సంస్కృతం నేర్చు కో౦డి ‘’
అంటూ విద్యావారధి డా .నిష్ఠల సుబ్రహ్మణ్యం(శాస్త్రి ) గారు కిందటి నవంబర్లో పుస్తకం రాసి ప్రచురించి నాకు పంపారు .శాస్త్రిగారు సంస్కృత ఆంధ్రాలలో మహా దిట్టమైన పండితకవి .పొన్నూరు సంస్కృత కళాశాలలో సంస్క్ర్రుత అధ్యాపకులుగా పని చేసినవారు .సరసభారతికి అత్య౦త ఆప్తులు .మేము అడిగినదే తడవగా ‘’శ్రీ సువర్చలాదేవి మంగళ అష్టకాలు ‘’రాసి అందించిన సహృదయులు ..వెయ్యి శ్లోకాల చైతన్య నందనం ,శ్రీ పరశు రామాయణం ,అయ్యప్ప స్వామి వ్రతకల్పం ,జ్యోతిష శాస్త్ర పరిచయం వంటి 34 గ్రంధాలు రచించిన వారు .ఇప్పుడు ఈ ప్రయత్నం లో సంస్కృతాన్ని ఎంత తేలికగా నేర్చుకో వచ్చో చక్కగాసులభంగా వివరి౦చారు .అదేం అంతబ్రహ్మ విద్య కాదు ప్రయత్నిస్తే సంస్కృతం కరతలామలకమే అవుతుందని ప్రేరణ కలిగించారు .పూర్వం శ్రీమాన్ కాశీ కృష్ణాచార్యులు వారు ఇలాంటి పుస్తకాలు సీరియల్స్ గారాసి ప్రచురించి సంస్కృత భాషా బోధనకు ఇతోధికంగా కృషి చేశారని మనకు తెలుసు .
ఈ పుస్తకం లో శాస్త్రిగారు సంస్కృతం అంటే ఏమిటి అని ప్రశ్నించి వివరించి ,అది అందరికి వస్తుందా అనే మరో ప్రశ్నలో ప్రయత్నిస్తే సాధ్యమే అని చెప్పి ఔరంగజేబు తర్వాత పాలించిన అబ్దుల్లా మహమ్మద్ ను గురించి లక్ష్మీపతి కవి ‘’అబ్దుల్లా చరితం ‘’కావ్యం రాశాడని ,అక్బర్ శ్రీహరి అనే విద్వాంసుడిని తన ఆస్థానం లో నియమించాడని ,జగన్నాధ పండితరాయలు ఆసఫ్ ఖాన్ ను వర్ణించాడని కనుక అన్ని మతాల, వర్ణాల వారూ సంస్కృతం నేర్చుకోవటం మంచిదన్నారు .స్త్రీలూ సంస్కృతంలో విద్వాసులయ్యారని ,సంస్కృతంలో 2వేల ధాతువులున్నాయని ,ప్రతి పదానికి వ్యుత్పత్తి ఉండటం సంస్కృత విశేషం అనీ ,,సంస్కృతంలో లేని విషయం ,శాస్త్రం లేదని సరసోక్తులు ,పాటలు తో సహా అన్ని ప్రక్రియలు ఉన్నాయని సస్క్రుతంలో దినవారమాసపత్రికలూ ఉన్నాయని ,ప్రస్తుతం సంస్కృత అధ్యయనం కొంత వెనకబడినా సంస్కృతమే మాట్లాడే గ్రామాలున్నాయనీ ,ప్రపంచ సంస్కృత సమ్మేళనాలు జరుగుతున్నాయని భారతీయ సంస్కృతీ సంస్కృత భాష మనదేశం గొప్పతనానికి ప్రతీకలని చాలా వివరంగా తెలియజేశారు .
ఇందులో 92పాఠాలున్నాయి..మొదటి పాఠంలో పదాలరకాలు చెప్పారు .2లో స్త్రీలి౦గ పదాలకు విభక్తులు ,3లో జంతువులపేర్లు ,తర్వాత సంబోధన ప్రధమావిభక్తి ,5లో ఆహార పదార్దాలపేర్లు ,6లో ద్వితీయా విభక్తి 9లో వాడుకపదాలకు సంస్కృత నామాలు ,10లో కూరలపేర్లు ,14లో వర్తమాన కాల రూపాలు ,15లో ముఖ్యమైన సంస్కృత క్రియలు ,ఆఫీసులలో పనిచేసే వారికి అవసరమైన వ్యవహారజ్ఞానం 16వ పాఠంలో ,19లో పనిముట్లపేర్లు ,24లో రంగులు 25లో రుచులు ,26లో విలాస లేక నిత్యవాడక వస్తువులపేర్లు ,27లో పండ్లు ,పూలు 28లో చెట్లు 29లో వాల్మీకి సూక్తులు ,30లో సంధులు 56లో ఉపసర్గలు ,76నుంచి కావ్యాలలోని నాందీ శ్లోకాలు వివరణ ,84నుంచి చిట్టికథలు 86లో చమత్కారాలు ,87లో కధానిక ,88లో మయూరధ్వజ చరిత్ర ,89లో జైనమతం వర్ధమానుడు ,90లో సమీక్ష రాసే విధానం ,91లో సంస్కృత శిక్షణ గురించి ప్రచారం ,92వ చివరి పాఠంలో సంస్కృతం నేర్చుకోవటానికి వచ్చిన గ్రంథాలతో సంస్కృత ప్రచారం ఉన్నాయి .
శాస్త్రి గారు చాలా పకడ్బందీగా చక్కని వ్యూహం ,ప్రణాళిక తో సంస్కృతాన్ని మనం సులభంగా నేర్చుకోవటానికి కృషి చేసి మన చేతిలో పెట్టిన ‘’కరతలామలకం ‘’ఇది.దీన్ని సద్వినియోగం చేసుకొని మన సంస్కృతినేకాక మన గీర్వాణ వాణిని కూడా నేర్చి ధన్యులమవుదాం .పుస్తకం ఖరీదు -200రూపాయలు .
శాస్త్రి గారి చిరునామా
నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి –డోర్ న౦ -3-3-7 -2nd lane
భావనారాయణస్వామి పేట –పొన్నూరు -522124 గుంటూరు జిల్లా
సెల్-9985101234
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-8-1-23-ఉయ్యూరు