· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -386

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -386

· 386-స్క్రీన్ ప్లే ,డైలాగ్ రైటర్ వాంటెడ్ ,జవాన్ దర్శకుడు –బి.వి.ఎస్.రవి .

· బి.వి.ఎస్ రవి (జననం 1974 జూన్ 22) తెలుగు చిత్రాలలో పనిచేసే భారతీయ స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్. సన్నిహితులు మచ్చ రవిగా పిలుచుకునే బి.వి.ఎస్ రవి పూర్తిపేరు బాచిమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి.[2]

కెరీర్
పోసాని కృష్ణమురళికి సహాయ కథా రచయితగా శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్యా, భద్రాచలం వంటి చిత్రాలకు బి.వి.ఎస్ రవి పనిచేసాడు. ఇక 2011లో వాంటెడ్ చిత్రానికి దర్శకుడిగా మారాడు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించగా గోపీచంద్, దీక్షా సేథ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2012లో వివాదాస్పద హిట్ చిత్రం దేనికైనా రెడీకి ఆయన కథ అందించాడు. పూరి జగన్నాథ్‌తో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, దేవుడు చేసిన మనుషులు చిత్రాలకు సహ రచయితగా ఉన్నారు.

బి.వి.ఎస్ రవి సెకండ్ హ్యాండ్ చిత్రానికి నిర్మాతగా మారాడు. ఆయన తక్కువ బడ్జెట్‌లో చిత్రాన్ని దృశ్యపరంగా, సాంకేతికంగా అద్భుతంగా పూర్తి చేయడం ద్వారా తన నిర్వహణ, సృజనాత్మక నైపుణ్యాలను ఈ చిత్రంతో నిరూపించాడు.[3] తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ షాట్ సినిమాటోగ్రఫీ అనే కాన్సెప్ట్‌ను రూపొందించిన మొదటి నిర్మాత బివిఎస్ రవి గా గుర్తింపుతెచ్చుకున్నాడు.

రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రవితేజ, దిల్ రాజు, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్నలకు ఆయన సన్నిహితుడు.

ఫిల్మోగ్రఫీ
దర్శకుడిగా
Year

Title

2011

వాంటెడ్

2017

జవాన్

నిర్మాతగా
Year

Title

2013

సెకండ్ హ్యాండ్

నటుడిగా[మార్చు]
Year

Title idi ra BVS

2004

కేడీ నం:1

2005

శ్రావణమాసం

2005

అయోధ్య

2006

నాయుడమ్మ

2021

క్రాక్

స్క్రీన్ రైటర్‌గా
Year

Work

Notes

2021 – ప్రస్తుతం

ఏబుల్

టాక్ షో

2017

జవాన్

2015

డైనమేట్

2014

పాండవులు పాండవులు తుమ్మెద

2013

గౌరవం

2013

ఇద్దరమ్మాయిలతో

2012

దేనికైనా రెడీ

2012

కెమెరామెన్ గంగతో రాంబాబు

2012

దేవుడు చేసిన మనుషులు

2011

వాంటెడ్

2010

తకిట తకిట

2010

ఝుమ్మంది నాదం

2009

జయూభవ

2009

సలీం

2008

తులసి

2008

కింగ్

2008

పరుగు

2007

మున్నా

2007

అతిధి

2006

నాయుడమ్మ

2006

రామ్

2005

ధన 51

2005

నాయకుడు

2005

చక్రం

2005

అయోధ్య

2005

భద్ర

2003

సత్యం

2002

ఖడ్గం

2002

ఖైదీ బ్రదర్స్

2002

గర్ల్ ఫ్రెండ్

· 387-‘వాడుక భాషలో ‘’శ్రీ సత్యనారాయణ ‘’సినిమా నిర్మించి ,’ఆంధ్రా శాంతారాం‘’గా38 మంది నటులను పరిచయం చేసిననిర్మాత ,నటుడు,దర్శకుడు,ఎస్వి .రంగారావు మేనమామ –బి.వి. రామానందం

బి.వి.రామానందం (బయ్యపునీడి వెంకట రామానందం) తెలుగు సినిమా దర్శకుడు. ఇతను ఎస్.వి.రంగారావుకు తెలుగు సినిమాకు పరిచయం చేసిన వ్యక్తిగా సుపరిచితుడు. అనేక మంది నటులను సినీ పరిశ్రమకు పరిచియం చేసినజీవిత విశేషాలు
బయ్యపునీడి వెంకట రామానందం 1902 జనవరి 2న రాజమండ్రిలో జన్మించాడు. చిన్నతనంలో లలిత కళల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒకపక్క విద్యాభ్యాసం చేస్తుందగానే మరో పక్క నాటకాలలో నటించేవాడు. బెనారస్ లో ఎఫ్.ఏ పరీక్ష ఉత్తీర్ణుడైన తరువాత ఆగస్టు 1922లో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న సమయంలో మూకీల చిత్ర నిర్మాణం సాగుతుంది. చిన్నతనం నుండి కళా రంగంలో ఆసక్తి ఉండటంతో అతను సినిమా రంగంలోకి ప్రవేశించాడు. మొదట ఫిలిం పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. దీని కోసం కలకత్తా వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఫిలిం పంపిణీ వ్యాపారం జరిగే తీరుని పరిశీలించి ఒక అవగాహనకు వచ్చాడు. రాజమండ్రికి వచ్చి “రాధాకృష్ణ ఫిలిం డిస్ట్రిభ్యూషన్” పేరుతో ప్యాపారం ప్రారంభించాడు. అదే సమయంలో కలకత్తా నుండి వచ్చిన సి. పుల్లయ్య రాజమండ్రిలో ఆంధ్రా సినీటోన్ స్టుడియోను స్వాధీనం చేసుకొని ఆంధ్రా టాకీస్ పతాకంపై శ్రీ సత్యనారాయణ చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. వాడుక భాషలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇది. రామానందం పుల్లయ్య వద్ద సహాయకునిగా చేరాడు. ఆ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు.[1]

నిర్మాతగా
అతను చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించాలనుకున్నాడు. అతను భారత లక్ష్మీ ఫిలిమ్స్ వారితో కలసి సక్కుబాయి సినిమాను నిర్మించాడు. అది 1935 మే 21న విడుదలైంది. ఈ చిత్రంలో 50 పాటలున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తానే రాధా ఫిలిం కంపెనీ చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి 1935లో భక్త కుచేల సినిమాను నిర్మించాడు. బళ్లారి పండితుడు సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన నాటకం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో భారీ సెట్స్ వేసి చిత్రీకరించాడు. ఈ సినిమా విజయవంతమైంది.

1938లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాటక ఆధారంగా కచ దేవయాని చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వర్తించాడు. ఈ సినిమాకు సంజివని అనే పేరు కూడా ఉంది. కచదేవయాని ఇతివృత్తాన్ని ఆసక్తి కరంగా తెరపై మలచి దర్శకునిగా గుర్తింపు పొందాడు. 1939లో పాడురంగ విఠల సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం కూడా విజయవంతమైంది.

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సమయంలో అతను చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపుచేసి రాజామండ్రి చేరుకున్నాడు. ఆరేళ్ళ పాటు నిర్మాణం జోలికి పోలేదు. తరువాత మరల వరూధిని సినిమా నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. అతను సేలంలో ఉన్న మోడరన్ థియేటర్స్ స్టుడియోలో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ సినిమాలో కథానాయకుని పాత్రకోసం తన మేనల్లుడైన ఎస్.వి.రంగారావును ఎంపిక చేసాడు. ఆ చిత్రంలో కృష్ణదేవరాయలు, ప్రవరాఖ్యుడు పాత్రలను ఎస్.వి.రంగారావు పోషించాడు. ఈ సినిమా 1947 జనవరి 11న విడుదలైంది. కానీ విజయవంతం కాలేదు. అతనికి ఆర్థికంగా నష్టం కలిగించింది. దీనితో సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు.[2]

నటునిగా
అంతవరకు పౌరాణిక సినిమాలను తీసిన అతను తన పంథాను మార్చుకుని సాంఘిక సినిమాల నిర్మాణంపై దృష్టి సారించాడు. అలా గొల్లపిల్ల సినిమాను తీసాడు. యాదవ కులస్థులు అభ్యంతరం వల్ల ఆ చిత్రానికి పెంకి పిల్ల గా శీర్షికను మార్చారు. ఆ సినిమాకు దర్శకునిగానే కాక అందులో న్యాయమూర్తి పాత్రను పోషించాడు. ఆ సినిమా విజయవంతం కాలేదు.

అస్తమయం
అతను 1955లో జై వీర భేతాళ చిత్రాన్ని ప్రారంభించాడు. కానీ ఆ సినిమా పూర్తి కాకుండానే అతని ఆరోగ్యం దెబ్బతినడం మూలంగా 1955 అక్టోబరు 27న మరణించాడు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.