నైజీరియా ఆర్ధిక మంత్రిగా ,ప్రపంచ బ్యాంక్ లో 20 ఏళ్ళు పని చేసిన మహిళ -నకోజి ఒక౦జొ ఇవేలా

నైజీరియా ఆర్ధిక మంత్రిగా ,ప్రపంచ బ్యాంక్ లో 20 ఏళ్ళు పని చేసిన మహిళ -నకోజి ఒక౦జొ ఇవేలా

ప్రపమచ వాణిజ్య సంస్థను మొట్టమొదటి సారిగా నిర్వహించిన నైజీరియా నల్లజాతి మహిళా రత్నం నకోజి ఒక౦జొ ఇవేలా.నల్లజాతి స్త్రీలలో గ్లోబల్ ,నేషనల్ పవర్ పొందిన అరుదైన మహిళ ఆమె .రెండుసార్లు నైజీరియా ఆర్ధిక మంత్రిగా వరల్డ్ బ్యాంక్ లో 20ఏళ్లకు పైగా సేవ లందించిన అరుదైన గౌరవం పొందింది .బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ ‘’ది వాక్సిన్ అలయెన్స్ ‘’లో పని చేసిన సామర్ధ్యం ఆమెది . నకోజి ఒక౦జొ ప్రపంచ విశిష్ట పదవి పొందిన  మొట్టమొదటి మహిళ మాత్రమేకాక మొదటి ఆఫ్రికన్ కూడా అవటం మరింత విశేషం .ఆ అత్యున్నత పదవి స్వీకరిస్తూ ఆమె హుందాగా అత్యంత వినయంగా ‘’ఈ రోజు WTOసభ్యులు చరిత్ర సృష్టించారు .73ఏళ్ళ GATT మరియు WTO చరిత్రలో మీరు మొట్ట మొదటిసారిగా ఒక మహిళ,అందులోనూ ఒక ఆఫ్రికన్ కు  డైరెక్టర్ జనరల్ పదవి కట్టబెట్టి చరిత్ర సృష్టించారు .ఇది అసాధారణ ,ధనాత్మక నిర్ణయం .నాపై  మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞురాలిని.ఒకమహిళకు అందునా ఒక ఆఫ్రికన్ కు ఈ పదవి ఇచ్చినందుకు కాదు ,నా జ్ఞానాన్ని అనుభవాన్ని గుర్తించి మరీ ఈ పదవి అందజేసినందుకు కృతజ్ఞతలు .అంతేకాదు నాలోని శక్తిసామర్ధ్యాలను ధైర్యాన్ని గుర్తించి ,మీతో కలిసి పని చేయగలనని నమ్మి ,భవిషత్తుకు  మన సంస్థ ఇస్తున్న భారోసాలో పాలు పంచుకోనేట్లు చేసినందుకు సంతృప్తిగా ఉంది’’అని వివేకం ఉట్టిపడేలా మాట్లాడి అందరి నమ్మకాన్నీ అందుకొన్నది .

13-6-1954 న నైజీరియాలోని అగ్వాషి ఉకువు లో నకోజి ఒక౦జొ  పుట్టింది.తల్లితండ్రులు –చుకూవ ఒకన్జో ,కామీన్ ఒకన్జో .మాసా చూసేట్స్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చదివింది .ఇకంబా ఇవేలా నుపెళ్ళాడింది .నైజీరియా ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ బడ్జెట్ అండ్ నేషనల్ ప్లానింగ్ గా2003 2006 ,2011-2015 వరకు మొత్తం ఏడేళ్ళు సేవలు అందించింది.2006లో కొద్దికాలం ఫారిన్ మినిస్టర్ గా సేవచేసి ఆపదవి పొందిన మొట్ట మొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది .1-3-2021న WTO కు ఏడవ గవర్నర్ జనరల్ అయింది .ఆ అత్యున్నత పదవి చేబట్టిన మొదటి మహిళగా ,మొదటి ఆఫ్రికన్ గా గుర్తింపబడిది .ఆమె సేవలు 31-8-2025కు ముగుస్తాయి .గ్లోబల్ ఫైనాన్షి యల్ ఎక్స్పెర్ట్ గా ,ఎకనమిస్ట్ గా ,  ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ప్రొఫెషనల్ గా గుర్తింపు పొంది ,30ఏళ్ళు ఆసియా ఆఫ్రికా యూరప్ లాటిన్ అమెరికా ,నార్త్ అమెరికాలలో పని చేసింది .ఆఫ్రికన్ యూనియన్ స్పెషల్ ఎన్వాయ్ (ప్రతినిధి )గా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటానికి విశేష కృషి చేసింది .అనేక రాయబారాలలో ,ఇచ్చి పుచ్చుకోవటాలలో గొప్ప చొరవ చూపింది . She is a firm believer in the power of trade to lift developing countries out of poverty and assist them to achieve robust economic growth and sustainable development. As Finance Minister, she was involved in trade negotiations with other West African countries and contributed to the overhaul of Nigeria’s trade policy enabling it to enhance its competitiveness.

 వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ పదవికి నైజీరియా తరఫున పోటీ చేసిన మొట్ట మొదటి మహిళకూడా ఆమె.  Dr Okonjo-Iweala was responsible for leading reform that enhanced transparency of government accounts and strengthened institutions against corruption, including the implementation of the GIFMS (Government Integrated Financial Management System), the IPPMS (Integrated Personnel and Payroll Management System), and the TSA (Treasury Single Accounts).

 ప్రపంచ ప్రసిద్ధ చెందినవందమంది మహిళలో ఒకరుగా ఆమె పేరుపొందింది .మిక్కిలి ప్రభావ శాలి అయిన మహిళగా ,అవినీతిపై పోరాడిన యాభై మంది మహిళలో శిఖరాగ్రాన నిలిచింది .అమెరికన్ అకాడెమి అఫ్ అచీవ్ మెంట్ ఆమెకు ‘’గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ‘’ను 2022లో అందజేసింది .ఇలాంటి అవార్డ్ లు కోకొల్లలుగా ఆమె ప్రతిభా సామర్ధ్యాలకు దక్కాయి .నల్లజాతి మరో వజ్రం నకోజి ఒక౦జొ ఇవేలా.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-23-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.