మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -388
· 388-ముద్దమందారం ప్రొడక్షన్ ఎక్సి క్యూటివ్,బాలీ వుడ్ కాలింగ్ ,మిస్సమ్మ ,మాయాబజార్ నిర్మాత – బొల్లు సత్యనారాయణ
· బొల్లు సత్యనారాయణ తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు
ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం లోని జువ్విగూడెం గ్రామం.
ఆయన భార్య అన్నపూర్ణమ్మ తితిదే పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆయనకు కుమార్తె హరిత కుమారుడు తేజస్వి ఉన్నారు. సత్యనారాయణ సినీ ప్రస్థానం 1981లో ‘ముద్దమందారం’తో ప్రారంభమైంది. ఆ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. 2002లో ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’తో నిర్మాతగా మారారు. ఆపై ‘బాలీవుడ్ కాలింగ్’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’ తీశారు. అనువాద చిత్రాలు ‘అభిమన్యుడు’, ‘గీతాంజలి’ ఆయనే నిర్మాత.[1]
చిత్రాలు
ఆయన సత్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘బాలీవుడ్ కాలింగ్’, ‘ధనలక్ష్మి ఐ లవ్ యూ’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలను నిర్మించారు.ఆయన నిర్మించిన ‘మిస్సమ్మ’ (2003) చిత్రంలో భూమిక టైటిల్ రోల్ పోషించారు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘మిస్సమ్మ’ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడంతో పాటు రివార్డులూ పొందింది. అలాగే ‘మాయాబజార్’ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్ర పోషించారు.[2][3]
మరణం
ఆయన ఆగష్టు 28 2015 శనివారం మధ్యాహ్నం తిరుపతిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
389-టాటా బిర్లాల మధ్య లైలా ,ప్రేమ ,ఇష్క్ ,కాదల్ సినీ నిర్మాత –బెక్కెం వేణుగోపాల్
బెక్కెం వేణుగోపాల్[1][2] తెలుగు చలనచిత్ర నిర్మాత. 2006 నుండి లక్కీ మీడియా సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తున్నాడు.[3
జీవిత విషయాలు
వేణుగోపాల్ 1974, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో జన్మించాడు.
సినిమారంగం
వేణుగోపాల్ 2006లో నిర్మాతగా తొలిసారిగా టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రాన్ని తీశాడు. తరువాత సత్యభామ, మా అయన చంటి పిల్లాడు, బ్రహ్మలోకం టూ యమలోకం వయా భులోకం, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్త మావ[4] వంటి ఇతర చిత్రాలను నిర్మించాడు.
నిర్మించిన చిత్రాలు
సంవత్సరం
చిత్రం పేరు
భాష
నటులు
ఇతర వివరాలు
2006
టాటా బిర్లా మధ్యలో లైలా
తెలుగు
శివాజీ, కృష్ణ భగవాన్
[5]
2007
సత్యభామ
తెలుగు
శివాజీ, భూమిక చావ్లా, బ్రహ్మానందం
[3]
2008
మా ఆయన చంటి పిల్లాడు
తెలుగు
శివాజీ, మీరా జాస్మిన్, సంగీత
[6]
2010
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
తెలుగు
రాజేంద్ర ప్రసాద్, శివాజీ, ఆర్తీ అగర్వాల్
[7]
2012
మేం వయసుకు వచ్చాం
తెలుగు
నీతి టేలర్, తనీష్
[8]
2013
ప్రేమ ఇష్క్ కాదల్
తెలుగు
హర్షవర్ధన్ రాణే, రీతు వర్మ, శ్రీవిష్ణు
[9]
2015
సినిమా చూపిస్త మావ
తెలుగు
రాజ్ తరుణ్, అవికా గోర్
[10]
2016
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
తెలుగు
హెబ్బా పటేల్
2017
నేను లోకల్
తెలుగు
నాని, కీర్తి సురేష్
[11]
2018
హుషారు
తెలుగు
తేజాస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్, దినేష్ తేజ్
2021
పాగల్
తెలుగు
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి
2022
అల్లూరి
తెలుగు
శ్రీవిష్ణు, కయ్యదు లోహర్
2022
బూట్‌కట్ బాలరాజు
తెలుగు
సోహైల్, అనన్య నాగళ్ల
390-బొమ్మరిల్లు దర్శకుడు ,నందీ అవార్డీ-భాస్కర్ అనే భాస్కరన్ నటరాజన్
భాస్కర్ (బొమ్మరిల్లు భాస్కర్) తెలుగు సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత, నిర్మాత. 2006లో బొమ్మరిల్లు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.
జీవిత విషయాలు
భాస్కర్ 1979, సెప్టెంబరు 23న తమిళనాడులోని వెల్లూరులో జన్మించాడు.[2] చెన్నైలోని తమిళనాడు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ లో సినిమా రంగంలో శిక్షణ పొందాడు.
సినిమారంగం
తన కెరీర్ ప్రారంభంలో భద్ర, ఆర్య చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2006లో సిద్ధార్థ్ నారాయణ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి నంది ఉత్తమ నూతన దర్శకుడుగా, నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా రెండు నంది అవార్డులు అందుకున్నాడు.[3] 2008లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంకాగా,[4] 2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. 2013లో వచ్చిన ఒంగోలు గిత్త బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[5] ఆర్య, రానా దగ్గుబాటి, సమంత, శ్రీదివ్య, బాబీ సింహా నటించిన తమిళ చిత్రం బెంగళూరు నాట్కల్ 2016లో విడుదలయింది.[6]
దర్శకత్వం వహించిన సినిమాలు
క్రమసంఖ్య
సంవత్సరం
సినిమాపేరు
భాష
ఇతర వివరాలు
1
2006
బొమ్మరిల్లు
తెలుగు
నంది ఉత్తమ నూతన దర్శకుడు
నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత
2
2008
పరుగు
తెలుగు
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు – తెలుగుకి నామినేట్
3
2010
ఆరెంజ్
తెలుగు
4
2013
ఒంగోలు గిత్త[7]
తెలుగు
5
2016
బెంగళూరు నాట్కల్
తమిళ
తొలిచిత్రం
6
2020
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్
తెలుగు
Collaborations
నటులు
బొమ్మరిల్లు
పరుగు
ఆరెంజ్
ఒంగోలు గిత్త
బెంగళూరు నాట్కల్
జెనీలియా
Yes
Yes
సునీల్
Yes
Yes
జయసుధ
Yes
Yes
ప్రకాష్ రాజ్
Yes
Yes
Yes
Yes
Yes
బ్రహ్మానందం
Yes
Yes
చిత్రం శ్రీను
Yes
Yes
ప్రభు
Yes
Yes
ఆలీ
Yes
Yes
· సశేషం