కేరళలో అనేక సత్యాగ్రహాలు నిర్వహించి మాతృభూమి, లోకమాన్య పత్రికల స్థాపనకు సహకరించిన స్వాతంత్ర్య సమర యోధుడు –కరూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్
కురూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ శిష్యుడు. అతను క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం , గురువాయూర్ సత్యాగ్రహం, వైకోం సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నాడు.
రాజకీయ జీవితం
కురూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్ 1896లో త్రిసూర్ జిల్లాలోని అదాత్ కురుర్ మనలో జన్మించాడు. కొచ్చిన్ రాజ్యం , త్రిసూర్ జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసిన మొదటి కొద్దిమంది నాయకులలో అతను ఒకడు. 1920లో కోళికోడ్ లో మహాత్మా గాంధీనికలిసి భారత స్వాతంత్ర్యోద్యమం లో చేరడానికి అనుమతి కోరాడు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మొదటిసారి త్రిసూర్ వచ్చినప్పుడు కురూర్ ఆతిథ్యం ఇచాడు.
త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1922-32) , కేరళ ఖాదీ బోర్డు కార్యదర్శి. కురూర్ మాతృభూమి దినపత్రిక వ్యవస్థాపకుల్లో ఒకడు. 1959 ఆగష్టు 15న కురూర్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎరావక్కాడ్ లో ఒక బృందం దాడి చేసింది. పౌరులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కన్నూర్ లోని సెంట్రల్ జైలులో జరిగిన లాఠీఛార్జ్ లో కురూర్ కుడి చెవిని కోల్పోయాడు. [3]
లోకమానయన్
పి.డబ్ల్యు.సెబాస్టియన్ తో నంబూద్రిపాద్ భారత స్వాతంత్ర్యోద్యమానికి మరింత చైతన్యాన్ని కలిగించడానికి త్రిసూర్ నగరంలో లోకమానయన్ వార్తా ప్రారంభించింది.దాని ఎడిటర్-ఇన్-చీఫ్ గా నంబూద్రిపాడ్ ప్రింటర్, ప్రచురణకర్తగా సెబాస్టియన్ పనిచేసారు. .2-త్యాగశీలతకు ‘’తుమ్హారా త్యాగ్ తుమ్హారా భూషణ్ హోగా ‘’అంటూ గాంధీ ప్రశంసలు పొందిన కేరళ స్వాతంత్ర్య సమరయోధురాలు –కౌముది టీచర్
ముది టీచర్ (1917 జూలై 16, వయక్కర – 2009 ఆగస్టు 4) గాంధేయవాది, కేరళలోని కన్నూర్కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. 1934 జనవరి 14న మహాత్మా గాంధీ కేరళ రాష్ట్రం లోని వయక్కరకు వచ్చినప్పుడు అతని పిలుపు మేరకు తన ఆభరణాలను స్వచ్ఛందంగా స్వాతంత్ర్యోద్యమం కోసం విరాళంగా యిచ్చింది. మహాత్మా గాంధీ ఆమె త్యాగాన్ని గుర్తించి యంగ్ ఇండియాలో “కౌముది పరిత్యాగం” అనే వ్యాసం రాసాడు. ఆమె 2009 ఆగస్టు 4న మరణించింది.[1]
ప్రారంభ జీవితం
కౌముది టీచర్, స్వాతంత్ర్య పోరాటం కోసం 1934 లో మహాత్మాగాంధీకి తన బంగారు ఆభరణాలను త్యజించిన స్వచ్ఛందమైన గాంధేయవాది .
కౌముది 1917 మే 17న వటక్కర లోని రాజకుటుంబానికి చెందిన ఎ.కె.రామార్మ రాజా, దేవకీ కెట్టిలమ్మ లకు జన్మించింది.[2] ఆమె తరువాత భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. 1934 లో హరిజనుల కోసం ఆమె తన ఆభారణాలు త్యజించిన తర్వాత ఆభరణాలు ధరించనని ప్రతిజ్ఞ చేసింది.
జీవిత విశేషాలు
మెట్రిక్యులేషన్ తర్వాత, ఆమె హిందీని అభ్యసించి మలబార్ జిల్లా లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి హిందీ టీచర్‌గా నియమితులరాలైంది. ఆమె వినోభా భావే శిష్యురాలిగా భూధాన్ ఉద్యమంతో కూడా సంబంధం కలిగి ఉంది.
ఆమె 1972 లో హిందీ ఉపాధ్యాయినిగా ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందింది. తరువాత ఆమె తిరువనంతపురంలోని వినోభా భావే ఆశ్రమంలో పనిచేసింది. ఆమెకు సేవాగ్రామ్, పౌనార్ ఆశ్రమాలను తరచుగా సందర్శించేది.[3] తరువాత ఆమె ఖాదీ ప్రచారానికి, హిందీ బోధించడానికి తన కాలాన్ని వినియోగించింది. ఆమె ఆభరణాలు ధరించకూడదని నిర్ణయించుకుంది.[2] కౌముది టీచర్ యొక్క వీరోచిత త్యాగం పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చబడింది. ఆమె అవివాహితురాలిగా ఉండిపోయింది. ఆమెను వివిధ గాంధేయ సంస్థలు సత్కరించాయి.
కౌముది పరిత్యాగం
హరిజన సహాయ సమితి నిధుల సేకరణకు సంబంధించి గాంధీ 1934 జనవరి 14 న వటకర సందర్శనలో ఉన్నారు. విరాళం కోసం గాంధీ చేసిన విజ్ఞప్తికి సమాధానమిస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కౌముది టీచర్ తన బంగారు ఆభరణాలను అతనికి ఇచ్చింది. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఆమె త్యాగం, ‘కౌముది పరిత్యాగం, ‘ అనే పేరుతో రాసిన వ్యాసంలో మహాత్మా గాంధీ ఆమె త్యగాన్ని ప్రశంసించాడు. అది యండ్ ఇండియా పత్రికలో ప్రచురించబడింది. తరువాత అది అన్ని భాషలలోకి అనువదించబడింది.[4] తరువాత అది పాఠశాల సిలబస్‌లో భాగం చేయబడింది.
గాంధీ యంగ్ ఇండియా పత్రికలో రాసిన వ్యాసంలో “కౌముది టీచర్ పరిత్యాగం” చేసిన రోజు జరిగిన సంఘటనల గురించి పేర్కొన్నాడు. బడగరలో గాంధీ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత, హరిజన సహాయ నిధికి నిధుల సేకరణ కోసం ఆభరణాలను విరాళంగా ఇవ్వవలసినదిగా సమావేశానికి హాజరైన మహిళలకు హేతుబద్ధమైన విజ్ఞప్తి చేశాడు. ప్రసంగం తరువాత కౌముది తన చేతికి ఉన్న ఒక బంగరు గాజును తీసి గాంధీకి ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగింది. అతను ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి సిద్ధమౌతున్నప్పుడు ఆమె మరొక బంగారు గాజు తీసింది. ఇప్పుడు ఆమె రెండు చేతులలో రెండు గాజులు ఉన్నాయి. దీనిని చూసిన గాంధీ, “మీరు నాకు రెండూ ఇవ్వనవసరం లేదు, నేను మీకు ఒక గాజు కోసం మాత్రమే ఆటోగ్రాఫ్ ఇస్తాను” అని చెప్పాడు. ఆమె తన బంగారు నెక్లెస్‌ని తీసివేయడం ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చింది, ఆమె తన పొడవాటి జుట్టులో చిక్కుకున్న నక్లెస్ ను వేరుచేయడానికి కష్టపడుతూ దానిని తీసి అందించింది. ఆ సంభలో పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పుడు ఆమె అలా చేసింది. ఆభరణాలను దానం చేయడానికి తన తల్లిదండ్రుల అనుమతి ఉందా అని గాంధీ అడిగినప్పుడు, ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె చెవిపోగులు కూడా ఇవ్వడంతో ముందుకు సాగింది. ఆమె తండ్రి కూడా ఆమెలాగే ఉదారంగా ఉంటారని, వాస్తవానికి అతను కూడా సమావేశంలో పాల్గొన్నాడనీ, గాంధీ వేలం వేసే పిలుపు మేరకు వేలం వేయడంలో కూడా సాయం చేస్తున్నాడని గాంధీ తరువాత పేర్కొన్నాడు. గాంధీ ఆమె కోసం “తుమ్హారా త్యాగ్ తుమ్హార భూషణ హోగా” అని రాస్తూ ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.[5] అతను ఆమెకు ఆటోగ్రాఫ్‌ని అందజేయడంతో, “మీరు విస్మరించిన ఆభరణాల కంటే మీ పరిత్యాగం నిజమైన ఆభరణం” అనే వ్యాఖ్యను రాసాడు.[4]
మరణం, వారసత్వం
కౌముది టీచర్ ఆరోగ్యం సరిగా లేనందున 92 సంవత్సరాల వయసులో 2009 ఆగస్టు 4 న కన్నూర్‌లో మరణించింది. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో పోరాడిన ఆమె కడచిరాలోని తన సోదరుడి నివాసంలో మరణించింది.[1] అంత్యక్రియల రోజున, ఆమెకు నివాళులు అర్పించడానికి చాలా మంది వచ్చారు. 92 ఏళ్ల గాంధేయవాది మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లే ముందు పోలీసు సిబ్బంది కూడా తుపాకీ వందనం చేశారు. వేడుకను గమనించినప్పుడు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుధీర్ బాబు కూడా ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ తరపున పుష్పగుచ్ఛం ఉంచాడు.[6]
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-23-ఉయ్యూరు