అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -11
11-హెన్రి డబ్ల్యు .ఎ.డిటర్ డింగ్
1937మే 23 చనిపోయిన జాన్ డేవిసన్ రాక్ ఫెల్లర్ అమెరికా ఆయిల్ కింగ్ అయితే , హెన్రి డబ్ల్యు .ఎ.డిటర్ డింగ్ ఆసియా, ఐరోపా ఖండాల నూనె మారాజు .ఒక రకంగా ఈ ఖండాల రాక్ ఫెల్లర్ .డచ్ వారి తెలివి తేటలన్నీ పుణికి పుచ్చుకొన్నవాడు .కష్టజీవి .రాయల డచ్ షెల్మేక్స్ ఆయిల్ కంపెని చైర్మన్ .ఇంగ్లాండ్ దేశం లో స్థిరపడ్డాడు .అతడు ఏకంగా 125 ఆయిల్ కంపెనీలకు మకుటం లేని మహారాజు .ప్రపంచం లోని ప్రసిద్ధ 12మంది వర్తక ప్రముఖులలో ఒకడు.జీవిత ప్రారంభం లో పెన్నీకి కూడా ఠికాణా లేని నిరుపేద .అతని ఆస్తి పనిలో మెలకువ, శౌర్య ధైర్యాలు మాత్రమె .ఆం ష్టర్ డాం లో ఒక మారుమూల వీధిలో పుట్టాడు .తండ్రి ఓడ కెప్టెన్ .హెన్రి మొదటి ఉద్యోగం ఒక బ్యాంకి లో ఉత్తరాల బట్వాడా .
ఆ బ్యాంక్ లో ఎదుగు బొదుగులోని ఆఉద్యోగం లో తన 22వ ఏడు వరకు పని చేశాడు .తర్వాత తెలుసుకొన్నాడు తన తెలివి తేటలకు ఆఉద్యోగానికి ఏమీ సంబంధం లేదని ,తాను స్వంతంగా వ్యాపారం చేయగలనని నమ్మకం కుదిరింది. అంతే ఆ ఉద్యోగం వదిలేశాడు .నెదర్లాండ్స్ ట్రేడింగ్ కంపెనీలో ఉద్యోగం పొందాడు .ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిదే .అతడిని డచ్ వలస రాజ్యాలలోజూనియర్ క్లెర్క్ ఉద్యోగం లో కంపెని నియమించింది.తన ప్రజ్ఞా పాటవాలు చూపించటం ప్రారంభించాడు .పై అధికారులిచ్చిన పనికంటే ఎక్కువ చేసేవాడు .తాను కంపెని జీతగాడిని అనే దృష్టి తోకాక ,కంపెనీ భాగస్వామిని అనే దృష్టితో పని చేశాడు .ఈ గుణాన్ని మెచ్చి కంపెని అతడిని సేల్స్ మాన్ ని చేసింది .అప్పటి నుంచి నక్కను తొక్కినట్లు అదృష్టం తేనే తుట్టేలా పట్టింది ‘
రెండేళ్లలో రాయల్ డచ్ ఆయిల్ కంపెని సేల్స్ మేనేజర్ అయ్యాడు .వెంటనే ప్రపంచ సేల్స్ మెన్ జాబితాలో ముందువరుసలో చేరాడు .ప్రత్యర్ధి గ్రూప్ ఖాతాదారులను ఆకర్షించటం అతడి ప్రత్యేకత .దీనితోనే కంపెనీ మూడు పూలు ఆరు కాయలుగా వృద్ధి చెందింది .కొత్త ఖాతాదారులను బాగా ఆకర్షించేవాడు .అలాంటి నమ్మకస్తులకు బేరల్ ఆయిల్ చాలా చౌకగా అమ్మేవాడు .ఆయిల్ బిజినెస్ లో ఆనాడు అతడికి పోటీ లార్డ్ కౌడ్రే .క్వాడ్రే అనుకొంటేఆయిల్ కింగ్ రాక్ఫెల్లర్ అంతటి వాడు అయి ఉండేవాడు .తెలివిగా హెన్రి క్వాడ్రే కు ఒక్కసారిగా 150లక్షల పౌన్లు ఇచ్చి, ఆయిల్ బిజినెస్ నుంచి తప్పుకోనేట్లు చేసి పోటీ లేని ఆయిల్ కింగ్ అయ్యాడు .
లార్డ్ బియర్డ్ తో కలిసి షెల్ ఆయిల్ కంపెనీని తన ఆయిల్ కంపెనీలో చేరేట్లు చేశాడు .1930లో జర్మన్ ఆయిల్ కంపెనీలను కూడా తన స్వాధీనం లోకి తెచ్చుకొనే ప్రయత్నం చేశాడు .ఆయిల్ ఉత్పత్తి చేసే 5రిఫైనరీలకు వలస రాజ్యం లో వెయ్యి యకరాలస్థలం లో ఉన్న నూనె గనులకు అతడు యజమాని అయ్యాడు .1930కి 62ఏళ్ళు వచ్చాయి .తల నెరిసింది కళ్ళు నల్లబడ్డాయి ,చర్మకాంతి తగ్గింది .అతనిది సింహపు పోకడ. అవసరమైతే నాలుగడుగులు ముందుకు దూసుకు వెళ్ళగలడు .కాదంటే రెండు అడుగులు వెనక్కి వెళ్లి సింహావలోకనం చేసుకొని మళ్ళీ దూకగలడు .వ్యాపార వ్యాప్తి అతడి ప్రధాన లక్ష్యం . హెన్రి ఆఫీస్ లండన్ లోఅయిదవ అంతస్తు లో ఉంది .అతని చుట్టూ రౌండ్ టేబుల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది .పారశీక దేశం లో తప్ప ప్రపంచం లోఆయిల్ ఉన్న అన్ని దేశాలలో అతని కంపెనీకి ఆస్తులున్నాయి . ఆఫీసు గదిలో ప్రపంచ పటం గోడకు వేలాడుతూ ఉంటుంది. అతని అకౌంట్ ఉన్న బ్యాంకి చాలా దగ్గరే .
62ఏళ్ళ కితం ఆం ష్టర్ డాంలో ఒక మారుమూల వీధిలో ,ఒకచిన్న గుడిసెలో అత్యంత పేదరికం తో గాలికి తరచూ ఆరిపోయే కొవ్వొత్తి వెలుగులో ప్రపంచ యాత్రలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేవాడు .గుమాస్తా గా జీవితం ప్రారంభించి ,నూనె పరిశ్రమకు సంబంధించిన పుస్తకాలు చదివి ఆశాస్త్రంలో విజ్ఞానం స్వయంగా సాధించి ,అతడు ఆసియా ఐరోపా ఖండాల ఆయిల్ కింగ్ అయ్యాడు .
హెన్రి 19-4-1866లో జన్మించి 4-2-1939 న మరణించాడు .రాయల్డచ్ పెట్రోలియం కంపెని ఎక్సి క్యూటివ్ .36ఏళ్ళు జనరల్ మేనేజర్ .రష్యాలోని అజర్ బైజాన్ లో ఉన్న తన ఆస్తులను రష్యా జాతీయం చేయటం చేత రష్యా అంటే విపరీతమైన కోపం .సర్వేట్టా, సెయింట్ మారిట్జ్ ,స్విట్జర్లాండ్ లలోకూడా హేన్రికి ప్రాపర్టీస్ ఉన్నాయి .డిటర్ డింగ్ అంత్యక్రియలను నాజీ ప్రభుత్వం అత్యంత గౌరవంగా నిర్వహించింది .దీనికి కారణం అతడు NSDAP కి ముఖ్య ఫైనాన్షియర్అవటం ,నాజీ ప్రభుత్వాన్ని సమర్ధించటం .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-23-ఉయ్యూరు