1vuయోధుడు ,పండితుడు ,మోప్లా శాంతి స్థాపకుడు ,’’అల్ అమీన్ ‘’పత్రికా సంపాదకుడు,భారత్ విభజనకు వ్యతిరేకి –మహమ్మద్ అబ్దుల్ రహీం
మహమ్మద్ అబ్దుర్ రహిమాన్ సాహిబ్ (1898 – 23 ఏప్రిల్ 1945) ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు , ముస్లిం నాయకుడు, [1] పండితుడు, [2] మరియు కేరళకు చెందిన రాజకీయ నాయకుడు . [3] [4] [5] అతను 1939లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (మలబార్) అధ్యక్షుడిగా పనిచేశాడు .
ప్రారంభ జీవితం మరియు విద్య
సాహిబ్ భారతదేశంలోని కొచ్చిన్ రాజ్యంలో 1898 లో త్రిసూర్ జిల్లా కొడంగల్లూర్‌లోని అజికోడ్‌లో జన్మించాడు . అతను వెనియంబాడి మరియు కాలికట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు . అతను మద్రాసు మరియు అలీఘర్‌లలో కళాశాలలో చదివాడు, కాని మలబార్‌లో సహాయ నిరాకరణ ఉద్యమం మరియు ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడానికి అలీఘర్ విశ్వవిద్యాలయంలో తన చదువును నిలిపివేశాడు . [6]
పోరాటాలు మరియు జైలు శిక్షలు
1921 నాటి మోప్లా అల్లర్లను అనుసరించి, సాహిబ్ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి కృషి చేశాడు, అయితే బ్రిటీష్ అధికారులు 1921 అక్టోబర్‌లో అరెస్టు చేసి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహంలో అతను కాలికట్ బీచ్‌లో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు పాల్గొన్నందుకు , అతనిపై లాఠీచార్జి మరియు తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది మరియు కన్నూర్ సెంట్రల్ జైలులో ఉంచబడింది. [7]
ఎడిటర్
మహ్మద్ అబ్దుర్ రహిమాన్ మలయాళ దినపత్రిక అల్ అమీన్ [8] కి సంపాదకుడు మరియు ప్రచురణకర్త, ఇది 1924-1939 సమయంలో కాలికట్ నుండి ప్రచురించబడింది . మలబార్ ముస్లింలలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేయడం మరియు జాతీయవాదాన్ని పెంపొందించడం ఈ పత్రిక లక్ష్యం. అయితే సమాజంలోని సంప్రదాయవాదులు అతని ప్రగతిశీల అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ, దాని ప్రచురణకు పదేపదే అంతరాయం కలిగించడానికి వలస అధికారులతో కుట్ర పన్నారు. చివరకు 1939లో బ్రిటిష్ అధికారులు ఈ పత్రికను మూసివేశారు. ఒక స్థానిక పురాణం ప్రకారం, అతని యొక్క అనామక ఆరాధకుడు కాగితం మూసివేయబడిన తర్వాత దానిని పునఃప్రారంభించటానికి అతనికి విలువైన ఆభరణాలను అందించాడు, కానీ అతను దానిని తిరస్కరించాడు. [6] [9]
రాజకీయాలు
సాహిబ్ 1931 నుండి 1934 వరకు కాలికట్ మునిసిపల్ కౌన్సిల్ మరియు 1932 నుండి మలబార్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ సభ్యుడు. అతను 1937లో మలప్పురం నియోజకవర్గం నుండి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఎన్నికయ్యాడు. అతను కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడయ్యాడు మరియు సభ్యుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) 1939లో. మహ్మద్ అబ్దుర్ రహిమాన్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్ యొక్క రెండు-దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడూ వ్యతిరేకించేవాడు మరియు అతను కేరళలోని జాతీయవాద ముస్లింల నాయకుడు. [10] [11] అతని చివరి రోజులు సమావేశాలు ఏర్పాటు చేయడం మరియు ముస్లింలలో అవగాహన కల్పించడం కోసం గడిపారుభారతదేశ విభజనకు వ్యతిరేకంగా ఇందుకోసం మలబార్‌లో ముస్లిం లీగ్ పార్టీ నుంచి చాలా నష్టపోయాడు.
రెండవ ప్రపంచ యుద్ధం
అబ్దుర్ రహిమాన్ సాహిబ్ 1940 నుండి 1945 వరకు బ్రిటిష్ రాజ్ చేత జైలులో ఉన్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కాలికట్‌కు తిరిగి వచ్చి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. అతను 23 నవంబర్ 1945న 47 సంవత్సరాల వయసులో చెన్నమంగల్లూరు సమీపంలోని పొట్టశేరి గ్రామంలో (ప్రస్తుత కోజికోడ్ జిల్లాలో ) కొడియాత్తూరులో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత మరణించాడు [6] అతను తీవ్రమైన గుండెపోటుతో మరణించాడని వైద్య రికార్డులు చెబుతున్నాయి , అయితే ఇంకా కొంతమంది అతను విషం తాగాడని నమ్ముతారు. కేరళ ప్రభుత్వం ఎరియాడ్‌లోని సాహిబ్ ఇంటిని నస్రుల్ ఇస్లామ్‌గా రక్షించడానికి స్వాధీనం చేసుకుంది .
2-కేరళ తోలి యూదు న్యాయవాది ,కొచ్చిన్ సంస్థాన శాసన మండలి సభ్యుడు ,’’యూదు గాంధీ ‘’-అబ్రహాం బరాక్ సేలం
అబ్రహం బరాక్ సేలం (1882-1967) ఒక భారతీయ జాతీయవాది, జియోనిస్ట్, న్యాయవాది, రాజకీయవేత్త. ఇరవయ్యవ శతాబ్దంలో కొచ్చిన్ కు చెందిన యూదు ప్రముఖులలో ఒకరు. మేషుచ్రారిమ్ వారసుడు. కొచ్చిన్ యూదుల్లో న్యాయవాది అయిన తొట్టతొలి వ్యక్తి. అతను ఎర్నాకుళంలో ప్రాక్టీస్ చేసాడు. చివరికి అతను తన ప్రజలపై యూదుల పట్ల చూపుతున్న వివక్షపై అతడు సత్యాగ్రహ పద్ధతిలో పోరాడాడు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో, భారతీయ జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, తరువాత అతను జియోనిజం వైపు ఆకర్షితుడయ్యాడు. 1930 వ దశకంలో పాలస్తీనాను సందర్శించిన తరువాత, 1955 నాటికి చాలా మంది కొచ్చిన్ యూదులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్ళేందుకు తోడ్పడ్డాడు. తాను మాత్రం శేష జీవితమంతా కొచ్చి లోనే గడిపాడు.
తొలి జీవితం
సేలం 1882 లో కొచ్చిన్ ( కొచ్చిన్ రాజ్యం ) లో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. కొచ్చి అప్పుడు బ్రిటిష్ భారతదేశంలో ఒక సంస్థానంగా ఉండేది. అతని కుటుంబాన్ని మేషుచ్రారిమ్‌గా పరిగణిస్తారు. యజమానులే స్వచ్ఛందంగా విడుదల చేసిన బానిసలని ఆ హీబ్రూ పదానికి అర్థం. కొన్నిసార్లు తటస్థంగా వాడినప్పటికీ, కొన్నిసార్లు అవమానకరమైన ఉద్దేశ్యంతో వినియోగిస్తారు. స్పెయిన్ నుండి యూదులు బహిష్కరించబడిన తరువాత 16 వ శతాబ్దం నుండి ఈ పరదేశి [విదేశీ] యూదులు కొచ్చిన్ వచ్చారు. మెషుచ్రారిమ్ లంటూ కొచ్చి యూదు సమాజంలో వారిపై వివక్ష చూపారు. కొచ్చిన్ లోని పరదేశి సినగాగ్‌లో (యూదు దేవాలయం) వారిని తక్కువ స్థాయి వ్యక్తులుగా చూసారు. వారి మధ్య సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఈ పరదేశి (“శ్వేత జాతి”), యూదులు, స్థానిక మలబారి యూదులు శతాబ్దాలుగా తమ మధ్య గల జాతి భేదాలను కొనసాగించాయి. ఇవి చారిత్రికంగా శరీరపు రంగులో గల తేడాతో ముడిపడి ఉన్నాయి.
తల్లి సంరక్షణలో పెరిగిన సేలం, ఎర్నాకుళంలోని మహారాజా కళాశాలలో చదివాడు. చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ సంపాదించాడు. అతడు, మేషుచ్రారిమ్‌లలో మొట్ట మొదటి యూనివర్సిటీ గ్రాడ్యుయేటు. [1] చెన్నైలో ఉన్నప్పుడే న్యాయశాస్త్ర పట్టా కూడా సంపాదించాడు. కొచ్చిన్ యూదుల్లో అతడు మొట్ట మొదటి న్యాయవాది. [2] అతను ఎర్నాకుళంలోని కొచ్చిన్ చీఫ్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసాడు.
క్రియాశీలత
మలబారి యూదులకు ఏడు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి; శ్వేతజాతి యూదులకు పరదేసి సినగాగ్ అనే ఒక సినగాగ్ ఉంది. అపవిత్రులని భావించే వారికి అందులో నిషేధం ఉంది. సమకాలీన చరిత్రకారుడు ఎడ్నా ఫెర్నాండెజ్ దీనిని “శ్వేత స్వచ్ఛతకు కంచుకోట” అని అన్నాడు. [3] శ్వేత జాతి యూదులు తమ సామాజిక సమూహం లోని వ్యక్తులనే పెళ్ళి (ఎండోగామస్ ) చేసుకునేవారు. వాళ్ళు మెషుచర్రిం లను, మలబారీ యూదులనూ చేసుకునేవారు కాదు. మలబారీ యూదులు కూడా ఇలాగే ఇతర సమూహాల వక్తులను పెళ్ళి చేసుకునేవారు కాదు. మేషుచ్రారిమ్‌లు సినగాగ్ వెనుక గాని, బయట గానీ కూర్చోవలసి వచ్చేది. ఇది, ఆ కాలంలో దిగువ కులాల పట్ల భారతీయ వివక్షను పోలి ఉండేది. ఇదే వివక్ష కొన్నిసార్లు భారతదేశంలోని క్రైస్తవ చర్చిలలో కూడా ఉండేది.
సేలం కొంతకాలం పాటు సినగాగ్‌ను బహిష్కరించి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అతను సత్యాగ్రహాన్ని (లేదా అహింసాత్మక నిరసన) సమాజంలోని వివక్షను ఎదుర్కోవడానికి సాధనంగా ఉపయోగించాడు. ఈ కారణంగా కొంతమంది అతడిని “యూదు గాంధీ ” అని అన్నారు. [4] 1930 ల మధ్య నాటికి, పాత నిషేధాలు చాలావరకు అంతరించాయని మాండెల్‌బామ్ రాసాడు. ఇది భారతీయ సమాజంలో వస్తున్న విస్తృతమైన మార్పులను ప్రతిబింబిస్తుంది. [5]
సేలం 1925 నుండి 1931 వరకూ, మళ్లీ 1939 నుండి 1945 వరకూ కొచ్చిన్ సంస్థానంలో శాసన మండలిలో పనిచేశారు. కేరళలో ప్రారంభమైన కార్మిక సంఘ ఉద్యమానికి అతడు మద్దతుగా నిలిచాడు. అతడు చురుకైన భారతీయ జాతీయవాది, 1929 చివరలో అతను భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సెషన్‌కు హాజరయ్యాడు. బ్రిటిషు వారి నుండి పూర్తి స్వాతంత్ర్యం సాధించాలని ఆ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. [2]
1933 లో పాలస్తీనాను సందర్శించిన తర్వాత, సేలం జియోనిస్ట్ వాదానికి ఆకర్షితుడయ్యాడు. భారత స్వాతంత్ర్యం తరువాత, అతను కొచ్చిన్ యూదులలో ఇజ్రాయెల్‌కు వలస పోవడాన్ని (అలియా) ప్రోత్సహించాడు. 1953 లో అతను, వలస వెళ్లాలనుకునే భారతీయ యూదుల తరపున చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ సందర్శించాడు. ఇది కొచ్చిన్ యూదుల మధ్య విభేదాలను తగ్గించడానికి కూడా సహాయపడింది. [6] వలస వెళ్ళిన తర్వాత వారందరూ ఇజ్రాయెల్‌లో విదేశీయులుగా పరిగణించబడ్డారు. అక్కడి సమాజంలో కలిసిపోవడానికి అనేకమంది ఇబ్బంది పడ్డారు.
1955 నాటికి కొచ్చిన్ లోని పురాతన యూదు సమాజంలో ఎక్కువమంది ఇజ్రాయెల్‌కు వెళ్లినప్పటికీ (తెల్లజాతి యూదుల్లో అనేక మంది ఉత్తర అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళారు), సేలం మాత్రం 1967 లో మరణించే వరకు కొచ్చిన్‌లోనే నివసించాడు. అతడిని కొచ్చిన్‌లోని జ్యూ టౌన్‌లోని శ్వేతజాతి యూదుల స్మశానవాటికలో ఖననం చేశారు.
గౌరవాలు
· కొచ్చిలోని శ్వేత యూదుల శ్మశానవాటిక పక్కనే ఉన్న రహదారికి సేలం పేరు పెట్టారు. [2]
· మేషుచ్రారిమ్‌లపై వివక్షకు వ్యతిరేకంగా సేలం జరిపిన పోరాటంపై నాథన్ కట్జ్, ఎల్లెన్ గోల్డ్‌బెర్గ్ లు “జెవిష్ అపార్థైడ్ అండ్ ఎ జెవిష్ గాంధీ” పేరిట పుస్తకం రాసారు. [7]
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-23-ఉయ్యూరు
—