కృష్ణాజిల్లా
ఉయ్యురు
జనవరి29
శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం రంగ రంగ వైభవంగా జరగనుంది. ఈ సంవత్సరం వీరమ్మ తల్లి ఉత్సవాలు ఉయ్యూరు నగరం మున్సిపాలిటీ లో వీరమ్మ తల్లి రెండు రోజులు పాటు తిరగనున్నారు. గతంలో ఆనవాయితి ప్రకారం ఉయ్యూరు పట్నంలో పతి వీధికి వెళతారని ఆలయ కమిటీ చైర్మన్ పారుపూడి సుబ్బారావు తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాలు కోవిడ్ కారణంగా అన్ని వీధులు తిరగలేకపోయామని భక్తులు చాలామంది కోరిక మేరకు ఈ సంవత్సరం రెండు రోజులు పాటు ఉయ్యూరు గ్రామంలో వీరమ్మ తల్లి ఊరేగింపు మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పారిపూడి సుబ్బారావు తెలిపారు. జనవరి 31న పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి ఎనిమిది గంటలకు బయలుదేరి ఉయ్యూరు మొత్తం తిరిగి ఫిబ్రవరి ఒకటో తారీకు సాయంకాలం 6 గంటలకు ఆలయానికి చేరుకుంటారు అని ఆలయ కమిటీ చైర్మన్ పారిపూడి సుబ్బారావు తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966788471 ఆలయ కమిటీ చైర్మన్ పారుపూడి సుబ్బారావు