మామిడి పూడి వారి జ్ఞాపకాలు తర్వాత —
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఎల్లుండి గురువారం 6వ తేదీతో ఫేస్ బుక్ లొ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న పద్మభూషణ్ ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి ‘’మారుతున్న సమాజం లో నా జ్ఞాపకాలు 23 వ ఎపిసోడ్ తో పూర్తవుతుంది .
7 వ తేది శుక్రవారం ఉదయం నుంచి సోషలిస్ట్ నాయకుడు రాం మనోహర్ లోహియా మన పురాణ ,,ఇతిహాసాలపై ప్రసరి౦ప జేసిన ‘’కొత్త వెలుగు ‘’ప్రసారమవుతుంది .
కొత్త వెలుగు పూర్తవగానే డా .సాగిరాజు సత్యనారాయణ రాజుగారి సమగ్రానుశీలనం ‘’తిక్కన ద్రోణ పర్వం ‘’ప్రారంభమవుతు౦ద నితెలియ జేయటానికి సంతోషంగా ఉంది.దుర్గాప్రసాద్ -4-4-23.