అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23 నిర్వహిస్తోంది .ప్రముఖ కవులచే కవి సమ్మేళనం ఉంటుంది .శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .
1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ –గుంటూరు
2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .
3-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్
4-శ్రీ పూల బాల వెంకట ప్రసాద్ – అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధ౦ రచించి ప్రపంచ రికార్డ్ నెల కొల్పిన కవి పండితులు -వణుకూరు-కృష్ణా జిల్లా.
5-శ్రీ చౌడూరు నరసింహారావు –బహుముఖ ప్రజ్ఞాశాలి కవి, రచయిత-నెల్లూరు
6-శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త –మచిలీ పట్నం .
గౌరవనీయ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను ఉగాది శుభా కాంక్షలతో సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .
వేదిక (వెన్యు ), సమయం తో పాటు కవి సమ్మెళన అంశం, పాల్గొనే కవిమిత్రులు ,ఆహ్వానింప బడే అతిధుల వివరాలను ఒక పది రోజులలో తెలియ జేస్తాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు –ఉయ్యూరు -3-2-23.–