మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు-404
404-పాత్రికేయుడు విమర్శకుడు ,’’కాలం మారింది ‘’సినీ నిర్మాత ,జాతీయ పురస్కార నంది పురస్కార గ్రహీత –వాసిరాజు ప్రకాశం
వాసిరాజు ప్రకాశం పాత్రికేయుడు, సినీ నిర్మాత, సినీ విమర్శకుడు. ఇతడు ఆంధ్రపత్రిక, వార్త, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మ్యాగజైన్ మొదలైన పత్రికలలో పనిచేశాడు. ఇతనికి జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది పురస్కారాలు లభించాయి. ఇతడు నందిపురస్కారాలు, భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు, అంతర్జాతీయల బాలల చలనచిత్రోత్సవాలు, ఫిల్మ్‌స్టార్ చారిటీ క్రికెట్ అసోసియేషన్ మొదలైనవాటికి జ్యూరీ సభ్యుడిగా కూడా వ్యవహరించాడు.[1]
సినిమాలు[మార్చు]
వాసిరాజు ప్రకాశం నిర్మించిన సినిమాల వివరాలు:[4]
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు విశేషాలు
1972 కాలం మారింది
కె. విశ్వనాథ్
ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారిచే స్వర్ణ నంది పురస్కారం.
1974 పల్లెపడుచు
కె.సత్య
1980 రోజులు మారాలి దేవదాస్ కనకాల
1980 బొమ్మలకొలువు
కొమ్మినేని శేషగిరిరావు
1980 బాపూజీ భారతం రేలంగి నరసింహారావు
1981 జంతులోకం హెంగ్ సైమన్
1983 వేటగాడి విజయం ఎం.ఎ.తిరుముగం
రచనలు[మార్చు]
తెలుగు
• సినీ భేతాళం[5]
• చిత్రభారతి
• తల్లి భారతి ముద్దుబిడ్డ: జాతిరత్న రాజీవ్ గాంధీ
ఇంగ్లీషు
• Projects for Prosperity: Three Years Golden Rule in Andhra Pradesh
• Great Celebrities of 116 Indian Cinema[5]
• A progress report, Indiramma smiles : golden rule in Andhra Pradesh
పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
• ఉత్తమ సినీ విమర్శకుడు – 2000
• సినిమాపై ఉత్తమ రచన – ప్రత్యేక ప్రస్తావన -2003
నంది పురస్కారాలు[6]
• ఉత్తమ చిత్రం (స్వర్ణ నంది) – కాలం మారింది – 1972
• ఉత్తమ సినీవిమర్శకుడు – 1999
• తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం – 2001
405-తోలి తెలుగు డబ్బింగ్ సినిమా ‘’ఆహుతి ‘’నిర్మాత ,,,కమ్యూనిస్ట్ భావాల వ్యక్తీ –వాసిరెడ్డి నారాయణ రావు
వాసిరెడ్డి నారాయణరావు తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు
ఆయన బాల్యం కృష్ణా జిల్లా వీరులపాడులో గడిచింది. విజయవాడలో విద్యాభ్యాసం చేస్తుండగానే జాతీయోద్యమానికి చేరువయ్యారు. కమ్యూనిస్టు రాజకీయ సభల్లో ఎక్కువగా పాల్గొంటూ వచ్చారు. 1937లో కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలో పాల్గొన్నందుకు కొంతకాలం రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవించారు. తర్వాత వీరులపాడుకు తిరిగి వచ్చి రైతు కూలీ ఉద్యమంలో చురుకుగా పనిచేసారు. కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం విధించడంతో ఆయన సినిమా రంగం వైపుకు పయనించారు. తెనాలిలో సత్యనారాయణ టాకీస్ ను నిర్మించారు. సినీ నిర్మాణంపై దృష్టి సారించారు. 1949లో “నీరా ఔర్ నందా” అనే హిందీ సినిమాను “ఆహుతి” పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు. తొలి తెలుగు డబ్బింగ్ సినిమా తీసిన నిర్మాతగా చరిత్రకెక్కారు. ఆ అనుభవంతోటే 1959లో నందమూరి తారక రామారావుతో “జయభేరి” అనే సినిమాను తీసారు. ఈ చిత్రానికి ప్రభుత్వం నుండి పురస్కారాలను అందుకున్నారు [1]
సశేషం మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-23 –ఉయ్యూరు