మలబార్ రెబిలియన్ నాయకడు –ఆలి ముసలియార్
1861-1922 మధ్య జీవించిన ఆలి ముసలియార్ కేరళ మలబార్ రెబెలియన్ నాయకుడు ,స్వాతంత్ర్య సమరయోధుడు .1907 నుంచి తిరునంగాడి మసీదు కు ఇమాం గా ఉన్నాడు .బ్రిటీష ప్రభుత్వం పై ఎదురుతిరిగినందున అరెస్ట్ అయి ఉరి తీయబడ్ వరకు ఇమాం గా ఉన్నాడు .మలబార్ ఖిలాఫత్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నాడు .
మలబార్ ఎరనాడ్ తాలూకా నెల్లికున్నట్టు దేశం లో పుట్టాడు .తండ్రి కున్హిమోతిన్ మోల్లా .తల్లి కోటక్కై అమ్మ .తల్లి రాడికల్ ఇస్లామిక్ తెగకు చెందింది .ఆలి తాత మూసా మాలప్పురం అమరవీరులలో ఒకరు .ముసలియార్ ఖోరాన్ ,మలయాళం లు క్షుణ్ణంగా నేర్చి ,పొన్ని దేశి లో పై చదువులు పదేళ్లు చదివి ఖురాన్, మత విషయాలలో నిష్ణాతుడయ్యాడు .
ఆతర్వాత మక్కాలో హరాం లో ఉన్నత విద్య నేర్చాడు .జీవితకాలమంతా అనేకమంది ముస్లిం విద్యా వేత్తల నుంచి శిక్షణ పొందాడు .ఏడు ఏళ్లు మక్కాలో గడిపి ,లక్షదీవులలోని కవరాట్టి లో ముఖ్య కాజి అయ్యాడు .1907లో కేరళలోని తిరునంగాడి మసీదుకు చీఫ్ అయ్యాడు .తర్వాత ఖాలిఫత్ అనే ఖిలాఫత్ ఉద్యమ నాయకుడై,22-8-1921లో జమాత్ మసీదు కు ఖాలిఫ్ అమీర్ అయ్యాడు .జియా టాక్సెస్ అన్నిటిని ఖిలాఫత్ ముస్లిం ప్రభుత్వానికి చేరేట్లు చర్యలు చేబట్టాడు .
ప్రజానాయకుడిగా గుర్తింపు పొంది ,ఇస్లామిక్ ఖలిపత్ మీటింగులు భారీగా నిర్వహించాడు .జీహాద్ ను వ్యాప్తి చేశాడు .భారత దేశ స్వాతంత్ర్యం త్వరలోనే వస్తుందని ,కనుక జీహాద్ ను బలపరుస్తూ కాలనీ ప్రభుత్వాన్ని వ్యత్రేకించమని తీవ్ర ప్రచారం చేశాడు .ఖలీఫత్ వాలంటీర్లను జీహాద్ కోసం శిక్షణ ఇప్పించాడు .ఈ పవిత్ర మత యుద్ధం లో వారంతా ప్రాణాలు త్యజించటానికి సిద్ధం కావాలని బోధించాడు .యూని ఫారం లో ,ఆయుధాలతో వారంతా స్థానికంగా పెరేడ్ చేసేట్లు పురిగొల్పాడు.తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా దాన్ని తీర్చి దిద్దాడు .ఖలీఫాత్ యూనిఫారం కత్తులు ,ఎర్ర జెండాలతో ఆ సైన్యం ‘’అల్లాహో అక్బర్ ‘’అంటూ నినదించింది .వీధులలో పోలీసులను వెంబడించారు .తర్వాత వీరికి ఇతరులకు భేదాలేర్పడటంతో, స్థానికపాలన నిర్వహించటం కష్టం కావటంతో పోలీసులు దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారు .
1921-22 మధ్య జరిగిన ఈ తిరుగుబాటు ఆలిముసలియార్ మొదలైన ముస్లిం నాయకుల అరెస్ట్ తొ మోప్లా లో బ్రిటీష వారు మోప్పురం మసీదును నాశనం చేశారనే పుకారుతో మోప్లా జీహాదీ గ్రూపులు 15వేలనుంచి 30వేలదాకా రోడ్లపైకి రావటంతో కాలనీ సైనికులు అనేకులు చంపబడ్డారు .హిందూ కుటుంబాల ఆస్తికి ,స్త్రీల రక్షణకు దిక్కులేకుండా పోయింది .దక్షిణ మలబార్ లోని ప్రభుత్వ కార్యాలయాలు రైలు బ్రిడ్జిలకు ,రహదార్లకు తీవ్ర నష్టం కలిగింది .ప్రభుత్వం వెంటనే మేల్కొని తిరుగుబాటు దారులను అణచి వేయటంలో విజయం సాధించగా వాళ్ళు గెరిల్లా యుద్ధాలు చేస్తూ భయపెట్టగా, అదనపు బలగాన్ని సంపాదించి కాలనీ ప్రభుత్వం వీధుల్లో కవాతు నిర్వహిస్తూ వారికి సింహస్వప్నం గా నిలిచింది .క్రమంగా 1922 ఫిబ్రవరికి తిరుగుబాటు అంతమొందింది .ఆలి ముసలియార్ తోపాటు ఒక డజన్ మంది జీహాద్ నాయకులను అరెస్ట్ చేసి విచారించి ప్రభుత్వం మరణశిక్ష విధించింది . .ఆలి ముసలియార్ ను కోయమబత్తూరు జైలులో 17-2-1922 న ఉరి తీశారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-23-ఉయ్యూరు