పండిత కవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ‘’ఆత్మోపహారం ‘’అనే సర్వ సర్వేశ్వర శతకం ‘’.
ఈ శతకం 1955 డిసెంబర్ లో కాకినాడలోని బివి అండ్ సన్స్ వారి చే పునర్ముద్రణ పొందింది .అచ్చులో వెల 8 అణాలు ఉంటే పెన్ను తొ దిద్ది 5 అణాలుగా మార్చారు .’’ఒక్క మాట’’అంటూ కవిగారు ‘’ఆత్మోపహారం గా ఈ శతకం 1947 లో రాశాను .ప్రతులన్నీ వెంటనే చేల్లిపోయాయి .మిత్రులు చాలామంది కావాలని కోరితే ,ఇప్పటిదాకా మళ్ళీ ముద్రించ లేక పోయాను .ఈ ముద్రణలో ‘’శర్వా !సర్కా లోకేశ్వరా ‘’అనే మకుటం చేర్చాను .గురు ,శివా అభేదం అనే భావంతో రాశాను .భగవత్ భక్త సంబంధం రహస్యంగా ఉండాల్సిందే .గురు శిష్య సంబంధం వ్యక్తిగతం .పరిహాస రచనపై ప్రాణమున్న వారికి పరమార్ధ రచనపై కంటగింపు ఉండక తప్పదు .వారిని ఉద్దేశించి ఇది రాయలేదు ‘’అని చెప్పుకొన్నారు .
శతకం ప్రారంభిస్తూ ‘’శ్రీ శ్రీ శ్రీ గురు దేవ పాద జలజ శ్రీమత్సుధా వార్ధివి –శ్వ శ్రేయ సముపార్జనంబున ,పరబ్రహ్మ ప్రమోదాప్తికై –స్వ శ్రేయస్కర బుద్ధి షట్పదము లుత్సాహించి క్రోలున్ మహ – త్వశ్రీ లౌ నమృత౦పు బిందువులు శర్వా !సర్వ లోకేశ్వరా ‘’అన్నారు .నీ కారుణ్యం తొ మొదట రాసి సమర్పించాను ‘’భక్తి భరితానంద ప్రపూర్ణాత్మ తో –ప్రాకామ్యమిచ్చావు .ఉమా రమా ధీశ్వరా భక్తిలో పట్టభద్రుడను .నన్ను పోలిన వారేవ్వరూలేరు ఇంద్రోపేంద్రులు కూడా బలాదూర్ .ఆపరమానంద స్వరూపుడిని నేను .సర్వ తీర్ధాలు నీ పంచనే ఉంటూ నిన్నారాధిస్తాయి .నువ్వు రూపు దాల్చిన బ్రహ్మ జ్ఞానం .బ్రహ్మర్షి ప్రవరమైన గురువే నీవు .’’నీ సేవా పరిపూర్ణ కాంక్ష నిర్వాణ సామ్రాజ్య లక్ష్మీ సింహాసన సుఖ ప్రతిష్టిత సుఖ శ్రీ ప్రాప్తి మూలం ‘’.నా నీ సాంగత్యం జగన్నిర్మాణ శోభాదృక్షము నీనామం ఒక సారి నాల్కపై నిల్పితే ,నీ నారాయణ రూపాన్ని ఆత్మలో ఒక సారి నిలిపితే నీ దివ్య చరిత్ర ఒక్క సారి వింటే ,’’నర్తించు నరు౦డు నీ వయి ‘’అంటూ అద్వైతానంద ప్రదర్శనం చేశారు కవి .నీ వర వాత్సల్య విశేషం పరమాద్భుతం .
క్షణిక మైన విశాల విశ్వం లో నీ సాంగత్య భాగ్యం ఆణువైనా ,మేరు సమాన సత్ఫలితమిస్తుందని పొంగిపోయారు .ప్రణవం ఒక్కసారివింటే పాపాటవులన్నీ కాలిపోతాయి.నా నీచ జీవితాన్ని నీ కారుణ్య సంపత్తి తొ చాలా శోభాకరంగా మార్చావు .నీకారుణ్యం లేకపోతె నా బతుకు దుర్భరం .ఈ భూమి మీదే మాకోసం స్వర్గగతులు సృష్టించి అందించావు .నిత్యం శంకా గ్రంధి విచ్చేదనం చేస్తూ సర్వ గరిష్ట జ్ఞానం అందించావు .అణువులో అణువు గా ,బ్రహ్మా౦డాను భావునిగా ,వెల్గు వెల్లువగా బ్రహ్మర్షిగా ,గుణులలో గుణి గా ఉన్న నిన్ను అర్చించి సేవిస్తే మేమందు కోలేని మోక్ష సామ్రాజ్యాలున్నాయా స్వామీ !నీకు నిద్రాహారాలు లేవు –మహా నిర్నిద్ర సౌభాగ్య సంపద్రాజ్యంబున సుస్ధిరుడవు’’.జగ ద్భ్రద్రాను సంధాయివి.క్షుద్రమైన ఇహలోక సౌఖ్యాలను అక్షుద్ర ప్రభావంతో త్యజించి మించిపోయిన భద్రాత్మకుడవు .అన్నారు ఈపద్యంలో శ్రీనాధుడు కనిపిస్తాడు .నీనామం పది వేలు చేసే సువర్ణం .రామాక్ష్మాపతికి నువ్వే సరి జోడు.
పరమేశ్వర రూపాన్ని ఎంత విస్ఫష్టంగా ఎంత జగన్మోహన కరంగా ,ఎంత భక్తి భావ పరిపూర్ణంగా వర్నిస్తారో తెలియ జెప్పే పద్యం చూద్దా౦ –‘’ఆ కర్ణాంత విశాల నేత్రములునేత్రానందము౦ గూర్ప సు –శ్లోకంబౌ ముఖ పంకజ౦బు సిరిచే శోభింప విస్తీర్ణమై –లోకుల్ మెచ్చు లలాట మొప్పగ ,మహా లోలత్వముం గూర్చు స-ర్వాకర్ష౦బగు మూర్తి దాల్చితివి శర్వా !సర్వ లోకేశ్వరా ! ‘’అక్షర లక్షలు చేసే మహా అరుదైన పద్య రాజమిది .నీ క౦ఠారవ దివ్య దుదుభినాదం వజ్రమే .నిన్ను కొల్చే వారికి ఉత్కంఠ .అదే ఉత్కృష్ట శోభాకర ఆపత్కాల ఉద్ధరణం . గుదప్రక్షాళనం దగ్గర్నుంచి కూర్చోటం నిలబడటం ,ఉచిత సంభాషణం సత్సంభావనా నైపుణ్యం మొదలైనవన్నీ నీ దగ్గరే జనాలు బతకటానికి నేర్వాలి ‘’అనే కొత్త తమాషా పద్యం రాశారు .’’నీవే నేనయి ,నేనె నీవయి ,నేనే సమస్తమునై ,ఈ విశ్వం నా నిర్గతమై ,నా ఇష్టానుసారంగా ప్రావిర్భావిస్తూ ప్రవర్తిస్తూ ,వెడలిపోతూ,వర్తించి నర్తిస్తూ అంతా లీలగా భావిస్తాను ‘’అన్న ది త్వమేవాహం కు పద్యాకృతి .కవిగారి పాండిత్యానికి అద్వైత దర్శనానికి పరాకాష్ట .
జీవ బ్రహ్మలు వేరుగా అనుకొంటే నిన్ని సేవకుడిగా సేవిస్తాను .జీవ బ్రహ్మలు అద్వయం అనుకొంటే నిను చింతించే వేళ మహానుభావుడను ,సకలమూ నేనే అవుతాను ‘’మరోఆణిముత్యమైన పద్యం.లీలకోసం పురుడు పుణ్యాలు ధనం దాంపత్యం సుఖభోగం ,కర్మమర్మం సృష్టించి మమ్మల్ని ఆడిస్తున్నావు .నువ్వు ఉండగా నాకు ఈ భువన ప్రపంచ విలసన్నాట్యం ఎందుకు?నా చీకాకులు చెప్పి కావు మనటం సిగ్గుగా ఉంది అని దెప్పారు.ఈశా వ్యాస పరాశరాది వినుతా,దేవా మంగలమంగజాట నిధనా,శర్వా సర్వ దిగంతరాత్మ ,భక్తాధీన మనోమ్బుజాత మొదలైన పద్యాలు కవిగారి పరా భక్తికి తార్కాణ .110 వ చివరి పద్యంలో
.’’జననంబందితి నేను శ్రీ బులుసు వంశంబందు నా యక్ష పా-దుని సద్గోత్రజుడన్ ,త్వదీయ పద భక్తుండన్ నినున్ నిత్యమున్
గని పూజింతును వేంక టేశ్వరుడ,నీ కారుణ్య మర్ధించుటే –పనిగా నుంటిని స్వీకరి౦పుమిక శర్వా !సర్వ లోకేశ్వరా ‘’.
ఇపుడు కవిగారి సర్వ లోకజ్ఞత తెలుసుకొందాం –
శ్రీ బులుసు వెంకటేశ్వర్లు ప్రముఖ కవి ,రచయిత, సాహితీ విమర్శకులు. ఆయన 1956 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.[1]. కవివతంస బిరుదాంకితులు
జీవిత విశేషాలు
ఇతడు తూర్పు గోదావరి జిల్లా, పొడగట్లపల్లి శివారుప్రాంతమైన రామచంద్రాపురంలో 1906, ఏప్రిల్ 10న జన్మించారు. ఇతడు మొదట వేదవిద్య, తరువాత ఆంగ్ల విద్యను అభ్యసించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి వేదాంతంలో, తెలుగు సాహిత్యంలో రెండు ఎం.ఎ.పట్టాలు సంపాదించారు. తరువాత తెలుగు ఉపన్యాసకునిగా 30 సంవత్సరాలు పనిచేసి 1963లో పదవీ విరమణ చేశారు. గొప్ప వచన రచయితగా, వక్తగా రాణించారు.
రచనలు
· మన కవులు : ‘రామరాజ భూషణుడు’, ‘ధూర్జటి’, ‘తెనాలిరామకృష్ణుడు’ వంటి ప్రాచీన కవుల నుండి మొదలుకొని, ’విశ్వనాథ సత్యనారాయణ’, ’నండూరి రామకృష్ణమాచార్య’, ’గుంటూరు శేషేంద్ర శర్మ’, ’వేముగంటి నరసింహాచార్యులు’ వంటి దివంగత ఆధునిక కవులతోబాటు; ’అనుమాండ్ల భూమయ్య’, ’దుగ్గిరాల రామారావు’, ఇంకా ‘ఆచార్య ఫణీంద్ర’ వంటి సమకాలీన కవుల వరకు 50 మంది కవులు రచించిన అనేక విశిష్ట పద్యాలను హృద్యంగా విశ్లేషిస్తూ రచించిన చక్కని విమర్శన గ్రంథం.[2]
· “వావిళ్ల నిఘంటువు” (1949) : వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి తో కలసి వ్రాసినది.[3]
· భారతీయ తత్వశాస్త్రము-పరిశీలన : (1956 సాహిత్య అకాడమీ అవార్డు)[4]
· యజ్ఞఫలము [5]- 1962
· Thousand Steps to God [6]- 1975
· శ్రీరామాష్టవ సుధాలహరి – 1967
· బులుసు వెంకటేశ్వర్లు జీవిత చరిత్ర[7] – 1977
· నిర్వచనాంధ్ర శ్రీమహాభాగవతము [8]
· శ్రీ శివప్రభుశతకం – 1978
· సర్వదుఃఖ నివారణోపాయము[9] – 1967
· Lives of ancient India Saints[10] – 1982
· అష్టావక్ర చరిత్రము[11]
· మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-23-ఉయ్యూరు