కళా విశ్వ నాథ దర్శనం -2
ఇంతకీ స్వాతి కిరణం అని ఎందుకు పేరు పెట్టారు ?అని ఆలోచిస్తే సు+అతి-స్వాతి . అంటే మంచి ఎక్కువగా ఉండే లక్షణం స్వాతీ నక్షత్రం .ఈ నక్షత్రం లో పుట్టిన వారికి రాహు ప్రభావం తో కల్పనా శక్తి ,శుక్రప్రభావంతో కళా రంగం లో అద్వితీయ ప్రభావం ఉంటుంది .మేధా సంపన్నులుగా ఉండటం వీరి ప్రత్యేకత .అందుకని ఆనక్షత్ర కిరణప్రభావం వలన ఇందులోని గంగాధరం బాల మేధావి గా ఉండటం గురువుకు తట్టని స్వరాలను కూర్చటం జరిగింది . అందుకే ఆ పేరు పెట్టి ఉంటారని నా ఊహ . ఇంగ్లీష్ లో దీని సమానార్ధం -ఓడియస్ –odious-అంటే –ద్వేషం ,పగ ,డిస్గ్రేస్,స్ట్రాంగ్ డిస్లైక్,ఎవర్షన్,ఇంటెన్స్ డిస్ప్లెజర్ . ఇవీ మమ్మట్టి లక్షణాలు కనుక అవీ పేరులో ప్రతిబిమిస్తాయి .
ఈ సినిమాకు మాతృక ఇంగ్లీష్ సినిమా – Amadeus అని భావిస్తారు . Wolfgang Amadeus Mozart అనే ఆష్ట్రియా వియన్నా సంగీత దిగ్గజం కథ .మిలాస్ ఫార్మర్ దర్శకుడు .1984లో విడుదలయింది .మొజార్ట్ కు, ఇటాలియన్ సంగీతకారుడు ఆంటోనియో సల్లెరి కి మధ్య జరిగిన సంగీత స్పర్ధ ఆసినికా కథ.ఇందులోని కధాంశాన్ని మాత్రమె బేసిక్ గా తీసుకొని విశ్వనాథ్ తెలుగు వాతావరణానికి తగినట్లుగా కథనం చేశాడు అని పెద్దలంటారు .
కళాతపస్వి 30 ఏళ్ళ క్రితం తన తపస్సు ధారపోసి తీసిన ‘’సిరిమువ్వల సింహనాదం ‘’సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు అంటే అవాక్కై పోతాం .అయినా అది నిజంగా నిఝ౦.
ఇప్పుడు కళాతపస్వి మరో ఆణిముత్యం -శ్రుతి లయలు .చూద్దాం .మన వారసత్వాన్ని యెంత బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలో భవిష్యత్తరాలకు అందించాలో ఎరుకపరచిన విధానం ఒక జగద్గురువు బోధించినంత ఉత్తమం గా వుంది . సంగీత విద్వాంసు లైన అన్నదమ్ములు తండ్రికి మాటిచ్చి నిలుపుకోలేక ,వ్యసనాలకు ఒకడు పెళ్ళానికి ఒకడు .విదేశే వ్యామోహానికి ఒకడు బానిసలలైపోతే ,అందులో పెద్దవాడైన రాజ శేఖర్ భార్య సుమలత ఒక పిల్లాడిని కనీ ,తలిదండ్రులకు దూరమైనా ఆసోదరత్రయంలో ఆకుర్రాడి సంగీతం ఆధారంగా జ్ఞానోదయం కలిగించి ,కుటుంబాన్ని అంతటినీ మళ్ళీ కలిపి వారి చేత తండ్రికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోనేట్లు చేసి సంగీత ఆలయాన్ని నిర్మింప జేయటం ఇందులో విషయం, విశేషం .హరి ద్వారంలో షూటింగ్ అద్భుతం .సుమలత అచ్చమైన భారత మహిళగా ఇల్లాలుగా నెత్తిన చీరకప్పుకొని ఉత్తమా ఇల్లాలుగా దర్శన మిస్తుంది .ఆమెను చూస్తె ఆటోమాటిక్ గా రెండు చేతులు ఎత్తి నమస్కరించాలని పిస్తుంది ప్రతి సన్నీ వేశం లోనూ ఆమెను అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు విశ్వనాథ్ .ఆమె మాటలు హృదయపు లోతులను స్పర్శిస్తాయి ఆనంద బాష్పాలు కార్పిస్తాయి . సంగీతత్రయం తండ్రి వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు గా నవరస సార్వభౌమ కైకాల సత్యనారాయణ జీవించాడు .ఆపాత్ర ఉదాత్తత ను మాటలలో వర్ణించ లేం . నాయుడు గారి అర్ధాంగి గా అంజలీ దేవి,మెప్పిస్తే , మనవడుగా షణ్ముఖ శ్రీనివాస్ నటన ,నృత్యాలు గానం తో రాణించి ముచ్చెర్ల అరుణ హృదయాన్ని మాత్రమేకాక మన మనసుల్నీ దోచేశాడు .తండ్రి చెడు అలవాట్లను మాన్పించే అతని ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తూనే కథకు మలుపు లు అవటం వినోదంగా ఉంది . ఆటో డ్రైవర్ మిశ్రో ప్రసిద్ధ సంగీత విద్వా౦సు లందర్నీ తానె ప్రమోట్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ చివరికి దొరికిపోవటంలో మిశ్రో నటన ,వాచికం పండాయి .ఇందులోనే రిక్షా వాడిగా సాక్షి రంగారావు మంచితనం ,సుమలత తండ్రిగా వైజాగ్ ప్రసాద్ నటన ,అరుణ తండ్రిగా వంకాయల ,రాజ శేఖర్ ను వలలో వేసుకొన్న లేడీ గా జయలలిత అందరూ అందరే కళాతపస్వికి తగిన నటనా సహకారం చేసి చిత్రానికి నీరాజనం పట్టించారు .
పూర్ణ చందర్ ‘’శ్రీ గణ నాథం ‘’తో ప్రారంభమై ,శ్రీ శారదాంబ –కు జానకి ,ఆలోకయే శ్రీ బాల కృష్ణం కు మధుర వాణి జయరాం ,అన్నమయ్య గీతం ‘’ఇన్ని రాశుల యునికి ‘’కి బాలు- వాణీ గానం ,తెలవారలేదేమోస్వామి అంటూ జేసుదాస్ ఆతర్వాత సుశీల స్వామిని ఆర్తిగా లేపటం వీనులవిందు .ఈ సినిమాఉత్తమ చిత్రంగా నంది అవార్డ్ ను ,ఉత్తమ దర్శకుడుగానంది ,ఫిలిం ఫేర్ అవార్డ్ లు కళాతపస్విఅందుకొన్నారు . ,ఎ ఆర్ స్వామినాధన్ ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ,ఉత్తమ నృత్య దర్శకుడుగా కెవి సత్యనారాయణ అందుకోవటం చిత్రం స్థాయి ఎంత గొప్పగా ఉందొ తెలియ జేస్తుంది .ప్రాచీన కళలకు సాహిత్య సంగీతాలకు వాగ్గేయకారులకు మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తు చేసి మన కర్తవ్యాన్ని బోధిస్తుంది .శ్రుతి,లయలు లయబద్ధంగా సాగటమే భారతీయ సంస్కృతికి ,జీవిత విధానానికి మూలం అని తెలియజెప్పే చిత్రం శ్రుతి లయలు .విశ్వనాథుని ఊపిరులు . మొదటించి హాస్యం అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది పాత్రల మనస్తత్వం మాటలు ద్వారా
సుభలేఖ సినిమా లో కట్నం సమస్యను అతి సున్నితంగా హాస్యం మేళవించి పరిష్కరించిన తీరు మెచ్చతగింది .డిగ్నిటి ఆఫ్ లేబర్ ను చూపించిన సినిమా .స్టార్ హోటల్ వెయిటర్ మూర్తి గా చిరు కు ,కైకాల స్వంతకాలేజిలో లెక్చరర్ సుమలత ల మధ్య ప్రేమాయణం ,ప్రేమకు అంతస్తులు అక్కర్లేదన్న దానికి ఉదాహరణ .కైకాల కొడుక్కు సుమలతను వధువుగా అడగటం కట్నం తోపాటు అనేకమైన కోరికలు ఆయన బయటపెట్టటం ,అది సుజాతకు ఇష్టంలేక తెగేసి చెప్పటం సంబంధం చెడిపోవటం ,ఆమె పెళ్లి తమ ఇంట్లో ఉంటె జరగదని ఆమెను తలిదండ్రులు ఇంటి ను౦చి పంపటం ,,ఆమె లెక్చరర్ ఉద్యోగాన్ని కూడా కైకాల పీకేయట౦తో చిరు అండతో ఆమె గడపటం ,కైకాల కు సన్మానం పేరుతొ అవమాని౦చి అతని అవినీతిని బట్టబయలు చేయటం తో ఆయన రౌడీలతో కొట్టించటం , వెయిటర్ ఉద్యోగం పీకేయించటం ,మూర్తి ఆమెకు ఆల్విన్ లో ఉద్యోగం ఇప్పించటం ,ఆమెకు ఆల్విన్ అధికారితో పెళ్లి ప్రయత్నం చిరు చేయటం ,కైకాల చిన్నకొడుకు శుభలేఖ సుధాకర్ ,సుమలత చెల్లెలు తులసి మధ్య అందమైన సరసమైన ప్రేమాయణం ,తులసీ సుధాకర్ ల ఎత్తుగడలు ఫలించి కైకాల కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటం ,చివరికి అందరి పెళ్ళిళ్ళు జరిగి సుఖం కార్డు పడటం .సుధాకర్ ఈ సినిమాతో ‘’శుభలేఖ సుధాకర్ ‘’అయ్యాడు .రమణమూర్తి సుమలత తులసి తండ్రి .నిర్మలమ్మ సాక్షి రాళ్ళపల్లి వగైరా టీం .గొల్లపూడి మాటల రచయితకనుక ప్రతిమాటా పేలి నవ్వుల తారాజువ్వలు రాలాయి హాస్యపు మతాబాలు వెలిగాయి చిరునవ్వుల చిచ్చుబుడ్లు మెరిపించాయి .ఆటకాయి తాటాకు టపాకాయలు సుర్రుమన్నాయి .
మామ మహదేవన్ సంగీతం లో మరుగేలరా ఓ రాఘవా ,విన్నపాలు వినవలె వింతవింతలు ,ఓహో తదిం తకఝం ను జానకమ్మ కమ్మగా పాడితే ,నెయ్యములల్లో నేరేళ్ళో,నీ జడ కుచ్చులు నామెడ కుచ్చులు అంటూ సుధాకర్ కు చిలిపిగా నూ ,రాగాల పల్లకిలో పాటను ఊరేగించాడు బాలు .యువ జంట తులసి ,సుధాకర్ చిలిపి నటన గిలిగింతలు పెడుతుంది .అల్లు కూదాహాస్యంతో గిల్లుతాడు .చిరు కళాతపస్వి తో చేసిన మొదటి సినిమా .బెస్ట్ యాక్టర్గా ఫిలిం ఫేర్ అవార్డ్ ,బెస్ట్ డైరెక్టర్ గా కళాతపస్వి అందుకొన్నారు .కైకాల కు చిరు చేసే సన్మానం హాస్యానికి పరాకాష్ట .అదే ఉద్యోగం ఊడటానికీ కారణం .కట్నం సమస్యను తనకు సుధాకర్ కు పెళ్లి జరగటానికి శుభ లేఖ ను అడ్డంగా పెట్టుకొని కైకాల ఆట కట్టించి కాళ్ళ బేరానికి రప్పించటం లో తులసి నటన అద్వితీయం నవ్విస్తూనే చురకల౦టించటం ఈ పాత్ర ప్రత్యేకత.ఆమె ఆడించినట్లు ఆడటం సుధాకర్ ప్రేమలో మహిమ .సినిమా అంతా లైటర్ వీన్ లో సాగి గుణపాఠానికి కారణమౌతూ వరకట్న సమస్యను బుర్రలు బద్దలు కొట్టుకోకుండా సరదాగా పరిష్కరించటం ఇందులో విశ్వనాథ్ చూపిన ప్రతిభ .సుమలత చాలా డిగ్నిఫైడ్ గా కని పించటం మాత్రమె కాదు నటించింది .హోటల్ వెయిటర్ గా చిరు పలకరింపు ,డ్యూటీ ,ప్రేమలో నిగూఢత ,ఆరాధన ,అందని పళ్ళ కోసం కోసం అర్రులు చాచ కూడదనే జీవిత సత్యం ఆమె బాగే తన కర్తవ్యంగా భావించటం తో ఆమె ప్రేమను గెలుచుకొని పెళ్ళాడాడు .చలాకీ నటనతో మెప్పించాడు చిరుకాదు పెద్దమనసున్నవాడు అనిపించాడు .పోట్టిప్రసాద్ ,రాళ్ళపల్లి తమదైన నటనతో చిత్రవిజయంలో పాలు పంచుకొన్నారు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-23.-ఉయ్యూరు