కళా విశ్వ నా(ద )ధ దర్శనం-5
విశ్వనాధ బాలు తీసిన శుభ సంకల్పం లో తెలివి తేటలకు చదువు అక్కర్లేదని నిరూపించాడు .ఆపద్బాన్ధవులు లో స్వయం కృషి లో చిరంజీవి గ్లామర్ను డీ గ్లామర్ చేసి అతని లోని సహజ నటనను వెలికి తీసాడు జంధ్యాల తో నటింప జేసి అతడిని చిరంజీవిని చేసాడు .శుభోదయం లో సోమరి తనం యెంత అనర్ధ దాయకమో నిరూపించాడు యే చిత్రం లో నైన విలువలకు పట్టం గట్టటమే కాని విలువల వలువల ఊడ దీయ లేదు .రోజా రమణి దేవదాస్ కనకాలతో తీసిన.మరోసీత కధ లో దంపత్యానికి వున్న విలువ ఏమిటో చూపి మనల్ని దేవదాసుని కంగు తినిపించాడు .రోజా రమణి లోనినటనను చాల . హుందాగా అద్భుతంగా ప్రదర్శింప చేశాడు .ఇలా ఏ సిన్మా తీసినా తన ముద్రను వేసాడు భారతీయ ఆత్మను సంస్కారాన్ని సంస్కృతిని కాపాడే వే తీసాడు తీసి రాష్ట్ర ,దేశ పరువును కాపాడటం కాకుండా మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన మహనీయ దర్శకుడు విశ్వ నాథ్
విశ్వనాధ్ . కు ఇవన్నీ ఎలా సాధ్యం అయాయి? అతను రచయితల్ని ఎంచుకొని వారి పాటవాన్ని గ్రహించి పనిచేయిన్చుకుంటాడు .పాటలు రాయటానికి వేటూరి మాటలకు జంధ్యాల గొప్ప సహకారం అందించారు సంగీతానికి మహా దేవన్ ఇలయ రాజాలు లయ స్వర రాగాలతో రాగ రంజితం చేసారు .అన్ని పాటలు ఆణిముత్యాలేచిర స్మరణీయ బాణీలే .అదొక స్వర సాగర సంగమం .అన్నట్లు విశ్వ నాధుని సాగర సంగమం ,సిరి వెన్నెల ను మరిచి పొతే చరిత్ర క్షమించదు . ఇన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చి పరవశింప జేసింది మాత్రం సిరివెన్నెలే పాటలు ,మాటలు భావాలు హృదయ ఆవిష్కరణలు ,సంస్కారం నన్ను పరవశింప జేసాయి .వుయ్యూరు లో ఆ సినిమా మూడు రోజులే ఆడింది రెండు రోజులు వరుసగా చూసాను ..
విశ్వ నాద్ సినిమా లో హాస్యం వింత పోకడలు పోతుంది సున్నితమైన సుతిమెత్తని సందర్భోచిత హాస్య0
చిప్పిల జేస్తాడు మొరటు రెండర్దాలుండవు .అమాయకతవారితో శుచిగా శుభ్రం గా వుంటుంది .చంద్ర మోహన్ సాక్షి రంగా రావు శుభ లేఖ సుధాకర్ తులసి ఆయన సినిమాలలో హాస్యంతో జీవించి తరించారు నటీ నటుల ఎన్నిక విశ్వనాద్ ప్రత్యెక ద్రుష్టి .తో చేయటం గొప్ప గా వుంటుంది .అరుపులు రాద్ధాంతాలు నరాలు తెగే ఉత్కంఠ వుండవు ప్రేక్షకులను క్రమం గా elivate చేయటం విశ్వ నాద్ ప్రత్యేకత .ఆ వున్నత స్థితి నుంచి కిందికి దిగ టానికి ఇష్టం వుండదింక .వీటి నన్నిటిని మించి విస్వనాద్ చిత్రాలలో ఆర్ద్రత నిండి వుంటుంది .ప్రతి సన్నివేశంఆ అనుభూతి బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది రసాత్మకం గా వుంటుంది ఆనందంతో పరవశం కల్గుతుంది తాదాత్మ్య స్థితి లో వుంటాం.ఆ ఆనందం బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది ఇదొక్కటే విశ్వనా ద ను మిగిలిన darsakulanunchi వేరు చేసే అతి గొప్ప అనన్య సాధ్య మైన గుణం .భారతీయ ఆత్మను అన్ని కోణాల్లోనూ దర్శింప జేసిన దర్శక విశ్వ నాధుడు .నటింప జేయటం కాదు స్వయం గా నటించీ పాత్రలకు సార్ధకత చేకుర్చటం మరీప్రసంసించ దగిన విషయం .
విస్వనాద్ బృండంశంకరాభారణ విజయోత్చ వాలు చుదతానికిప్రతి ధియేటర్ కు వచ్చారు వుయ్యూరు సాయి మహల్లో ప్రదర్సన చూడ తానికివచ్చినపుడు సోమయాజులు విశ్వనాద్ లకు shake హ్యాండ్ ఇచ్చిసినిమా బాగుందని చెబితే ఇద్దరు సంతోషించారు ఇది రెండవ సారి చూడటం ఇంకముడవ సారి కృష్ణ జిల్లా పెదకల్లె పాలి లో వేటూరి గారింటిలో ఆయన్ను బాలును సబితను దేవదాస్ దంపతుల్ని చూసా .శంకరాభరణం మీద నేను రాసిన notes స్వనాద్ వున్న డైరీ ని చూపివ్స్తే చదివి సంతోషం తో vi స్వనాద్ సంతకం చేసారు
విశ్వనాద్ ,బాలు మా కుటుంబ స్నేహితులు సీతం రాజు వెంకట రావు మల్లి .తరచు కలుస్తారు వాళ్ళంతా మల్లికాంబ దగ్గర బంధువులు తరచూ కలుస్తారు వాళ్ళంతా బాలుని కలిసినపుడు మేముమల్లి కాంబ గారి స్నేహితులం అని చెప్తాం ;.
ఇదీ కలా స్రష్ట విశ్వ నాధుని కీర్తి హారం లో ఒక చిన్న పువ్వు .
అమెరికా లో కాలిఫోర్నియా లో ఉంటున్న మా మేనల్లుడు jay వేలూరి నన్ను విశ్వనాద్ గురించి రాయమని అడిగితె ఇంతరాయాల్సి వచ్చింది .
మీ
దుర్గాప్రసాద్
“శంకరాభరణం“
నేపధ్య సంగీతం :శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రస స్ఫోరక కలభిజ్నత ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పడాల సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలభిజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే కంటన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో సంకరభారణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాత ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం సంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విస్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్త ఫలాంసోమయాజుల నటన:ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి తీ వి ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం సంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుండా డ తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడుఅసలు ఆ పాత్ర ఏమి చెప్పాడు .అంత మనం వుహించు కోవలసిందే .వుహ సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపాద ను నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేస్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ charector ను విశ్లేషిస్తుంది తులసి రైల్ ఎక్కేటప్పుడు మైసూర్ లోపర ప్రభావం జరిగినప్పుడు ఎక్కడ తొణకదు బెనకడు ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తోత్రుపడదు .తనాకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయిన విచారించాడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీయం వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర వహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కర చేతనా అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు అన్దనిది అంటూ న్తుబత్తనిది .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారంశం .సిష్టాచార పరాయనుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాష భేదం లేదని ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic గా ఒక కలెక్టర్ హుండా డ తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి కుఉతురువెన్న రాస్తుంటే ట్రుసజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయినా హృదయం ,తేలిక పాడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన శిఖరారోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశం .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవతా మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుదయాడుచివరి సీన్ లో ”దొరకున ఇటువంటి సేవా ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత టకు ,నా నమోవాకాలు ఆ కలభిజ్ఞాతతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లా ప్లవితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసు .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధారించర,విని తరించార ”అని అనిపించినా పాత్ర అది .తెలూ చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విస్వనాద్ కళా విస్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా విస్వనాద్ సృష్టికర్తగా కళా నీరజనలన్డుకున్నారు ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందిందిమంజు భార్గవి :నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతునో తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి నా మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుండనిఎవారు ఊహించలేదు .ప్రెసిడెంట్ పెపేరమ్మ రంమలో కాసేపే నాట్యం చేసిన బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విస్వనాద్ చేతిలో మనోజ్ఞా మనోహర శి ల్పముర్తి గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .వున్న చాల పొడుపు .అంత సా సత్వికభినయమే .వుహలోక సంచారం .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించిందిజమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకాలు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు శం కర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట త గట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ వ వార్నిన్చుకోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .సంకర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్ర్లుగా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలుపరమ మనోహరాలు సంకర శాస్త్రికి సన్మానం జరిగే తప్పుడు ఆమె కాళ్ళు కృతజ్ఞత భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మావుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది”బ్రోచే వారెవరురా ”పాట పా డేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆననం తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంతృప్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శం కర శాస్త్రిని చూపిస్తూ చిరిగినా పంచె లోంచి flashback లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత ఒప్పదో ఆమె చూపిన చ్పుతో అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె అత్మనండానికి ప్రతీక .జమీ0 దారును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరా ధనాకృతి గా నిలబడాలన్న తపన అది .తనములం గా సంకరశాస్త్రికి సశ్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక ముఉగగా ముగా వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose చేసిన కళా తపస్వి విస్వనాద్ పరిశీలన దృష్టికిహట్స్ ఆఫ్అల్లు రామ లింగయ్య :శివుని హృదయం మాధవునికి మాధవుని మనసు శంకరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన పరిక్షలకు తట్టు కొని nilabadu తుంది .ఆ స్నేహ బంధం పవ్త్ర మయినపుడు వీడదు .వాడదు డు సంకర మాధవులు దేవత స్వరూపులుగా స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా సంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్ర దరికి కూడా గర్వ కారణం .అల్లు రామలింగయ్య లోని కళా జీవి ధన్యుదయాడు ”వాడెంత ?నేనూ గట్టిగ కన్నీర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”ఐ శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కాళ్ళు నెలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్క పోతాడు .ఇలా యెంత చెప్పిన తరగనిగని ఘని శంకరాభరణం . చూసి పులకిన్చాల్సిదే చెప్పి మెప్పించలేము.మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03 99 న స్వర్గీయ వేటూరి కృష్ణ జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లె పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నా చూపించాను చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం |
శంకరాభరణం సినిమాపై తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆచార్య పేరాల భారత శర్మగారు గొప్ప ధీసీస్ రాశారని పేపర్ లో చదివాను . కానీ నేను చదవలేదు . అలాగే శ్రీ చాగంటి కోటేశ్వరరావ్ గారు ఈ సినిమాపై మూడు రోజులు దృశ్య మాధ్యమం లో ప్రసంగం చేయటం చిరస్మరణీయం ఆ చిత్రానికి ,కళా తపస్వి కి దక్కిన అరుదైన గౌరవం యావత్ ఆంధ్ర మే కాక భారత దేశమే కాక ప్రపంచంలో ఏ మూలలో ఉన్న తెలుగు వాడైనా కాలర్ ఎగేసి గర్వంగా చెప్పుకోగల విషయం . ఈ అదృష్టం ఏ సినిమాకి దర్శకుడికీ దక్కలేదు. తెలుగు జాతికి తప్ప ఏజాతికీ దక్కలేదు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11 -2 -23 -ఉయ్యూరు