సరసభారతి వారి ఉగాది కవితల
సంకలనం కొరకు
.l…………………….
శీర్షిక:-తన్మయత్వమొందవచ్చు
–శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు, మచిలీపట్నం,
9490168715
……………………..
శుభకృతును పంపవచ్చు
శోభకృతుని పిలువవచ్చు..
అనుభవాలు చెప్పవచ్చు
అనుభూతులు పొందవచ్చు
పేరొక్కటి మారుతుంది
పంచాంగం మారుతుంది
తీరు ఎపుడు మారలేదు
తెలుగుదనం కొదువ లేదు..
మామిడిపుడు పూస్తుంది
కోయిలిపుడు కూస్తుంది..
చైత్రమాస మిపుడిపుడె
సొగసులద్దుకుంటుంది
మామిడాకు తోరణాలు
ముదముతోటి కట్టవచ్చు..
వేపపువ్వు కోయవచ్చు..
ఉగాదని చెప్పవచ్చు…
కవితలెన్నొ రాయవచ్చు
కోరి కోరి పంపవచ్చు
సన్మాన పత్రాలతో
సంతసంబు చెందవచ్చు..
పంచె కట్టు చూడవచ్చు
పంచాంగం వినవచ్చు..
రాజ పూజ్యాలనన్ని
లెక్క గట్టి ఉంచ వచ్చు..
ఉప్పు తీపు పులుపు చేదు
కారమింక వగరులంటు..
షడ్రుచుల ముచ్చటంటు
సరిపాళ్లలొ కుదిరెనంటు..
జీవితాని కర్ధమంటు
పచ్చడింత పెట్టవచ్చు..
సందడెంతో చూడవచ్చు
సంబరాలు చేయవచ్చు..
తెలుగుతనం తలనిమిరితే
తన్మయత్వమందవచ్చు…
అందుకే
శ్రీఘ్రముగ రావమ్మా…
శోభకృతు వత్సరమా….
……………..
మేడిశెట్టి యోగేశ్వరరావు
మచిలీపట్నం
9490168715