నెపోలియన్ భార్య ,ఫ్రాన్స్ సామ్రాజ్ని –జోసేఫిన్
జోసేఫిన్ అసలుపేరు మేరి జోసేఫిన్ రోజ్ సాచర్ డీలా పెగరి .నెపోలియన్ ను పెళ్ళి చేసుకొన్నాక జోసేఫిన్ బోనపార్టే అయింది. 23-6-1763లోపుట్టి 29-5-1814 న చనిపోయింది .బీదరికం లొ ఉన్న ఆమె తండ్రి నేవీలో కమిషనర్ .ఆమెకు పదిహేను ఏళ్ళు వచ్చేదాకా మార్టినిక్ ఐలాండ్ లొ ఉన్నాడు ,
1779 లొ జోసేఫిన్ సంపన్నుడైన యువ ఆర్మీ ఆఫీసర్ అలేగ్జా౦ డ్రే ను పెళ్ళాడి,పారిస్ చేరింది .ఇద్దరు పిల్లలకు తల్లి అయింది .అయినా గర్విష్టి భర్త ఆమె స్థానికతకు ,ఆడంబర౦ లేకపోవటాన్ని సహించలేక వర్సేల్లిస్ లోని మేరీ యా౦టోనేట్ కోర్ట్ లొ ప్రవేశ పెట్టటానికి అంగీకరించక పోయే సరికి ఆమె అభిమానం దెబ్బతిని అతనికి దూరమై ,1785 మార్చిలో పూర్తిగా అతడిని వదిలేసి పారిస్ లొ ఒంటరిగా మూడేళ్ళు గడిపింది .ఫాషన్ ప్రపంచాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ,1788లొ మళ్ళీ మార్టినిక్ చేరింది .1790లొ అక్కడ బానిసల తిరుగుబాటు ఎక్కువవటంతో మళ్ళీ పారిస్ చేరింది .అప్పుడు పారిస్ అంతా విప్లవంతో అట్టుడికి పోతోంది .
పారిస్ లొ ఉన్నత వంశీయులతో పరిచయాలు పెంచుకొని ఉంటుండగా ,భర్త విప్లవసైన్యం లొ చేరగా ,లెఫ్ట్ వింగ్ జాకోబిన్స్ తో వేరుపడగా ఆమె జీవితం అభద్రతకు లోనైంది . 1794 జూన్ లొ అతడిని ‘’గుల్లషిన్ ‘’అంటే ‘’సామూహికంగాఒక యంత్రంతో ఫ్రెంచ్ విప్లవకారులు నేరస్తులను తలలు నరికటంలేక గవద బిళ్ళలనుకోసి తీసేయటం’’ చేసి చంపేశారు.జోసేఫిన్ ను అరెస్ట్ చేశారు .కానీ జులై 27 న ఈ దారుణ మానవ కాండ అంటే టెర్రర్ కు సమాప్తిజరిగి పారిస్ సొసైటీ డైరెక్టరి ఆవిష్కరణ నాడు ఆమె విడుదలైంది .
విడుదలవగానే తనకున్న ఆడంబరం తెలివి తేటలతో యువ ఆర్మీఆఫీసర్ గా ఎదుగుతున్న నెపోలియన్ బోనపార్టే కు దగ్గరైంది .అతడు ఇటాలియన్ దండయాత్రకు కమాండర్ అయితే పెళ్ళి చేసుకొంటానని షరతు పెట్టి ,అది జరిగాక 9-3-1776 న సైన్యం హడా విడిలేకుండా ,పౌర వేడుకగా నెపోలియన్ ను వివాహమాడి జోసేఫిన్ బోన పార్టే అయింది .అయినా భవిష్యత్తులో చక్రవర్తి అవబోయే భర్త రాసే ప్రేమలేఖలకు ఉదాసీనంగా ఉంటూ ,అతడు ఈజిప్ట్ పై 1798-99కాలం లొ ప్రచారం చేస్తూ ఉండగానే ,ఇక్కడ జోసేఫిన్ ఇంకో ఆర్మీఆఫీసర్ తో ప్రేమాయణం సాగించింది.నెపోలియన్ ఆమెకు విడాకులిస్తానని బెదిరించాడు .కానీ అతడి సంతానం ఒప్పుకోక పోవటంతోగత్యంతరం లేక ,విడాకుల మాట ఎత్తకుండా ,క్షమించి ,ఆమె చేసిన భారీ అప్పులనుకూడా తీర్చేశాడు .
నెపోలియన్ బోనపార్టేదౌత్య కార్యాలయం లొ 1799-1804 కాలంలో చాలాజాగ్రత్తగా వ్యవహరిస్తూ తనపై ఎలాంటి అపవాదులు నింద లు లేకుండా వ్యవహరిస్తూ ,సాంఘిక కార్యక్రమాలలో పలుకుబడి పెంచుకొంటూ ,భర్త గౌరవాన్ని ఇనుమడింప జేస్తూ ,అతడి రాజకీయ భవిష్యత్తుకు విశేషంగా కృషి చేసింది.1804 మే నెలలో నెపోలియన్ ఫ్రాన్స్ దేశ చక్రవర్తి అయినప్పుడు ,జోసేఫిన్ అతడిని ఒప్పించి అతడు అనాసక్తంగా మహా వైభవంగా ఏర్పాటు చేసిన మత ధర్మాల వివాహం ను 1-12-1804 న చేసుకొన్నది . మర్నాడు పోప్ పయస్ 7 నోటర్ డాం లొ నిర్వహించిన భర్త నెపోలియన్ బోనపార్టే పట్టాభిషేకానికి హాజరై జోసేఫిన్ ఫ్రాన్స్ సామ్రాజ్నిఅయింది .
ఇప్పుడు ప్రపంచంలో జోసేఫిన్ స్థానం సురక్షితమైనది .ఇద్దరిపిల్లల పెళ్ళిళ్ళు ఘనం గా జరిపించాడు నెపోలియన్ .దీనితో ఆమె స్థానం మరింత భద్రమైనది .కానీ అతనికి మగ పిల్లాడిని ఇవ్వలేకపోవటం, ఆమె అతి ఆడంబరం వలన ఇద్దరిమధ్య దూరంపెరిగింది .రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందని నెపోలియన్ ఆస్ట్రియా చక్రవర్తి ఒకటవ ఫ్రాన్సిస్ కూతురు మేరీ లూసీ ని 1810జనవరిలో పెళ్ళి చేసుకొని ,1804లొ జోఫెఫిన్ తో జరిగిన పెళ్ళికి పారిష్ ప్రీస్ట్ రాకపోవటంతో చెల్లదనె సాంకేతిక కారణంగా విడాకులు అక్కర్లేదు అనటంతో చర్చి ని ,ఆస్ట్రియ చక్రవర్తిని ఇరకాటంలో పడేసింది.
జోసేఫిన్ పారిస్ లోని ప్రైవేట్ నివాసంలో చేరి ,పిచ్చపిచ్చగా ఖర్చు చేస్తూ ఉంటే చక్రవర్తి నెపోలియన్మారుమాట్లాడకుండా నీళ్ళు నముల్తూ ఆ బిల్లులు చెల్లిస్తూ ఉన్నాడుపాపం .నెపోలియన్ సార్వభౌమాధికారం పోయిన తర్వాత రష్యన్ చక్రవర్తి మొదటి అలెగ్జాండర్ సంరక్షణలో కొద్దికాలం ఉండి,వెంటనే జోసేఫిన్ బోనపార్టే 29-5-1814 న51 వ ఏట చనిపోయింది .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -33-4-23-ఉయ్యూరు