శోభకృద్వర్షమా!
శ్రీమత్శోభకృదాఖ్యవత్సర శుభాశీర్వాద సంప్రాప్తతన్,
ప్రామాణ్యైక నిబద్ధనిత్య నికషా ప్రాబల్య మింపాఱగా,
ధీమంతోజ్జ్వల దివ్యతంత్ర ప్రభలన్ దేదీప్యమానంబుగా
సీమాంతావృత శోభలం దనరుచున్ సీమాంధ్ర వెల్గొందుతన్ 1.
అందంబౌ సుకుమార పత్ర సొగ సల్లాడించు వృక్షంబులున్,
యెందెందున్ విననట్టి శ్రావ్యసుఖమెంతేనిచ్చుచున్ గోకిలల్,
సౌందర్యార్ద్ర విశీర్ణ నింబతరులున్ సౌగంధ పుష్పాలతో,
విందున్ గూర్చగ వత్సరాది! యదిగో వేంచేసె శోభాత్మయై. 2.
సాదరసానుకూల మనసందరకున్ గలగంగ జేయుచున్,
సోదర సౌహృదమ్ము, సరసోన్నతముత్తమ గ్రంధిబంధమున్,
సాదుజనాంచితాత్మకము సత్యము నిత్యమునైన మేళు, లీ
పాదున పాతినంతన నపార ఫలంబిడు ‘శోభకృత్తు’ గాన్ 3.
అందరికి ‘కరోన’ హానిని జేకూర్చ,
శుభముగూర్చి జనియె ‘శుభకృత్తు’,
ఇంక నెక్కువగను, యెల్లజనులకును,
శోభ గూర్చ వచ్చె శోభకృత్తు!

శోభ గూర్చ వచ్చె శోభకృత్తు! 4.
కష్ట సుఖము లానంద దుఃఖములకెల్ల,
కారణము తీపిచేదులు కారముప్పు,
లనెడి వేదమ్ము నెఱుగుచు నందరున్ను,
ఆయురారోగ్య శోభల నందుకొనుము! 5.
సరసకవిరాజు,
విద్వాన్ నవులూరి రమేశుబాబు,
ఎం.ఏ.,ఎం.ఫిల్.
19.03.23,
ఉయ్యూరు.
ధన్యవాదాలు