’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -2
3-పా౦డిత్యాభిలాష
హుగ్లీ నది ఒడ్డున కలకత్తానగరం వెలసిన చోట ఒకప్పుడు జాబ్ చార్నాక్ గుడిసెలు లేవకముందే ,ఒరిస్సాలోని బాలాసోర్ లో రేవుపట్టణం ఉచ్చ దశలో ఉండేది .పదేళ్ళ ఫకీర్ మోహన్ ఆసాగర తీరం లో గతవైభవానికి కల్లోల సాగర తరంగాలకు ,ప్రళయ భీభత్సానికి నిలువెత్తు నిదర్శనాలుగా రచనలు చేశాడు .బాలాసోర్ పోర్ట్ గురించి ‘’అది సౌభాగ్యమైన వర్తక కేంద్రం .రోజుకు అయిదారు వందల నౌకలు వస్తూ పోతూ ఉండేవి .ఒరిస్సా ఉప్పును రంగూన్,కొలంబో మొదలైన చోట్లకు ఎగుమతి చేసేవి .స్టీమర్లు ఇంకా రాలేదు .ఓడలకు ఆరు నుండి పన్నెండు తెరచాపలు౦డేవి .అవి త్రికోణ, చతురస్రాకారంగా ఉండేవి .తెరచాపలు పెద్దవైతే తుఫానులలో ఓడలు తలక్రిందులయే ప్రమాదం ఉంది. .చిన్న తెరచాపలైతే అసలు ప్రయాణానికి వీలే ఉండేదికాదు .మా నాన్న ,పెదనాన్న ఓడ గుత్త దార్లుగా జీవనోపాధి పొందారు .వ్యాపారులు ఈ గుత్దార్లద్వారానే సరుకు పంపటం జరిగేది .కేన్వాసు తెరచాపలు కుట్టటానికి మా ఇంటి నిండా కుట్టు పని వారు ఉండేవారు .అది మాకు మంచి లాభ సాటి గా ఉండేది ‘’అని రాశాడు .
ఉప్పునీటి వజ్రాలు
బాలాసోర్ లో కూలిగా మోహన్ చేరేనాటికి ఆరేవు వైభవం చాలాభాగం కాలగర్భం లో కలిసే పోయింది .అందుకే పెదనాన్న ఉప్పు శాఖలో అతడిని చేర్చాడు .పెద్దవాడయ్యాక రేవు వైభవం పూర్తిగా పోయాక ,నికృష్టంగా మారటం చూసి వ్యధ చెందాడు .బాలాసోర్ పోర్ట్ ఇండియాలోనేకాక ప్రపంచమంతా పేరు మోసింది .డచ్, స్పానిష్ , ఫ్రెంచ్ ఇంగ్లిష్ వారు బెంగాల్ లో స్థిరపడటానికి ముందు బాలాసోర్ లో వ్యాపార కేంద్రాలు ప్రారంభించారు .ఒకప్పుడు మహా రద్దీగా ఉన్న నదీ కేంద్రం ఇప్పుడు స్మశాన స్తబ్దత తో ఉంది ,అడవులతో కప్పబడిపోయింది .ఒడ్డుమీదబురదా ఇసుకా తప్ప ఏమీలేవు కనుక చూడటానికి కూడా ఎవరూ పోరు .బియ్యం ,బట్టలు కంటే, ఇక్కడినుంచి ఉప్పు ఎక్కువగా రవాణా అయ్యేది .ఆపట్టణ వైభవం అంతా ఉప్పు వల్లనే .బాలాసోర్ కి ఉత్తరాన సువర్ణ రేఖ దగ్గర నుంచి దక్షిణంలో ధమ్ర లోని మహానది దాకా విపరీతంగా ఉప్పు తయారయ్యేది
ప్రభుత్వం ఉప్పును స్వాధీనం చేసుకోవటం
ఉప్పు పరిశ్రమను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది .దీనితో బాలాసోర్ కేకాక యావత్తు ఒరిస్సాకు తీవ్ర నష్టం కలిగించింది .ఒరిస్సా భాగ్యదేవత అక్కడినుంచి లివర్ పూల్ ,ఇతర ప్రాంతాల్లో స్థిరపడింది .ఒరిస్సాకు పట్టిన ఈ దుర్గతిని ఫకీర్ మోహన్ జీర్ణించుకోలేక పోయాడు .ఉప్పు జాతీయ పరిశ్రమ కావాలని ఆతర్వాత యాభై ఏళ్ళకు గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు .ఫకీర్మోహన్ ‘’మా ఉప్పు మళ్ళు మట్టిని ఇచ్చి ఇతర దేశాలనుంచి బంగారం తెచ్చుకోనేవారు .ఇప్పుడు పాశ్చాత్యుల వస్తువులకోసం బంగారాన్ని ధారపోస్తున్నారు .బాలాసోర్ ఒక్కటేఅప్పుడు ఏడాదికి 9లక్షల మణుగుల ఉప్పు తయారు చేసేది .ఒరిస్సాలో ఓడల మీద తిరిగే ‘’కై బర్తులు ‘’కు ఆధునిక నౌకా శాస్త్రం లో ప్రవేశం కలిగించి ఉంటె ,ఈ నాడు ఉప్పు వర్తకం ఎంత ఉచ్చదశలో ఉండేదో ?’ ఆనాడు రైల్వే లో ఒక్కవొరియన్ కూడా ఉద్యోగం సంపాది౦చుకోలేకపోయాడు .వ్యవసాయమే ఆధారమైంది .అయినాసాగుభూమి చాలాతక్కువే .అని బాధ పడ్డాడు .
అవిరామ విజ్ఞానాన్వేషి
ఉప్పు శాఖలో పని చేస్తూ ఫకీర్ బెంగాలీ పర్షియన్ సంస్కృతం అక్కడి ఉపాధ్యాయులవల్ల నేర్చాడు .మన శ్రీకాకుళం లోని టెక్కలి లో కూడా కొంతకాలం ఉన్నాడు .అప్పుడు ఆయనకు యాభై ఏళ్ళు ఉన్నా ,ఒక తెలుగు పండితుని కుదుర్చుకొని తెలుగు నేర్చుకున్నాడు .ఆయనకు23ఏళ్ళు వచ్చేదాకా ఇంగ్లీష్ లో ఒక్క అక్షరం కూడా రాదు .కానీ అప్పటికే బాలాసోర్ మిషినరి స్కూల్ లో ప్రధాన పండితుడు .ఇంగ్లీష్ రాకపోయినా పట్టణం లో మంచి గుర్తింపు ఉండేది .అతని సహజ మేధకు విదేశీయులు అబ్బురపదేవారు .ఒకసారి ఒక యూరోపియన్ అధికారి చీదరించటం వలన తక్షణం రాజభాష ఇంగ్లీష్ నేర్చుకోవటం మొదలుపెట్టి డిక్షనరీ సాయంతో అరేబియన్ నైట్స్ ,రాబిన్సన్ క్రూసో ,లాల్ బెహారీ డే రాసిన ‘’బెంగాల్ పెజెంట్ లైఫ్ ,ఇంగ్లిష్ బైబిల్ చదివాడు .
విద్యలో వింత
బాలాసోర్ లో ఉప్పు శాఖ మూసేశాక ,15ఏళ్ళ ఫకీర్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు .ఉద్యోగంకోసం కాలికి బలపం కట్టుకోనితిరిగాడు .ఉద్యోగం రాకపోయినా వక్తిత్వం ఏర్పడింది .పెంచిన నాయనమ్మకు కూడా చెప్పకుండా బాలాసోర్ లోని మిషినరి స్కూల్ లో చేరాడు .అప్పటిదాకా అర్ధనగ్నపు బట్టలే శరణ్యం .చొక్కాకూడా ఉండేదికాదు .పెదనాన్న కొడుకు నిత్యానందం మాత్రం ఖరీదైన శాటిన్ బట్టలతో బడికి వెళ్ళేవాడు .మోహన్ పట్ల ఆ కుటుంబం లో అసూయా అల్పత్వం పెరిగిపోయాయి .లాంతర్ దగ్గర చదువుకొనే పెదనాన్న కొడుకు మోహన్ కు అక్కడ చదువుకొనే అవకాశం ఇచ్చేవాడు కాదు .అందుకే పట్టుబట్టి స్కూల్ లో చేరాడు .
అక్కడ చరిత్ర భూగోళం లెక్కలు మొదటి సారి చూడగానే పరవశించిపోయాడు .ఆంగ్లకవి కీట్స్ మొదటిసారిగా ‘’చాప్ మన్స్ హోమర్ ‘’ చదివినప్పుడు పొందిన ధ్రిల్ పొందాడు ఫకీర్ .అతడి మేదకు వినయానికి నిజాయితీకి ఉపాధ్యాయులు సంతోషించారు కానీ ఈ దురదృష్టవంతుడు నెలకు కట్టాల్సిన పావలా జీతం కూడా కట్టలేకపోయాడు .మామ్మ వత్తిడివలన పెదనాన్న ఒక ఏడాది జీతం కట్టినా ,రెండో ఏడు మొండికేసి కట్టనన్నాడు .ఆరు నెలల నిరాశా నిస్పృహలు తర్వాత చదువు మానేశాడు .
విద్య పరిపూర్తి
విషయాలన్నీ తెలుసుకొంటున్న నాయనమ్మ అతడితో ‘’చదువుకోసం ఎందుకు అంత ఆరాటం ?కొంచెం ఆగు నీ అంతట నువ్వే ఎంతడబ్బు సంపాదిస్తావో చూడు ‘’అని ధైర్యం చెప్పేది .ఆ నిష్కల్మష ప్రేమ హృదయ దీవనే ఫలించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-23-ఉయ్యూరు