మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-7
5-తిరుమలాంబ-2
తిరుమలాంబ కావ్యం ‘’వరదాంబికా పరిణయం ‘’లోని సొగసులు –అచ్యుతరాయల తండ్రి నరసరాజు మృతి –‘’కాలాద్బహోరధ మహీ౦ విరహా సహిష్ణు –మాశ్వాస్య నవ్య నిజ శాశ్వత కీర్తి మూర్త్యా –నానా గుణ శ్రవణ కౌతుకినాం గుణా నాం –నాదేన సఖ్య మభజన్నరస క్షితీశః ‘’-చాలాకాలం భూ కాంతా విరహం సహింపలేని నరసరాజు కొత్త శాశ్వత కీర్తి మూర్తి చేఓదార్చి , తన గుణ విశేషాలు వినటం లో ఆసక్తిగల పరమేశ్వరుని తో స్నేహం చేశాడు .అచ్యుత ,వరదాంబికా వివాహ వర్ణన –‘’ప్రవిశ్య తస్మిన్ ప్రమనా నృపాలః –తాం రాజ కన్యాం విదినోప యేమ్య-శ్రియం పయోధేరివ శేష శాయీ –సమావయత్తాం సదనం స్వకీయం ‘’-సంతోష మనసుతోఅచ్యుతరాయలు నగరం ప్రవేశించి ,భగవాన్ విష్ణువులాగా క్షీర సాగర కన్య లక్ష్మి వలె శాస్త్రోక్తంగా వివాహమాడి తన గృహానికి వెళ్లాడు .కుమారుని నామ కరణ సందర్భం లో –‘’శ్రీ వేంకటాధీశ వరప్రసాదాత్ –జాతం కుమారం జగతీ సుదాంశుః-అముం హరేరంశ భవం విధిత్వా –నామ్నా వ్యతానీత్ చిన వే౦కటాద్రిం’’-భూలోక చంద్రుడు అచ్యుతరాయలు శ్రీ వేంకటాద్రీశుని అనుగ్రహంతో పుట్టిన కొడుకుకు శ్రీ వెంకటేశ్వర అంశ గా తెలుసుకొని చిన వెంకటాద్రి అనే పేరు పెట్టాడు .శ్రీ వెంకటేశ్వర ప్రార్ధన శ్లోకం –‘’అత్యాదరాత్ అచ్యుత దేవరాయాం –వరేణ్యశీలం వరదాంబికా౦శ్చ-శ్రేయో నిధిం ఛ చిబ వే౦కటాద్రిం –శ్రీ వెంక టేశశ్చిరకాల మవ్యాత్ ‘’-అచ్యుతరాయలను సాధుశీల వరదాంబిక ,శుభాకరుడు చిన వేం కటాద్రి ని ప్రేమతో శ్రీ వెంక టేశ్వరుడు చిరకాలం రక్షించుగాక ..
ఈ కావ్య రచనా కాలానికి అచ్యుతరాయలు విజయనగర సింహాసనం ఎక్కినట్లు లేదు .1530 కృష్ణరాయల మరణం తర్వాత సింహాసనం పొందాడు .కనుక అంతకుపూర్వమే తిరుమలాంబ ఈ కావ్యం రాసింది .1527లో అచ్యుతరాయలు సువర్ణ మేరు దానం చేసినప్పుడు హంపిలోని విఠలస్వామి దేవాలయ దక్షిణ ద్వారం దగ్గర వేయించిన శాసనం సంస్కృత –కర్నాటక భాష లో ఉంది .ఇందులో సంస్కృత భాగంఓదువ తిరుమలమ్మ రచించినట్లుంది.ఓదువ అంటే కన్నడంలో విద్యార్దిఅని అర్ధం .అ౦తఃపురంలో పురాణాదులు చదవటం వలన తిరుమలాంబ ఓదువ తిరుమలాంబ అయింది .మైసూరు చిక్క దేవరాయల వద్ద సంచి పట్టుకొని ఉండే కన్నడ కవయిత్రి హోన్నమ్మ సంచి హోన్నమ్మ గా పిలువబడింది .ఓదువ అంటే చదువరి అరసు అంటే రాజు ,అలియ అంటే అల్లుడు అని కన్నడం లో అర్ధం .తిమ్మరుసు, అళియ రామరాయలు తెలుగు వారే అయినట్లు ఓదువ తిరుమలాంబ కూడా తెలుగు స్త్రీయే .
సశేషం