రి లో తమ లాండ్రీలనుకూడా విలీనం చేసుకోమని బ్తతిమిలాడారు .తాను కాదంటే వాళ్ళెం చేయలేరు .కానీ వారి మాట కాదనలేక అలానే విలీనం చేసి,వారికోరిక తీర్చి సంతృప్తి కలిగించాడు .
అప్పుడు అతనికింద 3వేల అమంది పని వారు ఉండేవారు .బట్టలు తీసుకొని మళ్ళీ డెలివరీ చేయటానికి 240 వాహనాలున్నాయి .1930కి అతడి మూల ధనం 10లక్షల పౌన్లు .తన లాండ్రీ తరఫున ఒక బాండ్ మేళం ఏర్పాటు చేసి ,ఉచితంగా ఆనందం కలిగించేవాడు కష్టమర్లకు .ఏడాదికి నాలుగు సార్లు ‘’హో౦ జర్నల్ ‘’పత్రిక ప్రచురించేవాడు .ఒక్కోసంచిక 50వేల కాపీలు ముద్రించేవాడు .స్కూల్ విద్యార్ధులకు వాటిని ఉచితంగా అందించేవాడు .1929లో అట్లాంటా లో కొన్ని లాండ్రీలను కొని ఏకం చేసి పది లక్షల పౌన్ల మూలధనం కల ‘’లాండ్రీ సంస్థ ‘’నెలకొల్పాడు .మురికి బట్టలు ఉతికి ఇస్త్రీ చేయటమేకాదు ,ప్రజలమనసుల్లో ఉన్న మురికి భావాలను ఉతికి ఆరేసి చక్కగా పెళపెళ లాడుతూ ఉండేట్లు చలువ చేసిన ‘’లాండ్రీ విజార్డ్ ‘’బి.సి .మాక్లినాన్ .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-22-ఉయ్యూరు