రంగం మూరెడు తాండవం బారెడు
దమ్మున్న దర్శకుడు కృష్ణ వంశీ అంటే నాకు ఖడ్గం సినిమా నుంచి అభిమానం . ఈ మధ్య రంగ మార్తాండ సినిమాపై ఎన్నో ఇంటర్వ్యూలు ,ప్రజాభిప్రాయాలు గమనిస్తూనే ఉన్నాను .సిరివెన్నెల స్వాన్ సాంగ్ అంటే ఆఖరి గీతాలున్న సినిమా అని తెలిసింది .రమ్య కృష్ణ నటన నాకు మరీ ఇష్టం .ప్రకాష్ రాజ్ ఏ పాత్రకైనా గుర్తింపు తెస్తాడు అతడి అభినయానికీ నేను ముచ్చటపడతాను.బ్రహ్మానందం పోడిచేశాడని చాలా మంది అన్నారు .ఇళయరాజా సంగీతం స్వర ధుని .ఇన్ని ప్లస్ పాయి౦ట్లున్న సినిమా ధియేటర్ లోనే చూద్దామని అనుకొన్నాం నేనూ మమనవరాలు రమ్య .కానీ కొత్తగా కరోనా భయంతో వెళ్ళలేదు .రోజూ మా అబ్బాయి శర్మ చూశారా అని సతాయిస్తూనే ఉన్నాడు .అమజాన్ లో ఇవాళ మధ్యాహ్నం చూశాం .ముందుగా రంగామార్తాండ టైటిల్ నాకు చాలా ‘’హెవి’’గా ఉందనిపించింది .సున్నిసితత్వం అక్కడె సినిమా కోల్పోయింది .
ఏ ఒక్క సన్నీ వేశమూ మనసుకు పట్టలేదు .డైలాగులు బాగా కుట్టాడు రచయిత.బ్రహ్మానందం లేక పొతే ఈ సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు పైగా బోలెడు లాభం .కనిపించిన ప్రతిసారీ ప్రకాష్ ను ‘’పిచ్చి పిచ్చి తిట్లు ‘’తిడుతూ ఎంటర్ అయి ఇదే౦ ఖర్మరా బాబూ అనిపించాడు .అతని అవసరం ఉందనుకొంటే ‘’దా .వీ .జు. కర్ణ ‘’లోనికొండవీటికవిగారి ఆ’’ కట్ చేసిన సీన్’’ పెడితే లాగ్ ఉండేదికాదు .స్నేహితుల మధ్య ఉండాల్సిన ఉదాత్తత శంకరాభరణం లో అల్లు- సోమయాజులమధ్య బాగా నిండుగా గొప్పగా నడిచింది . బ్రహ్మం బార్య అతనిపై చూపిన ప్రేమాభిమానాలకు ఎక్కడా చోటే లేదు .ఆమె చనిపోతే ,దహనం జరుగుతుంటే మందుకొట్టటం చాలా దారుణం .
లక్ష్మీ నివాసం సినిమా కు దీనికీ పెద్దగా తేడాలేదు .అందులో అందరూ బాగా నటించారు పాటలు సందర్భాన్నిబట్టి బాగా ఆకర్షించాయి అ సినిమాకు అది చాలా ప్లస్ పాయింట్ .ఇలాంటి సినిమాకు రంగ మార్తాండ లే అక్కర్లేదు ఇవాళ ఎవరి జీవితాలైనా అలానే ఉన్నాయి ,ఉంటాయి .ముందు చూపు లేని ప్రతి వాడి జీవితం ‘’మద్దెల దరువే’ .ఎక్కడో తప్పులో కాలేశాడు వంశీ .కానీ ఇందులో అంత పెద్ద సంగీత దర్శకుడితో వినిపించీ వినిపించని రాగాలతో సంగీతం లాగించినట్లుంది.సినిమా చూశాక ఒక్క లైన్ సాహిత్యం ఒక్క సుస్వరం మనల్ని హా౦ట్ చేయక పోవటం పెద్ద లోపం .పాపం రమ్య కృష్ణను గమ్య స్థానం చేర్చకుండానే మధ్య ఊర్లో మర్రి చెట్టు అరుగుపై నిద్రలోనే తుదిశ్వాస పీల్చేట్లు చేయటం ఆమె అభిలషించిన దానికి విరుద్ధం .ఆమె కోరిక తీరనే లేదు , ఇంటర్వ్యు లో ఆమెకు తల స్నానం చేయించిన సీన్ బాగా వచ్చిందని వంశీ చెప్పాడు .నాకు కనిపించలేదు రెండుమూడు సార్లు వెనక్కి ముందుకు తిప్పి చూశానుకానీ కనిపించలేదు .తీసేశారేమో . వాడేవడినో ఫారిన్ నుంచి తెప్పించి తెలుగు సీన్ షూట్ చేయటం తగుదునమ్మా అంటూ బళ్ళారి రాఘవ సారీ ప్రకాష్ రాజ్ రావటం ,భారీ డైలాగులు ఇద్దరిమధ్య, మధ్యలో సన ,తలనొప్పి సన్నివేశాలే .అనుకొన్నది ఒకటి అయినది ఒక్కటి అన్నట్లు సినిమా జన హృదయాలను పూర్తిగా తాకలేకపోయింది .ఆర్ద్రత లోపించింది .సెంటి మెంటల్ గా నడిచింది .మంచి కొడుకు, మంచి అల్లుడు పాత్రలు బాగున్నాయి .చాలాసార్లు రమ్య కృష్ణ డైలాగ్స్ మనకు వినిపించవు .అక్కడ క్లారిటి లోపించింది .త్వరలో చనిపోతున్దికనుక అలానే ఉండాలనుకొన్నారేమో? .ఇద్దరు మహా నటులను పరిచయం చేసి వారిద్దరూ వారి భార్యలు కూడా చనిపోవటం లో ఈ సినిమా ఇచ్చిన సందేశం ఏమిటో నాకేమీ అర్ధం కాలేదు .
సీను సీను ఏదో లాగుతూ ,ఎక్కడికో తీసుకుపోతూ ,తాగుడు మయమై సందేశాన్ని మంటగలిపింది .బరువెక్కిన హృదయాలతో ,కళ్ళనుంచి దుఃఖాశ్రువులు రాలుస్తూ బయటికి రావాల్సిన సినిమా అందునా కృష్ణ వంశీ సినిమా ఇలా నిరాశ పరచటం నాకు చాలా బాధ గా ఉంది. అతడి ఆలోచనలు గొప్పవి .అవి సెల్యులాయిడ్ పైకి ఎక్కేటప్పటికి పెడ దారి పడతాయేమో పాపం .గొప్ప సక్సెస్ కావాల్సిన చిత్రం చిత్రంగా కొలాప్స్ అయింది .ఈలోపే ‘’బలగం’’ వచ్చి బలంగా ఊడ్చేసి౦దేమో ననిపిస్తోంది .సారీ మైడియర్ కృష్ణ వంశీ.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-23-ఉయ్యూరు