Category Archives: సమీక్ష

రాంగేయ రాఘవ -1

రాంగేయ రాఘవ -1 రాంగేయ రాఘవ -1 అనే పుస్తకాన్ని హిందీలో మధురేశ్ రాస్తే ,తెలుగు అనువాదం జ్వాలాముఖి చేస్తే ,సాహిత్య అకాడెమి 1998లో ప్రచురించింది. వెల-25రూపాయలు .  ముందుమాటలలో జ్వాలాముఖి చెప్పిన ముఖ్య విషయాలు .’’నలభైఏళ్లు కూడా జీవించని రాఘవ పాతికేళ్ళు రచనా వ్యాసంగం లో గడిపాడు .సాహిత్య వ్యాసంగానికి అడ్డు వస్తుందని వివాహం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఆత్మ లింగ శతకం

ఆత్మ లింగ శతకం‘’శ్రీ మదనంత సనాతన అచల బోధ సిద్ధాంత సద్గురు దత్తాత్రేయ పర౦ప రాచార్యులైన ఆకుల గురు మూర్తి యోగీంద్ర విరచిత ‘’ఆత్మ లింగ శతకం విజయనగర రామానుజ ముద్రాక్షర శాల లో ముద్రింపబడింది .125పద్యాల ఈశతకం ఎప్పుడు ముద్రి౦పబడిందో ,వెల ఎంతో తెలియదు .కవి గారి విశేషాలు లేవు..’’అఖిల జీవన సంగ ఆత్మలింగ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )పంజే రాసిన సముదాయం లో 14గద్యరచనలు ,కధలు ఉన్నాయి .పురాణ శ్రవణ స్వాతిశయం ,ఒక వైద్యుడు వైద్యం కోసం గ్రామాలకు వెళ్లి అందమైన వంటలక్క ను ఏర్పాటు చేయమని అడగటం అది బెడిసికొట్టటం .మోటుహాస్యం తోకూడా రాశాడు .భార్యపై అనుమాన పడ్డ భర్త కనువిప్పు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు1929ను౦చి సాహిత్యకారులు పంజే ను కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడుగా ఉండమని కోరుతూనే ఉన్నారు .చాలాకాలం ఒప్పుకోలేదు చివరకు మంగుళూరు వెళ్లి బ్రతిమాలి ఒప్పించారు .పాత హైదరాబాద్ రాష్ట్రం లోని రాయచూర్ లో జరిగిన సమావేశానికి ఆయన చేసిన అధ్యక్షోపన్యాసం అందర్నీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3

. కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3పాఠశాల పర్యవేక్షణాధికారిఉపసహాయ పర్యవేక్షణాధికారిగా పంజే ను దక్షిణ కన్నడ కాసర గోడ్ లో నియమించారు .ప్రస్తుతం ఇది కేరళ లో ఉంది .మూడు R లు బోధించటం లో దిట్ట కనుక ఈ పదవి దక్కింది .మంచి ఇంట్లో కాపురం పెట్టాడు .ఇన్స్పెక్టర్ ఆఫ్ … Continue reading

Posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2విద్యాభ్యాసంబంట్వాల్ పట్టణలక్షణాలన్నీ ఉన్న పల్లె ప్రాంతం .అక్కడి సుమారు 40సారస్వత బ్రాహ్మణ కుటుంబాలలో పంజే కుటుంబం ముఖ్యమైంది .రామప్పయ్యగారి పిల్లలు దైవభక్తీ సరస సౌజన్యాలకు పేరుపొందారు .పెద్దన్న కృష్ణారావు అభిప్రాయాలు,అలవాట్లలో గంభీరుడు .మంగేష్ రెండవ వాడు .తమ్ముళ్ళు శివరావు ,శ్రీనివాసరావు ,రాఘవేంద్ర ,తండ్రి చనిపోయేనాటికి పసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1 వి సీతారామయ్య కన్నడ రచనకు డా.ఆర్వీ ఎస్ సుందరం తెలుగు అనువాదం ‘’పంజేమంజేష్ రావు ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు . పంజే మంగేష్ రావు పుట్టిన దక్షిణ కన్నడ జిల్లా మద్రాస్ ప్రావిన్స్ లో ఉండేది .పాలన మైసూర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకంఅనే శతకాన్ని తాడిపత్రి  వాస్తవ్యులు శ్రీ యమ చిడంబరయ్య  రచించి కడపలోని తమ భాగాధేయుడు కావ్య పురాణ తీర్ధ,విద్వాన్  శ్రీ జనమంచి వెంకట సుబ్రహ్మణ్య గారి చే పరిష్కరింప జేసుకొని 1934లో ముద్రించారు .మకుటం రంగ నాయకా . ,ఉత్పలమాల లతో అల్లిన భక్తీ శతకం .ఘటికా సిద్దుడైన శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం )

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం ) 1892లో ప్రభుత్వం తిరునల్వేలి సబ్ జడ్జిగా చందు మీనన్ ని నియమించింది .అప్పుడే ‘’శారద ‘’నవల రాయటం మొదలుపెట్టి ,1893లో పదవిలో స్థిరపడి ,మంగులూర్ కుబదిలీ అయి ,అక్కడ పక్షవాతం రావటం తో సెలవుపెట్టి ,ఆరోగ్యం కుదుటపడ్డాక ఉద్యోగం లో చేరి ,1896లో కాలికట్ కు ట్రాన్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1చందు మీనన్ అనే పుస్తకాన్ని మలయాళం లో టిసి.శంకర మీనన్ రాస్తే తెలుగులోకి కేకే రంగానాథాచార్యులు అనువదిస్తే కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది .వెల-రూ2-50.మళయాళ సాహిత్య నూత్న పద నిర్దేశకుడు చందు మీనన్ .అత్యధిక విద్యాధికులున్న కేరళరాష్ట్రం లో జన్మించాడు .శతాబ్దాల క్రమ పరిమాణం కల మలయాళభాష 17 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కుక్కుటేశ్వర శతకం

కుక్కుటేశ్వర శతకం పిఠాపురం అనే పాదగయా క్షేత్రం లో వెలసిన శ్రీ కుక్కుటేశ్వరస్వామిపై శ్రీ వక్క లంక శ్రీనివాసు కవి శతకం రాశారు .స్వామి కోరి రాయించి అంకితమివ్వమని కలలో చెబితే కవిగారు నెరవేర్చారు ..’’కువలయానందకర శర్వ కుక్కుటేశ ‘’అనేదిమకుటం .స్వభాను సంవత్సర చైత్ర శుద్ధ శుద్ధ అష్టమి కి శతకం పూర్తీ చేసి అంకితమిచ్చాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోపబందుదాస్ -9(చివరిభాగం )

గోపబందుదాస్ -9(చివరిభాగం )‘’దేశం యొక్క మూలస్వరూపాన్ని అంతా ఒరిస్సాలోనే చూశాను ‘’అన్నాడు ఆనాడు గాంధీ వచ్చి చూసి .సమాజ్ పత్రిక సంపాదకుడిగా తనబాధ్యత ఏమిటో గోపబందు తెలియజేశాడు .రచయితరాసిన్దంతా ప్రచురించటం సాధ్యంకాకపోవచ్చు .సందర్భోచితం సముచితమైనవాటినే ప్రచురించాలి .దాస్ పై వేసిన దావా వీగిపోయింది .భద్రతా డిపాజిట్ కింద రెండు వేలు కట్టమన్న నోటీస్ ఆయనకు అందలేదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోపబందుదాస్ -8

గోపబందుదాస్ -8 గాంధీతో కలిసి ప్రతిజిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ,..సమాజ్ ‘’వారపత్రిక స్థాపించి సమాచారం అందిస్తూ ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని  విస్తృతంగా ప్రచారం చేశాడు గోపబంధు దాస్ .ఠానా కేంద్రం నుంచి పైస్థాయి వరకు కమిటీలు ఏర్పడ్డాయి ప్రజోత్సాహం విపరీతంగా ఉంది .అప్పుడే ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది .జలియన్ వాలాబాగ్ దారుణాలపై నిరసన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోపబందుదాస్ -7

గోపబందుదాస్ -7 ఉప్పు తయారీ సముద్రతీర రాష్ట్రం ఒరిస్సాలో గంజాం ,పూరీ ,కటక్ ,బాలాసూర్ జిల్లాలు బంగాళాఖాతం అంచున ఉన్నాయి .ఈప్రాంతప్రజలు హాయిగా ఉప్పు తయారు చేసుకొనేవారు .ఈస్ట్ ఇండియా కంపెని అధికారం లోకి వచ్చాక ఎక్సైజ్ సుంకం విధించి ఉప్పు తయారీకి ప్రభుత్వ అనుమతి కావాల్సివచ్చి ఆప్రాంతజనుల దరిద్రానికి దారితీసింది .అందరు వాడే ఉప్పు … Continue reading

Posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష | Tagged | Leave a comment

గోపబందుదాస్ -6

గోపబందుదాస్ -6సత్యవాది విద్యావిధానం లో సీనియర్ విద్యార్ధులకు శిక్షణ నిచ్చి జూనియర్ లకు సంస్కృతం నేర్పించేవారు .అందరు కలిసి పంక్తి భోజనం చేసేవారు .నీలకంఠ సార్ మీసం పెంచాడు చాన్దసానికి  వ్యతిరేకంగా ,విరుద్ధంగా .ఆయన్ని బ్రాహ్మణ్యం బహిష్కరిస్తే ‘’నా మీసం ‘’వ్యాసం రాసి ఉత్కళ సాహిత్య పత్రికలో ప్రచురించాడు .దాన్ని ఒరిస్సా భక్తకవి శ్రేష్టుడు రాయ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం )‘’తనగానం ఎంత భయంకర సౌందర్యమో –అంత శ్రావ్యతాధిక్యత వలన మరణించే పక్షి ‘’చిత్రాన్ని కీట్స్ కవితా సంకలనం పై ముద్రించినందుకు మురిసిపోయిన ఇమేజిజం కవయిత్రి అమీ లో వెల్ అన్నమాటలివి .అలాగే అత్యంత భావ స్నిగ్ధ హృదయుడైన కీట్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2పూలు వచ్చే ఏడాదైనా పూస్తాయి దానికోసం కన్నీరు కార్చకు .సజ్జనుడికి సంతోషం కలిగించేది ఇలాంటి వెండి నాసికే అంటాడు కీట్స్ కవి .దేనికైనా సిద్ధమై ,సాధిస్తూ సాధిస్తూ శ్రమిస్తూ ముందుకు వెళ్లాలని నేచర్ పోయేట్ వర్డ్స్ వర్త్ అన్న విలువైనమాట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1  డా.రాచకొండ నరసింహ శర్మ ఎం .డి .గారు 98వ వసంతం లో వెలువరించిన నాల్గవ ఆంగ్లకవితా అనువాద మే ‘’సౌందర్యం లో నడుచు నామె’’.60కవితల కర్పూర పరీమళాన్ని వెదజల్లే ఈ సంపుటిని తమ తల్లిగారు కీ శే.రాచకొండ సీతా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -3

గోప బంధు దాస్ -3 కటక్ కాలేజి జీవితం 1899లో గోపబంధు పూరీ వాన్ షా కాలేజి ఆర్ట్ సబ్జెక్ట్ చదవటానికి చేరాడు .23వ ఏట భార్య కాపురానికి వచ్చింది .తండ్రి చనిపోయాడు .అన్న నారాయణ్ దాస్ ఆస్తి కుటుంబ వ్యవహారాలూ చూశాడు .కాలేజి లెక్చరర్స్ తోకలిసి దాసు మిత్రులు ‘’కర్తవ్య బోధినీ సమితి ‘’స్థాపించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -2

గోప బంధు దాస్ -2 గోప బంధు తండ్రి ముక్తియర్ గా పని చేస్తూ కొంత సంపాదిస్తున్నాడు .పల్లెటూరి బడిలోనేచదువుతున్నాడుదాస్ .అక్షరమాల నేర్వగానే రోజూ జగన్నాధ దాస్ రాసిన ‘’భాగవతం ‘’లో రోజుకొక అధ్యాయం గానం చేసేవాడు .అ భాగవతం హృదయగతమైంది .కొన్ని గీతాలుకూడా రాసేవాడు తండ్రి సంతోషించి అందరికీ చదివి వినిపించేవాడు .ఆ ఊరిలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -1

గోప బంధు దాస్ -1  అనే పుస్తకాన్ని శ్రీ రామ చంద్రదాస్ రచిస్తే శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం  తెలుగు అనువాదం చేయగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా 1976లో ప్రచురించింది వెల.30రూపాయలు .   ‘’ఒరిస్సా రాష్ట్రం లో సముద్ర తీర ప్రాంతం లో గోపబందు దాస్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ముక్తీశ్వర శతకం

ముక్తీశ్వరశతకంశ్రీ ముదిగొండ బసవయ్య శాస్త్రి ,శ్రీ కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళ రావు కలిసి ‘’ముక్తీశ్వర శతకం ‘’రాస్తే ,శ్రీ గరిణే సత్యనారాయణ బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షర శాలలో1916లో ముద్రించారు . ,వెల రెండుఅణాలు .‘’శ్రీ మత్సర్వ జగస్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధమదాద్యరిప్రకార శిక్షా దక్ష సద్రక్షకాభూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జ లోకేశ్వరా –శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · 125’’-ఏమ్మా చిలకమ్మా ‘’ ఫేం-7వేల పాటలు పాడిన విలక్షణ గాయని –స్వర్ణలత

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · 125’’-ఏమ్మా చిలకమ్మా ‘’ ఫేం-7వేల పాటలు పాడిన విలక్షణ గాయని –స్వర్ణలత స్వర్ణలత (1973 – సెప్టెంబరు 12, 2010) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )    సాహితీ కృషి లో ప్రత్యకత మరాటీ నవలా రచయితలలో హరినారాయణ ఆప్టే ప్రధమ ఉత్తమ నవలా రచయిత.7 సంపూర్ణ సాంఘిక  నవలు.3అసంపూర్తి నవలలు  రాశాడు  .సాంఘికాల్లో యాభైఏళ్ళ పూనా సంఘాన్ని చక్కగా చిత్రించాడు .ఇంగ్లీష్ వారి ప్రభావం వలన కలిగిన లోపాలు ,సంఘ పురోభి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5 కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉండగా దానికి అనుబంధంగా పూనాలో రాష్ట్రీయ సమావేశం జరపలనిఆప్టే నిర్ణయించగాఆహ్వాన సంఘాధ్యక్షుడు ఆయనే అయ్యాడు .గోఖలే మరణం దాదాభాయ్ నౌరోజి ,ఫిరోజ్ షా మెహతాలు ఎక్కువ శ్రద్ధ చూపలేదు .హోర్మన్ జీ వాడియా ,బొంబాయి గవర్నర లార్డ్ వెల్లింగ్టన్ లు హాజరయ్యారు ,గాంధీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4 ఆన౦దాశ్రమం కు అతిధులు అన్ని రోజుల్లో అన్ని వేళల్లో వచ్చేవారు .పూనాలో తిలక్ ఇల్లులాగా ఆప్టే ఇల్లు వీరితో నిండిపోయేది .శ్రీ రాం సింగ్ నిబద్ధతకాల కార్యకర్త .జబ్బుపడ్డ వారి వైద్య ఖర్చులు ఆప్టే భరించేవాడు .ప్లేగు వ్యాపించినప్పుడు ఆప్టే చేసిన మానవ సేవ నిరుపమానం .ఆశ్రమానికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3ఆప్టే భార్య భర్త కోరికప్రకారం చదవటం రాయటం నేర్చింది .అమ్మలక్కలు ఆమెను హేళన చేసేవారు .ఆమెను సభలకు సమావేశాలకు తీసుకు వెళ్ళేవాడు .ఆనాడు సనాతన కుటుంబాలలో నిబంధనలు అతి కఠినంగా ఉండేవి .దీనితో బడిలో చేరి చదవాలనే ఆమె కోరిక తీరలేదు .ఆనందాశ్రమం నుంచి వేరుపడి విడిగా కాపురం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-2

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-2  స్కూల్ లో చదువుతూ ఉండగానే హరినారాయణ ఆప్టే ,కాళి దాసభావభూతులను తులనాత్మకంగా పరిశీలించి కాళిదాసు ఘనతను చాటి చెప్పాడు భవభూతి ది కృతక శైలి అన్నాడు .మూల గ్రందాలనుంచి ఎన్నెన్నో ఉదాహరణలు ఇచ్చాడు .అప్పుడే ఆంగ్లకవి లాల్ ఫెలో రాసిన గీతాన్ని జీవితగీతం గా అనువదించాడు .తర్వాత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1 ఎం.ఎ.కరందికర్ రాసిన దాన్ని శ్రీ మొదలి నాగభూషణ శర్మగారు ‘’ హరినారాయణ ఆప్టే ‘’గా తెలుగు అనువాదం చేయగా  నేషనల్ బుక్ ట్రస్ట్ 1973లో ముద్రించినది .వెల-రెండు రూపాయల పావలా . ‘’ మరాఠీ నవలా సాహిత్యం హరి నారాయణ ఆప్టే వల్లనే  సక్రమ మర్గాన నడిచింది.సాహిత్యజీవితపు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం వాకాడు  వాస్తవ్యులు  జూటూరు లక్ష్మీ నరసింహయ్య రచించగా కావలిలోని వాయునందన ప్రెస్ లో 1931లో ప్రచురింపబడింది .వెల బేడ.అంటే రెండు అణాలు .విజ్ఞప్తి లో కవి కూడలి గ్రామ సమీపం లో వేదికాపురి అనే పేరున్న తిన్నెలపూడి గ్రామం లో భక్తీ విద్యా వినయ సౌశీల్య సుహృద్భావ గౌరవాదులున్న శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం

పెదకాకాని మల్లేశ్వర  క్షేత్ర మహాత్మ్యం పెదకాకాని మలేశ్వర  క్షేత్ర మహాత్మ్యం  ను దేశభక్త విజయధ్వజి ,దేశ హిత ప్రబోధక , ఓలేటి సుబ్రహ్మణ్య శర్మ  గారు స్థలపురాణ౦గా రచించగా ,గుంటూరు విజయలక్ష్మీ పవర్ ప్రెస్ లో 1960లో ప్రచురించారు వెల-కేవలం 75నయాపైసలు .తెనాలి   అడ్వోకేట్ ఆవుల గోపాల కృష్ణమూర్తి గారు పరిచయ వాక్యాలు రాస్తూ శర్మగారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7 పార్ధ సారధి గారు భారతి పత్రికలో రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ‘’అవధాని గారూ !నాకో కథ జ్ఞాపకం వస్తోంది .పూర్వం అదే వూరిలో ఏక గర్భ జనిత అన్నా చెల్లెలు పసితనం లో కృష్ణ వరదలో కొట్టుకుపోయారు .వాళ్ళను ఎవరో పెంచి పెద్ద చేశారు .కొన్నేళ్ళకు ఈ అన్నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -5(చివరిభాగం )

చారిత్రకనాటకాలు  జహంగీర్-నూర్జహాన్ ,షహన్షా అక్బర్  రాశాడు నానాలాల్ .చరిత్ర ,సత్యాలనుకవిత్వానికి  సమన్వయపరచటమే లక్ష్యంగా రాశాడు .ఆ ప్రేమ జంటపై గొప్ప సానుభూతి తో రాశాడు .ఈ అపూర్వ రూపకాలు వర్ణ విన్యాసం చిత్రి౦చె తూలికా ప్రయత్నమన్నాడు .మహాపురుషుల ఆత్మావిష్కరణం ,వారు జీవించిన కాల స్వరూపం చిత్రించటం తన లక్ష్యమన్నాడు .టెన్నిసన్ రాసిన ‘’అక్బర్ డ్రీం ‘’,ప్లోరాస్టేల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4  పై గీతాన్ని 1909లో నానాలాల్ రాశాడు .అందులో చివరి మాట ‘’సత్యమేవ జయతే ‘’అనేది భారత దేశ అధికార ముద్ర అంటే సీల్ లో స్థానం పొందింది .   వైయక్తిక గీతాలు    గురువు కాశీరాం దవే ,మిత్రుడు అమృతలాల్ పధియార్,తండ్రి దలపతి రాం ,ఇల్లాలు మానెక్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3 వసంతోత్సవ కావ్యం –ఇది కధనాత్మకకావ్యం .వసంత వర్ణన యదార్ధంగా ప్రతీకాత్మకం గా చేశాడు .టెన్నిసన్ ‘’ఇనోక్ ఆర్డెన్’’స్పూర్తితో  రాసినకావ్యం ,అందులో దుఖం ఉంటె ఇందులో ఆహ్లాద ఉల్లాసాలున్నాయి .’’కొత్త ఆశల్ని చిగురిమ్పజేయటం నవజీవనం ప్రసారం చేయటం ,ఉన్నత ఆదర్శాలాతో మానవుల్ని ప్రభావితం చేయటం కవి లక్ష్యం’’అంటాడు నానాలాల్ .షెల్లీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2 నానాలాల్ తండ్రి దలపత్ రాం పాతకోత్తకవిత్వ వారధి .కవిరాజు బిరుదున్నవాడు .పూర్వకాల సంస్కృత పాండిత్యం ,వ్రజభాష ,మధ్యయుగ గుజరాతీ కవిత అలంకార ఛందస్శాస్త్రాలలో నిధి .శిష్టాచారాలతో పెరిగినవాడు .నూతనకవితా వికాసంతోనూ కొంత పరిచయమున్నది .సమకాలీనకవి నర్మద్ లాగా సంఘ సంస్కరణ అవసరం గుర్తించినవాడు .నర్మాద్ తనభావాలను తర్వాత మార్చుకోన్నాడుకానీ దలపత్ మారలేదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1 ‘’నానాలాల్ ‘’అనే పుస్తకాన్ని యు.ఎమ్ మనియార్ రచిస్తేతెలుగులోకి డా.అక్కిరాజు రమాపతి రావు గారు అనువాదం చేయగా  సాహిత్య అకాడెమి 1979లో ముద్రించింది .వెల-రెండున్నర రూపాయలు  .  తండ్రీ కొడుకులు 1905లో ప్రముఖ మేధావి ,సుప్రసిద్ధ నవలారచయిత గోవర్ధన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన గుజరాతీ సాహిత్య పరిషత్ సమావేశం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోటి లింగ శతకం

కోటి లింగ శతకం కోటిలింగ శతకాన్ని శ్రీ సత్యవోలు అప్పారావు గారు రచించగా 1912లోరాజమండ్రి లోని  మనోరమా ,బ్రౌన్ ఇండష్ట్రియల్ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల-మూడు అణాలు .ఈశతకం రాజమండ్రి లోని  ‘’మానవ సేవా ‘’పత్రికలో మొదట ప్రచురించబడింది .పత్రిక సంపాదకులు శ్రీ నాళం కృష్ణారావు గారు ,శ్రీసత్యవోలు అప్పారావు గార్లు .ఈ పత్రిక సంవత్సర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం )

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం ) కవిత్వానికీ ,కాల్పనికసాహిత్యానికి మధ్య విభజన రేఖ బాగా తెలిసినవాడు బుద్ధ దేవ్ .నవలను సాహితీ మిశ్రమం అంది వర్జీనియా ఉల్ఫ్.ఇది బుద్ధ దేవ్ కు సరిగ్గా సరిపోతుంది .విశ్వజనీన సంఘటనాత్మక సమన్వయము తో నూతన సంప్రదాయాన్ని సృష్టించుకొన్నాడు .తన నవలను ‘’నవ్యోపన్యాస’’అన్నాడు .ఈతని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3 మానవ జీవితం ప్రక్కనే అనంత జీవజాల ప్రపంచం సహ జీవనం చేస్తోంది .కాని ఇదిమాత్రం నిరాదరణకు గురైంది .దీన్ని హిల్స ,బాంగ్ అంటే కప్పలు,జొనాకి అంటే మిణుగురుపురుగులు  కవితల్లో చర్చించాడు బుద్ధ దేవ్.వీటిలో స్వయం సమృద్ధిగల సమైక్య జీవన విధానం తెలియజేశాడు –‘’కప్పలన్నీ కలిసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -2

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -2 బుద్ధ దేవ్ గురుత్వమే చాలామందికి మార్గదర్శకమైంది .’’కవితా భవన్ ‘’సంస్థ  స్థాపించి వివిధ ధోరణులకవులను ,రచయితలు కేంద్రీకరించాడు .నవతరం రచయితలకు ఆసరాగా ఉన్నాడు .’’ఏక్ పైసా ఏక్తీ’’అంటే పైసాకి ఒక ప్రతి అనేధారావాహిక ప్రారంభించాడు.చివరి రోజుల్లో రుషి గా ఆశ్రమవాసం కల్పించుకొన్నాడు .పరిపక్వత పెరిగిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్

శతాధిక బెంగాలీ  గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ బద్ధదేవ బోస్ జీవిత చరిత్రను ఆంగ్లం లో అలోక్ రంజన్ దాస్ గుప్తా రాస్తే తెలుగులోకి శ్రీ ఆవంత్స మో సోమసుందర్ అనువాదం చేయగా  సాహిత్య అకాడెమి 1982లో ప్రచురించింది. వెల-4రూపాయలు . ‘’ఉత్తమాభిరుచి ,పరిపక్వ బుద్ధీ ,కలిగిన పాఠకులు లభించేంతవరకు వారికోసం నిరీక్షించటం రచయితకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్-5(చివరిభాగం )

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్-5(చివరిభాగం ) ఆశాన్ రాసిన కావ్యాలు మళయాళ సాహిత్య విమర్శకులకు చేతినిండా పని కల్పించాయి .ఆయన రాసిన ‘’సీత ‘’బాగా విమర్శకు గురైంది .ఈ కావ్యం పూర్తిపేరు ‘’చింతా విష్టయాయ సీత ‘’.కరుణ రస ప్రపూరిత ఘట్టాలతో వర్ణించాడు .1919లో ప్రచురితమైనా ,అయిదేళ్ళకాలం లో కేవలం 80పద్యాలే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -4

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -4 రాలిన పువ్వు కావ్యం మొదట్లో కవి కుమారన్ ఆశన్ ‘’సుందరపుష్పమా !ఒకప్పుడు రాణీ లాగా మహోజ్వలంగా ప్రకాశించావు –ఇప్పుడు కాంతి విహీనమై ధూళి లో పొర్లుతున్నావ్ –ఈ లోకం లో భాగ్యం చపలమైంది –సౌందర్యం అశాశ్వతం ‘’అంటాడు. పువ్వు బాల్యాన్ని –‘’లత ప్రేమతో నిన్నుకన్నది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సాం మహిళా విమోచనోద్యమ నాయకురాలు,నవలాకారిణి -చంద్రప్రభ సైకియాని-విహంగ -ఫిబ్రవరి

అస్సాం లో కామరూప్ జిల్లాలో డోయి సింగిరి గ్రామం లో చంద్ర ప్రియా మజుందార్ గా చంద్రప్రభ సైకియాని 16-3-1901న పదకొండు మంది సంతానం లో ఏడవ పిల్ల గా జన్మించింది .చెల్లెలు రజని ప్రియా సైకియాని తో కలిసి ,మోకాళ్ళ లోతు బురదలో నడిచి బాలుర స్కూల్ లో చదవటానికి రోజూ వెళ్ళేది .ప్రభ … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment