మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
· 398-వాహినీ సంస్థ నిర్మాత ,గృహలక్ష్మి నిర్మాత ,వందేమాతరం స్వర్గ సీమ నిర్మాణ ఫేం –మూలా నారాయణ స్వామి
· మూలా నారాయణస్వామి ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన వాహినీ స్టుడియో సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామం. వీరి తండ్రి గారి కల్లు వ్యాపారాన్ని చిన్నతనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారల్ని విస్తరించారు.
· నారాయణస్వామి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అన్నయ్య) తో కలిసి ఉమ్మడి వ్యాపారం చేసి రంగూన్ కి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. తర్వాత ఇద్దరూ హెచ్.ఎం.రెడ్డి గారి రోహిణీ పిక్చర్స్లో భాగస్వాములుగా చేసి గృహలక్ష్మి వంటి కొన్ని సినిమాలు నిర్మించారు. విభేదాల మూలంగా విడిపోయి స్నేహితులిద్దరూ వారి స్వంత నిర్మాణ సంస్థ ‘వాహినీ పిక్చర్స్’ స్థాపించారు. దీనిలో ముఖ్యమైన వాటా నారాయణస్వామిదే. ఈ సంస్థ ద్వారా వందేమాతరం, సుమంగళి, దేవత స్వర్గసీమ వంటి మంచి సినిమాలు నిర్మించారు. స్వర్గసీమ నిర్మాణం సమయంలో మద్రాసు న్యూటోన్ స్టుడియోలో వారు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చి స్వంతంగా స్టుడియో నిర్మాణం చేపట్టారు.
· 399-తాడి పత్రీ మాజీ చైర్మన్ ,వాహినీ సంస్థ నిర్వాహకుడు,రచయిత –మూలా వెంకట రంగయ్య
· మూలా వెంకటరంగయ్య భారతీయ చలన చిత్ర నిర్మాత, రచయిత. వాహినీ స్టూడియో ద్వారా చిత్రాలను నిర్మించిన వెంకటరంగయ్య తెలుగు , తమిళ సినిమాలకు రచనలు కూడా చేశాడు
జీవిత విషయాలు
వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి నారాయణస్వామి కల్లు వ్యాపారంతో ధనవంతుడై తర్వాతికాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైన స్థాపించి వ్యాపారాల్ని విస్తరించాడు.[1][2]
సినిమారంగం
తండ్రి నారాయణస్వామి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి ‘వాహినీ పిక్చర్స్’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా నిర్మించిన చిత్రాల నిర్మాణ బాధ్యతలను వెంకటరంగయ్య చూసుకునేవాడు. ఆ తరువాత వాహినీ స్టూడియో నిర్మించారు. ఇది దక్షిణ ఆసియాలో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది.[3][4]
1950లో నారాయణస్వామి మరణించాడు. దాంతో వెంకటరంగయ్య కొంతకాలం స్టూడియోను నడిపి, 1961లో బి.నాగిరెడ్డికి వాహినీ స్టూడియోను అమ్మేశాడు. నాగిరెడ్డి ఆ స్టూడియోను విజయ వాహిని స్టూడియోస్ గా మార్చుకున్నాడు.
ఇతర వివరాలు
వెంకటరంగయ్య తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ గా కూడా పనిచేశాడు.[1
· 400-ప్రముఖ సినీ కళా దర్శకుడు ,గ్రిగ్మేమోరియాల్ గ్రహీత ,దర్శక నిర్మాత శ్రీ కృష్ణలీలలు కళా ఫేం ,శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం లో స్వామి విగ్రహ రూప శిల్పి –ఎయస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు.స్.వి.ఎస్ .రామారావు
విశేషాలు
ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు[1]. ఇతడు మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో ‘లంబాడీ కన్య’ అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఇతడు ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో ఇతడు వేసిన ఒక పెయింటింగ్‌కు “గ్రిగ్ మెమోరియల్ మెడల్” లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. బందరుకే చెందిన పి.వి.దాసు ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా శ్రీకృష్ణ లీలలు. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. బాలరాజు సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన ‘మీసం’ స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.
చిత్ర సమాహారం
కళాదర్శకుడిగా
1. 1935 : శ్రీకృష్ణ లీలలు
2. 1936 : ద్రౌపదీ వస్త్రాపహరణం
3. 1938 : గృహలక్ష్మి
4. 1938 : మాలపిల్ల
5. 1939 : రైతుబిడ్డ
6. 1939 : వందేమాతరం
7. 1942 : సీతారామ జననం
8. 1946 : బాలరాజు
9. 1946 : ముగ్గురు మరాటీలు
10. 1947 : మాయలోకం
11. 1947 : యోగివేమన
12. 1948 : బాలరాజు
13. 1950 : స్వప్న సుందరి
14. 1952 : చిన్న కోడలు
15. 1952 : ధర్మదేవత
16. 1957 : వినాయకచవితి
17. 1957 : సారంగధర
18. 1960 : దీపావళి
19. 1960 : శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం
దర్శకుడిగా, నిర్మాతగా
1. 1942 : బాలనాగమ్మ
2. 1952 : చిన్నమ్మ కథ
· సశేషం