‘’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -3
ఉపాధ్యాయుడు రచయిత ప్రచురణకర్త
ఫకీర్ అదృష్టం పండి అతడు చదివిన స్కూల్ లోనే ఉపాధ్యాయుదిగాఉద్యొగ౦ లో చేరాడు .నెలకి రెండున్నర రూపాయలజీతం .మామ్మ పట్టరాని సంతోషం పొందింది .అతడు బోధించే తీరుకు మెచ్చి జీతం నెలకు నాలుగు రూపాయలు చేశారు .ఆనాటి పైసా ఇవాళ రూపాయి కంటే చాలా ఎక్కువే .భూగోళం బోధించటానికి మాప్స్ తానె తయారు చేసుకొనేవాడు .మూడవ ఏట లెక్కలు చెప్పమని కోరగా ఆల్జీబ్రా ట్రిగోనామెట్రి వగైరా స్వంతంగా నేర్చుకొని గొప్పగా బోధించాడు .ఓడ కూలి మహామహ ఉపాధ్యాయుడయ్యాడు .లేక్కలేమిటి సాహిత్యమూ బోధించే స్థాయికి వచ్చాడు .అతని బోధన గొప్ప కీర్తి తెచ్చింది .ప్రధానోపాధ్యాయ పదవి ఖాళీ అయితే ఆలోచించకుండా మోహన్ నే నెలకు పది రూపాయల జీతానికి నియమించారు .అప్పుడే అతనికి యూరోపియన్ అధికారుఅల్తో మిషనరీ వ్యవస్థతో మంచి పరిచయమేర్పడింది .కంపారటివ్ గ్రామర్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ రాసిన కలెక్టర్ జాన్ బీమ్స్ తో పెద్ద పరిచయమే ఏర్పడింది .బీమ్స్ ‘’మెమరీస్ ఆఫ్ ఎ బెంగాల్ సిటిజన్’’ అనే పుస్తకం రాసి అందులో సమకాలీన జీవితపు చీకటి వెలుగులన్నీ వర్ణించాడు .అప్పటికే బెంగాలీ హిందీ అస్సామీ నేర్చిన బీమ్స్ ఒరియాను ఫకీర్ మోహన్ వద్ద నేర్చుకొన్నాడు .బీమ్స్ గురించి రాస్తూ ఫకీర్ ‘’బీమ్స్ పదకొండు భాషలలో నిష్ణాతుడు .సమగ్ర భాషా వ్యాకరణం కోసం ఇన్ని భాషలు నేర్చాడు .వారానికి ఒక్కసారైనా మేము కలిసేవాళ్ళం .ఎప్పుడైనా రెండు రోజులు ఆలస్యంగా వస్తే ‘’బాబూ !ఎందు కింత ఆలస్యం చేశారు ?’’అని గౌరవంగా అడిగేవాడు .క్లిష్టమైన సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానం ,’’రస కల్లోల ‘’అనే ఒరియా శాస్త్రీయ ప్రామాణిక గ్రంధం ,జన వ్యవహారంలో ఉన్న పాము,తే లు మంత్రాలు మామధ్య చర్చ లో ఉండేవి .అతని పరిచయం వలన పెద్ద పెద్ద బెంగాలీ ఆఫీసర్లు కూడా నన్ను అత్యంత గౌరవంగా చూసేవారు .ఒరిస్సాలో స్త్రీ విద్యకు ఒరియా భాషాభి వృద్ధికి నేను కృషి చేస్తున్నప్పుడు అతడి నుంచి గొప్ప సహాయం లభించేది .నా జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కోవటానికి బీమ్స్ ఎంతో సాయపడి అండగా నిలిచాడు .ఇప్పటికీ అతని ఆత్మశాంతికోసం రెండుపూటలా ప్రార్ధన చేస్తాను ‘’అని గొప్ప ఆరాధనా భావంతో రాసుకొన్నాడు .
స్కూల్ లో పని చేస్తున్నప్పుడే దేశ భక్తుడిగా రచయితగా పండితుడిగా ప్రసిద్ధి పొందాడు .అతని నాయకత్వం లో ఆస్కూలు గణనీయ మైన అభి వృద్ధి సాధించి ప్రతి ఏడాదీ ప్రభుత్వ స్కాలర్ షిప్స్ ఆ స్కూల్ విద్యార్థులకే కే ఎక్కువ గా వచ్చేవి .లెక్కలు హిస్టరీ జాగ్రఫీ, ట్రిగోనామెట్రి పాఠ్యపుస్తకాలు రచించి ప్రభుత్వ బహుమతులు పొందాడు .అతనికీర్తి ఒరిస్సా అంతటా వ్యాపించింది .ఒరియాలో సరైన పాఠ్య గ్రంధాలు లేవని బెంగాలీలు ఆక్షేపించేవారు .అది తొలగి౦చ టానికిఅత్యుత్తమమైన పాత్యపుస్తకాలు రాసి అందరి అభిమానం పొందాడు మోహన్ ..తన భాష ఘోషను ‘’ఎప్పుడైనా ఒక బెంగాలీపుస్తకం దొరికితే చదివి ఇలాంటి పుస్తకం నా ఒరియాలో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేవాడిని .నా గుండె రోదించేది .అప్పటినుంచి ఏపని చేస్తున్నా నా అంతరాన్తరాలలో ఒరియా భాషాభి వృద్ధి గురించే ఆలోచనలు సుళ్ళు తిరిగేవి .ఒరియాలో నేను రచయితను కాగలనా అనుకొనేవాడిని .ప్రయత్నిస్తూ రాసినవాటిని బెంగాలీ ‘’సోమ ప్రకాష్ ‘’పత్రికకు పంపేవాడిని .అవన్నీ ప్రచురింప బడేవి .నాకు ఉత్సాహం వచ్చేది .మా వూళ్ళో కృష్ణలీల ఉత్సవానికి పాటలు రాశాను .వాటిని గాయకులూ మధురంగా పాడుతుంటే పరవశించేవాడిని .వచనంలోనూ ప్రయత్నించి ‘’ఒక రాకుమారుని చరిత్ర ‘’రాయగా మిత్రులు ఒరిస్సాకు అంతటికీ కటక్ లో ఉన్న ఒక మిషన్ ప్రెస్ కు పంపగా ,దాని ప్రచురణకు మూడు వందల రూపాయలు అవుతుందని ప్రెస్ వారు తెలియజేయగా ఆప్రయత్నం మానుకొన్నాను ‘’అని రాసుకొన్నాడు .
ఆనాటి సామాన్య ఉత్కలుడు రాగాలతో పాడే పద కవిత్వాన్నే ఆన౦ దిందిచేవాడు .గద్యం అంటే భయపడేవాడు .ఒరియాలో అచ్చు వేయటానికి అతని మిత్రులు ఒక అచ్చుయంత్రం కొన్నారు .కటక్ లోకాకుండా రెండవ ముద్రణాలయం బాలాసోర్ లో స్థాపించాలని తెలిసిన వారందరి దగ్గర చందాలు వసూలు చేసి ,కలకత్తానుంచి యంత్రాలను ఎడ్ల బండీ మీద బాలాసోర్ కు చేర్చటానికి 22రోజులుపట్టింది .అ౦తా సిద్ధం చేసి ‘’సేనాపతి ముద్రణాలయం ‘’అని పేరుపెట్టి పని ప్రారంభించారు .కమీషనర్ తో సహా అనేకులు ప్రెస్ ఎలా పనిచేస్తు౦దో చూడటానికి వచ్చి అబ్బురపడ్డారు అభినందించారు సేనాపతినీ మిత్ర బృందాన్నీ .కమీషనర్ ఇతని సాహస ప్రయోగానికి మెచ్చి పది రూపాయలు నగదు బహుమతినిచ్చి సత్కరించాడు .అదే అతడి పెట్టుబడి అయింది .ప్రెస్ ఎత్తేసినప్పుడు అతనిభాగంతో లాభాలుకలిపి కమీషనర్ కు 30రూపాయలు ఇచ్చేశాడు సేనాపతి .
ఫకీర్ పత్రికా ఉత్సాహం చూస్తె బెంజమిన్ ఫ్రాన్క్లిన్ గుర్తుకొస్తాడు . హెడ్ మాస్టర్ గిరీ చేస్తూ ,పుస్తకాలు రాస్తూ ముద్రిస్తూ ‘’బోధ దాయిని ‘’,బాలాసోర్ సంబంధ బాహిక ‘’అనే రెండు పత్రికలూ నడిపాడు .రాసేవాడూ అచ్చేసేవాడూ పంపిణీచేసేవాడూ , ఆర్ధిక స్థితి చూసేవాడు అన్నీ ఒక్కడే అయిన ఏక్ నిరంజన్ ఫకీర్ మోహన్ సేనాపతి మాత్రమె .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-23-ఉయ్యూరు