పాటగా శ్రీ రామ రామశతకం
కవిగారు సీస పద్యం లో తానూ శతకం కూరిస్తే ,తిరుపతి స్వామి వారి ద్రవ్యంతో ముద్రణ పొందిదని ,క౦దార్ధాలలో తానూ చెప్పిన తత్వార్ధాలను పెద్దలు పిన్నలు పాటించమని వేడుకొన్నారు .ముద్రణ ఖర్చు శ్రీ బోడేపూడి వీరయ్య చౌదరి భరించారని ,కావాల్సిన కాగితాలూ సమకూర్చారని చెప్పి ‘’శ్రీ రఘురామ రామ యని –సారెకు మది దలచి నేను సన్నుతి జేసి శీ –శ్రీరామ రామ శతకము –శ్రీ రాముల కంకితము గా జెప్పేద వినుడీ –భక్తి రసములోన ఓలలాడుడీ ‘’అని వరకవి శ్రీ బోడేపూడి వెంకట సుబ్బయ్య ‘’కవి వేడుకొన్నారు .
‘’శ్రీ రా మ రామా మము బ్రోవు శృంగార సుగుణ ధామా –కోరి వేడు చుంటిమీ మమ్మేలు కొనుము శ్రీరామ రామ ‘’
ఇలా శతకం మొదలు పెట్టారు .ఇష్ట దేవతల౦దర్నీ స్తుతించి శతకం చెబుతున్నానన్నారు .గణేశ శారదాంబాలకు భక్తిగా వందనం చేసి మాయా లోక వివరాలు మొదలు పెట్టి చెప్పారు .మానవ జన్మ శుక్ల శ్రోణి తాలతో కలుగు తు౦దని ,కర్మాగా పిందమేర్పడి ఏ నెలలో ఎలా పెరుగు తుందో వివరిస్తూ ,శిశు జన్మ కాగానే ‘’మాయా మంత్ర సాని వనితలు బొడ్డుకోసి ,నీళ్ళుపోసి జోలలు పాడతారనీ ,ఇదంతా మాయే అనీ ,ఆనందం వెనుక దుఖం ఉందని ,ఈ నరజన్మ ఎన్ని రాశులలో పుట్టాక వచ్చిందో ఎవరికీ తెలీదని చెప్పారు .బాల్యం లో రామ భజన చేద్దామనుకొంటే ,ఆటలపై ధ్యాస ఎక్కువై ,ప్రాయంలో చేద్దామంటే కామం కళ్ళు కప్పుతుందని ,తర్వాత పెళ్ళి జంజాటం పిల్లల ఆరాటం వారి పోషణలో గడిచిపోతుందని నిన్ను స్మరించటం అసాధ్యమని పిస్తుందని ,పాడి పంటలు భోగ భాగ్యాలు ఆశిస్తూ వాటిపై తపిస్తూ దొరకగానే,పోషణ ఎట్లా అని దిగులుపడుతూనిన్ను దూరం చేసుకొంటాడు జీవి .
‘’నా నోరు చేసిన పాపమూ నీ స్మరణ జేయనివదయా –నానాటి లిల్బిషంబు నెడబాపి నన్నేలు రామా ‘’ చేతులు నీపూజను కళ్ళు నీరూపును ,కళ్ళు నీ కధలు ,శిరసు నీకు మొక్కటానికి సహకరించవు .కాలయముడు వచ్చి వేగంగా పాశం విసిరితే మరణం ఖాయం ..ఇల్లు ఇల్లాలు వాకిలి ధన ధాన్యాలు ఎవరి పాలౌతాయో తెలీదు .తెలిసికొన్ని తెలియకకొన్ని పాతకాలు చేశాను .వాటినుండి దూరం చేయిరామా .గురువులను మహాత్ములను అహంతో పరిహసి౦ఛాను .దేవుడు లేడని దుర్భాష లాడాను .పరులను దూషించాను .ఎవరు చెప్పినా వినక మందమతి గా ప్రవర్తించాను .పరమ పాపిష్టి నయిపోయాను నువ్వే దిక్కు .
‘’వర్ణింప నీ రూపునూ వ్యాస వాల్మీక మౌనిగాను –స్మరణ చేసేటి భక్తుడన్ –కోరికలు సమకూర్చు రామా శ్రీరామా ‘’ విభీషణుడిని ఆదరించావు నన్ను దూరం చేసుకొంటావా “అని భక్త రామదాసులాగా ‘’భూములిమ్మంటినా , భూషణాలు అడిగానా ,కామితార్దాలిచ్చి కావు కావు అని కాకిలా అరుస్తున్నా .మాతల్లి సీతమ్మ కూడా నాబాధలు చెవిన వేయటం లేదా ?అని ఒక సన్నాయి నొక్కు నొక్కారు .పోనీ తమ్ముడు నిన్నంటి ఉండే లక్ష్మణుడు ,పోనీ 24×7 నిన్నే కొలుస్తూ ,నీతోనే ఉంటున్న హనుమకూడా చెప్పలేదా రామా ?పంతమదేల మాపయి బ్రోచుట భారమా ?అని నిందా స్తుతీ చేశారు కవి.
ఫలస్తుతి చెబుతూ ‘’ధర నీదు శతకమెపుడు యా చంద్ర తారార్కమై జెలంగా – పరిపూర్ణ భావమూ తో భక్తులకు ఫలమొసగునూ రామా’’.హృదయ పూర్వకంగా శతకం తాసి నిండు మనసుతో అన్కితమిచ్చాను ..ఇంత కఠినుడవని నాకు ముందే తెలిస్తే –సుంతైనా నీనామము నుడువనూ సున్నా ‘’ అని పంగనామాలూ పెట్టారు .శరణా గతుడు అనే బిరుదు తగిలించుకొని నావైపు కన్నెత్తి చూడనే చూడవు .’’గోరంత దీప మెలుగా చీకటీ కోనంత వెలుగాయే –పారిపోయెను పాపముల్ నీ పాద భక్తీ చే రామా ‘’.ఈ శతకం లో భక్తిరసం ,పిండోత్పత్తీ నేర్పుగా రాశాను .ఈశతకం చదివినా విన్నా –వాసిగా మోక్ష పదవీ సమకూరి వర్ధిల్లు ను ‘’
108లో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా నడి గడ్డ గ్రామం లో జన్మించానని ,గోత్రం వల్లుట్ల అనీ ,తండ్రి బోడేపూడి వెంకయ్య అని మంగళం పాడి వచనంలో ‘’శ్రీరామ చంద్ర కరుణా కటాక్ష వీక్షణా లబ్ధ సంపన్న ,పడపద్య కవితా ధురీణ ,,సంగీత నిపుణ ,వల్లుట్ల గోత్ర పవిత్ర బోడేపూడి వంశ పయః పారావార రాకాసుదాకర వెంకయాఖ్య ప్రియ సుత వెంకట సుకవి ప్రణీతంబైన శ్రీరామ రామ శతకం సంపూర్ణం ‘’అని ముగించారు .
నరసరావు పేట రాజ్యరమా ప్రెస్ లో ఈ శతకం 1935లో ముద్రింపబడింది .వెల-కనపడ లేదు .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-23-ఉయ్యూరు —