సరస భారతి 170 వ కార్యక్రమ౦గా సామూహిక సత్యనారాయణ వ్రతం
సరసభారతి 170 వ కార్యక్రమంగా మాఘ శుద్ధ అష్టమి 29-1-23 ఆది వారం (రధ సప్తమి వెళ్ళిన మర్నాడు )ఉదయం 9గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో సామూహికంగా ఆవు పిడకలపై ఆవుపాలు పొంగించి పొంగలి తయారు చేయటం జరుగుతుంది .
ఉదయం 9-30గం .లకు ఉచితంగా సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహింప బడుతుంది .ఎలాంటి రుసుము ఎవ్వరూ చెల్లించాల్సిన అవసరం లేదు .పూజా సామగ్రి అనగా ఒక చిన్న తుండు గుడ్డ ,ఒక జాకెట్ ముక్క ,సత్యనారాయణ ,లక్ష్మీ దేవి ల వెండి విగ్రహాలు ,ఎరుపు ,పసుపు ,తెలుపు , నీలం మొదలైన రంగు పుష్పాలు ,6కొబ్బరికాయలు ,కర్పూరం అగరు వత్తులు ,దీపారాధన ,నూనె, వత్తులు వగైరా ఎవరికీ వారే తెచ్చుకోవాలి .ప్రసాదం మాత్రం ఆలయం తరఫున చేయించి అంద జేయబడుతుంది .
వ్రతం లో పాల్గొను భక్తులు ముందుగా ఆలయ అర్చకస్వామికి తెలియజేసి ,పేర్లను నమోదు చేయించుకోవాలి .
గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,సరసభారతి అధ్యక్షులు
17-1-23-ఉయ్యూరు