క్విట్ ఇండియా ఉద్యమనాయకురాలు ,శతాయుస్సుతో జీవించిన గాంధీ శిష్యురాలు, కేరళ జాతి రత్నం –అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ
కేరళలో అనక్కర వడక్కత్ తరవాడు కుటుంబంలో చివరి సభ్యురాలు అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ1921లో జన్మించింది .మద్రాస్ లో చదువుతుండగానే క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్న దేశ భక్తురాలు .1943 ఫిబ్రవరిలో అరెస్ట్ అయి ,వెల్లూరు స్త్రీల కారాగారం లో జైలు శిక్ష అనుభవించింది .మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రభావితురాలై ,కాంగ్రెస్ లో చేరి ,కాంగ్రెస్ మహిళా విభాగం కు జాతీయ సెక్రేటరిగా పని చేసింది .రోజూ ఖాదీ వడికి ఆదర్శప్రాయమైంది స్వాతంత్ర్యానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నది .అనక్కార వడక్కత్ ఫామిలి కి చెందిన ప్రసిద్ధ మహిళలో స్వాతంత్ర సమరయోధులు అమ్ము స్వామినాధన్ ,ఏ.వి కుట్టిమలు అమ్మ ,కెప్టెన్ లక్ష్మి ,ప్రముఖ నాట్య కళాకారిణి మృణాలిని సారాబాయి ఉన్నారు .స్వాతంత్ర్య సమర యోధులకిచ్చే తన పెన్షన్ ను అట్టడుగు ప్రజల సంక్షేమానికి అందించేది .చాలాకాలం కల్లదత్తూర్ లోని చిన్మయా స్కూల్ కు సేక్రేటరిగా ఉన్నది .
సుశీలమ్మ భర్త కుంజి కృష్ణన్ కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడే . ఈ దంపతులకు ఇందు ధరన్ కుమారుడు .నందిత కుమార్తె . చివరికాలం లో దాదాపు 8ఏళ్ళు అనారోగ్యంతో మంచం పైనే ఉండి పోయింది సుశీలమ్మ .22-9-2021 న శతాయుష్షు పూర్తయి సుశీలమ్మ మరణించింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-23-ఉయ్యూరు