అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -10
10-జాన్ ఎఫ్ . స్టీవెన్స్
కెనడా –ఫసిఫిక్ రైల్ రోడ్ ,,గ్రేట్ నార్దర్న్ రైల్ రోడ్ ,పనామా కాలువ నిర్మించిన ఘనుడు జాన్ ఎఫ్ . స్టీవెన్స్ .కొండల్ని వంతెనలతో కలపటం ,కొండల చుట్టూ దారి చేయటం,,కొండల్ని తొలచటం తో రైలు మార్గాలు ఏర్పాటు చేసిన మేధావి .దక్షిణ అమెరికాకు ఉత్తర అమెరికాకు మధ్య పనామా కాలువ తవ్వి అట్లాంటిక్ ,ఫసిఫిక్ మహా సముద్రాలను కలిపిన చరిత్ర ఆయనది .అతడు ఆనాడు తన ఆలోచనలతో నిర్మించిన ఈ మార్గాలే ప్రపంచ వాణిజ్యాలకు గొప్ప సౌకర్యం కలిగింది డూర తీరాలను చేరువ చేసిన ఘటికుడు .పనామాకాలువగుండా రోజూ వేలకొలది నౌకలు నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి .ఆయన చేసిన పై మూడు పనులు మహత్తర కార్యాలు .చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింప దగినవి .
1930నాటికి స్టీవెన్స్ వయసు 75. అయన నిండు 40ఏళ్ళ వయసులో తన తీవ్రమైన ఒత్తిడి పనులలో ప్రతినెలా ఏదో ఒక తీవ్రప్రమాదానికి గురి అవుతూనే ఉండేవాడు .ఒక్కోసారి ప్రతిరోజూ ప్రమాదాల పాలయ్యేవాడు .వీటి నన్నిటిని అధిగమించి మొక్కవోని ధైర్య సాహసాలతో కర్తవ్య దీక్షతో అంకితభావం తో తన నిర్మాణ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసేవాడు .బద్ధకం అంటే ఏమిటో జీవితకాలం లో ఎప్పుడూ ఎరుగని వాడు .ఎప్పటికప్పుడు కొత్త పనులు నెత్తికి ఎత్తుకోనే వాడు .అవి పూర్తయ్యేదాకా నిద్రపోయేవాడు కాదు .అంతగా కష్టపడి పని చేయటం ఏమానవమాత్రుడికైనా అసాధ్యమే .ప్రపంచంలోని ఇంజనీర్లకు ,రైల్వే మెన్ కు అతడి పేరు సుపరిచితమే .వారందరికే కాక అందరికి అతడు ప్రాతస్మరణీయుడే.
మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో స్టీవెన్స్ కు చాలా కష్టమైన పని అంటే సైబీరియన్ రైల్వేయాజమాన్యం అప్పగించారు .1920 వరకు ఆ రైల్వే మీద రైళ్ళు నడవటానికి తగిన బందో బస్తు చేశాడు .కానీ బోల్షి విజం ఉవ్వెత్తున వచ్చి సైబెరియాను ము౦చేసినప్పుడు సైబీరియన్ రైల్వే యాజమాన్యానికి గుడ్బై చెప్పాడు .అతడి కలలు పండటానికి కుటుంబం లో అంత ఆర్ధికం కాని ప్రోత్సాహం కానీ లేవు .తండ్రి చిన్న టౌన్ దగ్గర ఉండే పేద రైతు .ఊళ్ళో ఉన్న బడిలో చేరి యేవో నాలుగు ముక్కలు చదువు నేర్చుకొన్నాడు .కాలేజి గుమ్మం తొక్కని వాడు . పెరిగి పెద్ద వాడయ్యాక వృత్తి విద్యకు సంబంధించిన పుస్తకాలు పత్రికలూ చదివి జ్ఞానం పెంచుకొన్నాడు .పగలంతా ఒళ్ళు వంచి పని చేసి ,అర్ధరాత్రిదాకా చదువుకొనేవాడు .అతడి జీవితం లో ఒక గొప్ప మార్పు 1882లో జరిగింది ..మానిటొబా గుండా ,,కొండలమీద కెనెడియన్ ఫసిఫిక్ రైలు మార్గం నిర్మించే పనిలో చేరాడు .ఇదొక చాలెంజ్ వర్క్ .కెనెడియన్ ప్రభుత్వం రైల్వే వారికి ‘’10ఏళ్ళలోపు ఈ రైల్వే లైన్ నిర్మిస్తే 50లక్షల పౌన్ల డబ్బు ,2కోట్ల ఎకరాల భూమి ఇస్తాం .గడువు లోపల నిర్మించకపోతే మీకు వచ్చేది ఇచ్చేదీ ఏమీ ఉండదు ‘’అని ఖచ్చితంగా చెప్పింది .రైల్వే కంపెనీ స్టీవెన్స్ ను పిలిచి ‘’కెనడియన్ ఫసిఫిక్ రైల్వే నిర్మాణం మొత్తం నీ చేతుల్లో పెడుతున్నాం పూర్తీ బాధ్యత నీదే ఆ గడువు లోపు దాన్ని పూర్తి చేసి అప్పగించు ‘’అన్నది .క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకొని ,వెంటనే పని ప్రారంభించాడు .6నెలలలో విన్నీ పెగ్ పడమటి వరకు వెయ్యి మైళ్ళ రైల్వే లైన్ నిర్మించాడు..3వేల అడుగుల ఎత్తులో ఉన్న కనుమలను వంతెనలతో కలిపాడు .కొన్ని పర్వతాలను తొలిచి లైన్ నిర్మించాడు .కొన్ని పర్వతాలకు ప్రదక్షిణ మార్గంగా రైల్వే లైన్ నిర్మించాడు .దాదాపు ఇచ్చిన పని అంతా పూర్తి చేసి చివరి రైలు పట్టాలను ఫసిఫిక్ సముద్ర తీరం లో వాంకోవర్ లో వేశాడు .ఇచ్చిన గడువు లో సగంకాలం లోనే అంటే 5ఏళ్ళకే కెనెడియన్ ఫసిఫిక్ రైల్వే లైన్ పూర్తీ చేశాడు .అప్పుడు ప్రఖ్యాత కెనడా నాయకుడు జే.హిల్ మన స్టీవెన్స్ కు కబురుపంపి ,అభినందించి ,అతడికే గ్రేట్ నార్దరన్ రైల్వే లైన్ నిర్మాణం కూడా అప్పగించాడు .
ఈ కొత్త రైల్వే లైన్ కూడా కొండలమీదుగా పోవాల్సిందే .అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని వంగెట్లు చేసినట్లు ఇంద్రుడు వజ్రాయుధంతో కొండల్ని పర్వతాన్ని పిండి పిండి చేసినట్లు గ్రేట్ నార్దరన్ రైల్వే లైన్ నిర్మాణం కూడా అనుకొన్న సమయంకంటే ముందుగా విజయవంతం గా నిర్మించి అప్పగించాడు .తర్వాత పనామాకాలువ నిర్మాణం కూడా అతనికే అప్పగించారు .దానినీ చాలెంజ్ గా తీసుకొని సక్సెస్ ఫుల్ గా నిర్మించి ప్రపంచాన్నిఆశ్చర్య పరచాడు .ఆధునిక ప్రపంచంలో ప్రయాణం సుఖంగా ,సురక్షితంగా చేసిన వారిలో స్టీవెన్స్ వ్రేళ్ళమీద లేక్కపెట్ట వలసిన వారిలో ఒకడు .మహా సముద్రాలమధ్య ఉన్న అడ్డంకులను అతి తేలికగా తొలగించగలిగాడు .కొండంత భారాన్ని మోస్తున్నా చెరగని చిరునవ్వుతో అందర్నీ ఆకర్షించేవాడు. గర్వం లేని మనిషి .సాధు స్వభావంగల పెద్దమనిషి అతడు .
స్టీవెన్స్ సాధించి అద్భుత విజయాలకు తీపి గుర్తుగా ఉత్తర అమెరికాలో ఒక ఎత్తైన పర్వత శిఖరం పై అతని బ్రహ్మాండమైన కాంశ్య విగ్రహం స్థాపించి ఋణం తీర్చుకొన్నారు .అతడి భౌతిక దేహం కొండల్ని పిండిచేస్తే ,కాంశ్యదేహం కొండల నెత్తిపై కెక్కి స్పూర్తి కలిగిస్తూ ఆదర్శంగా నిలిచింది .
అసలు పేరు జాన్ ఫ్రాంక్ స్టీవెన్స్.25-4-18న అమెరికాలోని మైన్ రాష్ట్రంలో వెస్ట్ గార్దినర్ లో పుట్టాడు .90వ ఏట 2-6-1943న నార్త్ కరోలిన సదరన్ పైన్స్ లో చనిపోయాడు .పనామా కాలువ పనిలో ఉండగా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కు ఒక సూచానా చేశాడు Stevens took a number of steps to make the Canal Zone livable for American workers. He improved the food supply and set about a massive project of building worker housing. Most important, he was instrumental in persuading President Theodore Roosevelt of the feasibility of a high-level canal using a combination of locks and a dammed lake. The sea-level canal favoured by a majority of the commission’s members would have required moving additional massive amounts of earth and rock, would have cost more, and would have taken longer to complete. Roosevelt’s resolution of this question in Stevens’s favour permitted work to proceed toward a specific goal.
కాని అధిక శ్రమ చేయలేక 1907 ఏప్రిల్ లో ఆపనికి స్వస్తి చెప్పాడు .కారణాలు పర్సల్ అన్నాడు
.1917లో రష్యాలో ఇంపీరియల్ ప్రభుత్వ పతనం తర్వాత అక్కడి ప్రొవిన్షియల్ ప్రభుత్వం అమెరికా ప్రెసిడెంట్ విల్సన్ ను రవాణా సౌకర్యాలు కలిగించమని కోరితే స్టీవెన్స్ ను పిలిచి అతడి ఆధ్వర్యం లో రైల్వే ఎక్స్పర్ట్ ల బృందాన్ని రష్యాకి పంపి అక్కడి రైల్వే సిస్టం ను గాడిలో పెట్టించారు .ప్రొవిజనల్ ప్రభుత్వం కూలిపోయాక స్టీ వెన్స్ పని కూడా రద్దు అయింది ఆప్రభుత్వం లోని వార్ డిపార్ట్ మెంట్ అతడికి ‘’డిష్టింగ్విష్డ్ సర్విస్ మెడల్ ‘’అందించింది .తర్వాత ఇంటర్ అల్లైడ్ టెక్నికల్ బోర్డ్ అధ్యక్షుడయ్యాడు .తర్వాత కన్సల్టింగ్ ఇంజనీర్ గా అమెరికా ప్రభుత్వానికి సాయం చేశాడు .అతనికి ఫ్రాన్క్లిన్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్క్లిన్ మెడల్ అంద జేసింది అమెరికా ప్రభుత్వం .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-23-ఉయ్యూరు