మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
· 395-నాటక ,సినీ నటి ,డబ్బింగ్ చిత్ర నిర్మాత –మిఠాయి చిట్టి
· మిఠాయి చిట్టి తెలుగు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా సహాయపాత్రలను ధరించింది. కొమ్మినేని శేషగిరిరావు, బాపు, కె.వాసు, పి.చంద్రశేఖరరెడ్డి, రాజాచంద్ర, విజయ బాపినీడు, పి.ఎన్.రామచంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, వల్లభనేని జనార్ధన్, వంశీ, టి. కృష్ణ, రేలంగి నరసింహారావు , కె.బాపయ్య, కె.ఎస్.ఆర్.దాస్, పి.సాంబశివరావు, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, ఎస్. వి. కృష్ణారెడ్డి, దాసరి నారాయణరావు, రవిరాజా పినిశెట్టి, పూరీ జగన్నాథ్, ఉదయశంకర్ మొదలైన దర్శకుల సినిమాలలో ఈమె నటించింది. ఈమె నిర్మాతగా మిఠాయి మూవీస్ బ్యానర్‌పై మరో పోరాటం, అంతిమ పోరాటం అనే డబ్బింగ్ సినిమాలను కూడా నిర్మించింది.
· సినిమాల జాబితా
· ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా[1]:
396-పదహారేళ్ళ వయసు సినీ నిర్మాత –మిద్దే రామారావు
మిద్దే రామారావు తెలుగు సినిమా నిర్మాతలలో ఒకడు. ఇతడు నిర్మించిన పదహారేళ్లవయసు, పండంటి జీవితం, రామరాజ్యంలో భీమరాజు, గూండా వంటి సినిమాలు విజయవంతంగా నడిచాయి. ఇతడు ఎన్.టి.రామారావు, చిరంజీవి, కృష్ణ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, శోభన్ బాబు వంటి నటీనటులతో సినిమాలు నిర్మించాడు. ఇతని సినిమాలకు దర్శకత్వం వహించినవారిలో కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు తదితరులు ఉన్నారు.
ఇతడు నిర్మించిన పదహారేళ్ల వయసు సినిమా ద్వారా శ్రీదేవి, పండంటి జీవితం సినిమా ద్వారా విజయశాంతి ప్రఖ్యాతి గాంచి రెండేసి దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలారు. [1][2]
జీవిత విశేషాలు
ఇతడు తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో 1945, జూలై 15న జన్మించాడు[3].
ఇతడికి చిన్న తనం నుండే సినిమాలపట్ల ఉన్న ఆసక్తితో తన చదువును మధ్యలో మానివేసి సినిమా ఎగ్జిబిటర్‌గా మారాడు. ఇతడు తన గ్రామంలో సుష్మ అనే టూరింగ్ టాకీసును నిర్మించాడు[4].
ఒక దశాబ్దం సినిమా ప్రదర్శకుడిగా కొనసాగిన తరువాత సినిమా నిర్మాణ రంగంవైపు దృష్టిని సారించాడు. మొదట్లో తెలుగులో డబ్బింగ్ సినిమాలను నిర్మించడం ప్రారంభించాడు. వాటిలో జెమినీ గణేశన్ నటించిన కొండవీటి వీరుడు, జయశంకర్ నటించిన కక్ష శిక్ష అనే సినిమాలు తమిళం నుండి, రాజ్‌కుమార్ నటించిన ప్రచండ వీరుడు అనే సినిమా కన్నడం నుండి డబ్ చేసినవి ఉన్నాయి.
తరువాత చంద్రమోహన్ హీరోగా, శ్రీదేవి కథానాయికగా, కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా ఇతడు నిర్మించిన పదహారేళ్ల వయసు సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతడు సినిమా నిర్మాతగా నిలదొక్కుకున్నాడు. ఈ విజయం తర్వాత ఇతడు శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్స్ అనే బ్యానర్‌పై సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాడు.
ఇతడు ఇతరభాషలలో విజయం సాధించిన సినిమాలను తెలుగులో పునర్నిర్మించాడు. అంతే కాకుండా తెలుగులో పాపులర్ అయిన నవలలను సినిమాలుగా తీశాడు.
ఫిల్మోగ్రఫీ
ఇతడు నిర్మించిన తెలుగు సినిమాలు:
· గూండా
· భార్యలు జాగ్రత్త
· పవన్ సుబ్బలక్ష్మి ప్రేమించుకున్నారట మొదలైనవి[5].
397-సాహసం శ్వాసగా సాగిపో ,అఖండ సినీ నిర్మాత –మిర్యాల రవీందర్ రెడ్డి
మిర్యాల రవీందర్ రెడ్డి వ్యాపారవేత్త, తెలుగు సినిమా నిర్మాత. ఆయన స్టీల్, ఐరన్, కన్స్ట్రక్షన్ రంగాల్లో వ్యాపారం చేసి సినిమాల పై ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మాణ రంగంలోని మెళుకువలను తెలుసుకుని 2016లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. ఆయన తరువాత ‘జయ జానకి నాయక’ , ‘అఖండ’ లాంటి సినిమాలను నిర్మించాడు.
నటించిన సినిమాలు
సంవత్సరం | పేరు | దర్శకుడు | నటీనటులు | ఇతర | మూలాలు |
2016 | సాహసం శ్వాసగా సాగిపో | గౌతమ్ మీనన్ | · అక్కినేని నాగ చైతన్య· మంజిమా మోహన్· బాబా సెహగల్ | [2] | |
2017 | యమన్ | జీవా శంకర్ | · విజయ్ ఆంటోని· మియా జార్జ్· త్యాగరాజన్ | [3] | |
2018 | జయ జానకి నాయక | బోయపాటి శ్రీను | · బెల్లంకొండ శ్రీనివాస్· రకుల్ ప్రీత్ సింగ్· శరత్ కుమార్· జగపతి బాబు | ||
2018 | చినబాబు | బోయపాటి శ్రీను | · కార్తీ· సాయేషా· భానుప్రియ | [4] | |
2020 | అఖండ | బోయపాటి శ్రీను | · నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్ | [5] |
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-23-ఉయ్యూరు