మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -2

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-3
3- గంగాదేవి -2
గురు స్తుతి తర్వాత గంగాదేవి సంస్కృత కవి స్తుతి చేసింది .వాల్మీకిని –‘’చేతతోస్తు ప్రసాదాయ –సతాం ప్రాచేతసో మునిః – పృధివ్యాం పద్య నిర్మాణ –విద్యాయః పరమం పదం ‘’-భూమిపై పద్యనిర్మాణ విద్యకు ఆదికారణమైన వాల్మీకి సత్పురుషునకు మనో నైర్మల్యాన్ని ప్రాసాదించు గాక .వ్యాసుని –‘’వైయాసికే గిరాం –పు౦ డ్రేక్షా వివ లభ్యతే –సద్యః సహృదయాహ్లాది-సారః పర్వణి పర్వణి’’-వ్యాస గురు వాక్ గుంభనం లో చెరుకు లోలాగా ,సహృదయ ఆహ్లాది అనే సారం ప్రతిపర్వంలో దొరుకుతుంది .కాళిదాసు ను-‘’దాసతాం కాళిదాసస్య –కవయః కేన బిభ్రతి –ఇదానీనామపి తస్యార్దా –నుపజీవస్య మీయతః’’ –ఇవాల్టి వరకు ఎవరిభావాలను సేకరించి కవులు జీవిస్తున్నారో ,అలాంటి కాళిదాసు కవి దాస్యాన్ని ఏ కవి కాదనగలడు ?బాణకవిని –‘’వాణీ పాణి పరామృష్ట –వీణా నిక్వాణ హారిణీ౦ –భావయంతి కథం వాన్యే-భట్ట బాణస్య భారతీం –‘’భారతి వీణానాదం లాగా అతి హృద్యమైన భట్ట బాణకవి వాగ్జాలన్ని ఎవరు భావించ గలరు ?భారవి ని –‘’ విమర్ద వ్యక్త సౌభాగ్యా –భారతీ భారవే కవే –ధత్తేవ కులమాలేవ –విదగ్ధా నాం చమత్క్రియా ‘’-పొగడ దండ లాగా సమ్మర్దం లోకూడా సౌరభాన్ని గుబాళించే భారవి వాక్కులు ధరి౦పని విద్వాంసు లెవరు ?దండి ని –‘’ఆచార్య దండినో వాచాం –ఆచా౦తామృత సంపదా౦ –వికాసో వేధసః పత్న్యా – విలాస మణి దర్పణః’’-అమృతం తాగితే ఎంత హాయో ,అలాంటి ఆనందం ఇచ్చే దండి వాగ్విలాసం భారతికి మణిదర్పణమై భాసిస్తోంది .భవభూతిని –‘’సాకాపి సురభి శ్శంకే-భవభోతేః సరస్వతీ –కర్ణేషు లబ్ధ వర్ణానాం –సూతే సుఖ మయీం సుధాం –‘’వింటేనే సుఖమయమైన అమృతాన్ని అందించే భవభూతి వాక్కు కామధేనువు అని భావిస్తాను .లీలాశుకుని –‘’మందార మంజరీ స్యంది –మకరంద రసాబ్ధయః –కస్యనాహ్లాదనాయాలం –కర్ణామృత కవే గిరః ‘’-మందార పుష్ప మకరంద సముద్రాలుగా ఉన్న లీలా శుకుని ‘’కృష్ణ కర్ణామృత శ్లోకాలు ఎవరికీ కర్ణానందం కలిగించకుండా ఉంటాయి ?
సంస్కృత కవులను స్తుతి౦చాక తెలుగు కవులలో తిక్కన గారిని –‘’తిక్కయస్య కవేః షూక్తిః –కౌమదీవ కలానిధేః-స తృష్ణైః కవిస్స్వైరం –చకోరివ సేవ్యతే ‘’చంద్రుని వెన్నేల ను తృష్ణతో చకోరాలు సేవించినట్లు ,తిక్కయజ్వ కవి సూక్తులను కవులు స్వేచ్చగా అనుభవిస్తారు .కాకతి రాజ్యపతనం తర్వాత అక్కడి హరిహర బుక్కరాయలు విజయనగరానికి వెళ్లి విజయనగర సామ్రాజ్యం స్థాపించారు .అందుకే కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజిని బుక్కరాయలకోడలు గంగాదేవి కవయిత్రి శ్లాఘించింది .తర్వాత ఓరుగల్లుకు చెందినతెలుగువారైన ముగ్గురు సంస్కృత కవులను స్తుతించింది –అగస్త్యకవి-‘’చతుస్సప్తతికావ్యోక్తి –వ్యక్త వైదుష్య సంపదే –అగస్త్యాయ జగత్యస్మిన్ –స్పృహఏత్ కోన కోవిదః ‘’-డెబ్భై నాలుగు కావ్యాలు రాసినసుప్రసిద్ధ పాండిత్యం ఉన్న అగస్త్యమహాకవి ని భూమిలో ఏ విద్వాంసుడు మరిచిపోతాడు ?’’.గంగాధర కవిని –‘’స్తుమస్తవపరం వ్యాసం –గంగాధర మహాకవీం –నాటక ఛద్మనా దృష్టాం-యశ్చక్రే భారతీ కథాం’’-భారత కథను అంతటినీ నాటకం గా మలచి అపర వ్యాసుడు అనిపించుకొన్న గంగాధర మహాకవికి నమస్సులు .విశ్వనాథ కవి –‘’చిరం ఛ విజయా భూయాత్ –విశ్వనాథః కవీశ్వరః –యస్య ప్రాసాదా త్సార్వజ్ఞం-సం విధే మాదృశేష్యపి’’
ఎవరి కవితా ప్రసాదం టో మాలా౦టి వారు సర్వజ్ఞులు అని అనిపించుకోన్నామో ఆ విశ్వనాథ కవి శ్రేష్టునికి సర్వకాల జయం కలుగుగాక .ప్రతాపరుద్రుని ఆస్థానకవి అయిన ఈ కవి భీముని సౌగంధికా హరణం ను వ్యాయోగం గా సంస్కృతం లో రాశాడు .ఈయన గంగాదేవికి కవితా గురువు కావచ్చు .ఆమె మధురావిజయ కావ్యం రాసేనాటికి ఈకవి సజీవుడే .శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వివరణ ప్రకారం –సౌగందధికాపహరణం వలన విశ్వనాథ కవిరాజు కు అగస్త్యకవి మేనమామ .కాదంబరీ నాటకం లో నరసింహకవి గంగాధర కవికి తండ్రి ,విశ్వనాథకవి అన్నఅని తెలుస్తోంది .
తన మధురా విజయ కావ్యాన్ని గూర్చి గంగాదేవి –‘’క్వచి దర్ధః క్వచిచ్చబ్దః –క్వచిద్భావః క్వచిద్రసః –యత్రైతే సంతి సర్వేపి –సనిబంధో నలభ్యతే ‘’అని చెప్పింది –భావం –ఒక చోట శబ్ద మరోచోట అర్ధ ,ఇంకోచోట భావ గాంభీర్యం మరోచోట అర్ధమాదుర్యం ,వేరొకచోట రస సంపద చూస్తున్నాం .అవన్నీ ఒక్క చోటనే లభించటం దుర్లభం .తనకవిత్వం లో దోషాలున్నా –‘’ప్రబంధ మీషన్మాత్రోపి –దోషో నయతి దూష్యతాం –కాలాగారుద్ర వ భరం –శుక్తి క్షారక నో యథా’’-నల్లని అగరు ద్రవ్యంతో నిండిన ముత్యం లో కొంచెం కారం కలిస్తీ ఎలా దూష్యమో,అలాగే కొద్ది దోషాలున్నకావ్యం కూడా దూష్యమే .గుణం లేనికావ్యం నిర్దోషమే అయినా రుచించదు అనికూడా ఒక శ్లోకం లో చెప్పి –‘’నిర్దోషాప్య గుణావాణీ-న విద్వజ్జన రంజనీ –పతివ్రతాప్య రూపాస్త్రీ –పరిణేలే నరోచతే’’-గుణ సంపద లేకుండా నిర్దుష్టంగా కావ్యం ఉన్నా పండితులను రంజింప చేయలేదు .పతివ్రత అయినా కురూపి అయిన స్త్రీని వరుడు అంగీకరించడు కదా.ఇవన్నీ గమనిస్తే గంగాదేవి ఎన్నో అలంకార శాస్త్రాలను మధించిందని అర్ధమౌతుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-3-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.