కపటం లేని , భోళా మనిషి, సరదాగా మాట్లాడే వ్యక్తి వెరసి మా పెద్ద మేనమామ శ్రీ వేలూరి రామకృష్ణ 2-3-2023న శివైక్యం చెందారు. వార్త తెలిసిన వెంటనే మనస్సు భారమైంది, కన్నీరు ఆగలేదు. కొంచెం సేపు భగవద్గీత విన్నాను. ఆయనకు 8 మంది మేనకోడళ్ళు, ఇద్దరు మేనల్లుళ్ళు. మేము అందరం పెద్దవాళ్ళమైనా ఇప్పటికీ చిన్నవాళ్ళు గా నే భావించి ఎంతో అభిమానంతో మాట్లాడే వాడు. పెద్ద మేనమామ గా మా అందరికీ , తన అక్క చెల్లెళ్ళకీ పెట్టు పోతలు, ఇతర బాధ్యతలు నెరవేర్చారు. నేను చిన్నప్పటి నుండి పెరుగు తినను. తినేవాళ్ళ పక్కన కూడా కూర్చునే దాన్ని కాదు. 1997లో ఒక నెల రోజులు గరివిడి లో ఉన్నాను. నా సంగతి అప్పుడే మామయ్య కు తెలిసింది. ఎన్నో గొడవలు పడ్డాం నా పెరుగు తినకపోవడం గురించి. చివరికి మామయ్య గెలిచాడు. ఈ రోజుకి పెరుగు తినేటప్పుడు మావయ్య అలవాటు చేసాడుఅనుకుంటాను. మా పిల్లలకు కూడా చెప్పాను. నాకు పెళ్ళి కావాలని అత్తయ్య మావయ్య లు నాతో సుందర కాండ చదివించి పూజ చేయించారు. గుంటూరులో ఉన్నప్పుడు బీఈడీ అప్లికేషన్ పంపించి సాధ్యమైనంత వరకు సహాయం చేసారు. పిన్ని కూతురుకి కన్యా దానం చేసి పుణ్యం సంపాదించుకున్నారు. విజయవంతంగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చారు. మా ఇంటికి అనకాపల్లి వచ్చినప్పుడల్లా మా అమ్మ చేసిన తోటకూర పులుసు ఇష్టం గా తినే వాడు. బొబ్బట్లు కూడా ఇష్టం. చిన్నప్పుడు మంచి నీళ్ళు తాగుదామని చెరువు లోకి దిగి నీటి ఒరవడికి కొట్టుకు పోతుంటే పక్కనే ఉన్న మా అమ్మ తను మావయ్యని పట్టుకుందామని నీళ్ళల్లో కి దిగిందిట. కానీ తనకు సాద్యం కాలేదు. ఇద్దరూ కొట్టుకుపోతుంటే ఊళ్ళో వాళ్ళు చూసి వేలూరి సూర్య నారాయణ గారి మనుములు అని గుర్తుపట్టి చెరువులోకి దిగి ఇద్దర్నీ బయటకు తెచ్చారుట. ఈ సంగతి అమ్మ చెబుతుంటారు.
శోభన్ బాబు లాంటి క్రాఫ్ తో అత్తయ్య మావయ్య శోభన్ బాబు రాధిక అని నేను మా అక్క అనుకుంటాం .
చిన్నదాన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. పోయిన వాళ్ళ గురించి 10,లేదా 12 వ రోజున ఏవైనా చెప్పమంటారని విన్నాను. మీరు ఆ టైంలో గరివిడి కి వెళ్ళగలిగి ఉంటే నేను మావయ్య గురించి రాసినది చదివి వినిపించగలరు.
సర్వేజనా సుఖినోభవంతు. 🙏🏻🙏🏻
శ్రీ వేలూరి రామకృష్ణ గారి మేనకోడలు