వీక్షకులు
- 1,009,729 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (510)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం )అంకితం ,స్పాన్సర్ వ్యాసాలూ వగైరా
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం ) రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ అంకితం దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి ,డా. శ్రీమతి సులోచన దంపతులకు జీవిత విశేషాలు జననం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా నదీ తీరాన నందిగామ తాలూకా వేములపల్లి గ్రామం లో శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తిగారు కీ. శే . శ్రీ బండారు రాజేశ్వర రావు ,కీ.శే .శ్రీమతి సత్యవతి దంపతులకు 1-7-1929 న జన్మించారు .వీరి అన్నగారు శ్రీభోగేశ్వరావు గారు స్వాతంత్ర సమర యోధులు ,నందిగామలో ప్రముఖ సాంఘిక సేవకులు .వీరికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు .అమరావతి పాలకులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వీరి కుటుంబానికి వేములపల్లి గ్రామాన్నిఈనాముగా రాసిచ్చారు .కనుక వీరు వేములపల్లి అగ్రహారీకులు . కళాశాల విద్య –ఉద్యమ నిర్వహణ శ్రీ రాధాకృష్ణ మూర్తిగారు 1946 లో విజయవాడ లోని ఎస్ ఆర్ ఆర్ . అండ్ .సి.వి . ఆర్.కాలేజీ లో ఇంటర్ చదివి ఉత్తీర్ణులయ్యారు . స్వాతంత్రోద్యమం దేశం లో విస్తృతంగా విస్తరిస్తున్న కాలంలో దేశభక్తి వారిలో పురివిప్పగా మాతృదేశ సేవలో తరించాలన్న ధ్యేయం తో నాయకుల పిలుపు నందుకొని విద్యకు ఎగనామం పెట్టి స్వాతంత్రోద్యమం లో స్వచ్చందం గా చేరి,తమ వంతు పాత్ర పోషించిన దేశభక్తులు . . తరువాత 1947 లో దేశం స్వతంత్ర పొందాక భారత దేశం లోని సంస్థానాలను భారత దేశ అంతర్భాగంలో చేయటానికి నాటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలకు దాదాపు అందరు సంస్థానాధిపతులు స్వచ్చందంగా కలిసి వస్తే ,ఒక్క నైజాం నవాబుమాత్రం మొండి కేసి నయానా భయానా చెప్పినా లొంగకపోతే , నైజాం నవాబు పెంచి పోషించిన రజాకార్లు ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తుంటే రజాకార్ ల దౌష్ట్యాన్ని యెదిరించి పోరాడే ప్రజా ఉద్యమం లో ప్రజల తరఫున ప్రాణాలకుతెగించి పోరాడిన పోరాట యోధులు శ్రీ మూర్తిగారు . గత్య0తరం లేని పరిస్థితులలో సర్దార్ పటేల్ 1949 లో పోలీస్ యాక్షన్ జరిపి తరతరాలబూజు నైజాం నవాబును గద్దె దింపి నైజాం సంస్థానాన్ని భారత దేశం లో విలీనం చేశాడు . ఉన్నత విద్యాభ్యాసం –ఉద్యోగం–రచన పోలీస్ యాక్షన్ తర్వాత నాటి ముఖ్యమంత్రి మహా విద్యావేత్త డా బూర్గుల రామకృష్ణారావు ,డా మేల్కొటే మొదలైన ప్రముఖుల సలహా తోశ్రీ మూర్తిగారు ఉస్మానియా యూని వర్సిటీ లో చేరి ఆగిపోయిన విద్యను కొనసాగించి విద్యారంగంలోను మేటి అనిపించారు .ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ,మహా విద్యావేత్త , గ్రంథకర్త , ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రధమ సభాపతి డా శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారు వీరికి ముఖ్య బంధువు . మూర్తిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి 1953 లో ఏం ఎస్ సి ,1958 లో పి. హెచ్ . డి .పొందారు . 19 53 నుంచి 61 వరకు యూనివర్సిటీ సైన్స్ కాలేజీ లెక్చరర్ గా పని చేశారు . 1961 లో ‘’ఫుల్ బ్రైట్ఎక్స్చేంజి ప్రోగ్రాం ‘’లో అమెరికాలోని లూసియానా రాష్ట్రయూనివర్సిటీ కాలేజీ మెడికల్ కాలేజీ లో హృద్రోగ0పై రీసెర్చ్ చేయటానికి ,గ్రాడ్యుయేట్ స్కూల్ లో బయో కెమిస్ట్రీ బోధించటానికి అమెరికా వెళ్లారు . 1961 నుంచి 1992 వరకులూసియానా స్టేట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది మూడు దశాబ్దాలు సేవలందించారు . 1992 నుంచి టులేన్ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్పబ్లిక్ హెల్త్ లో గుండె జబ్బులపై పరిశోధనలు చేశారు .హృద్రోగాలకు సంబంధిన అనేక అమెరికా జాతీయ , అంతర్జాతీయ రీసెర్చ్ సమావేశాలలో ఆహ్వానితులుగా పాల్గొన్నారు .గుండె జబ్బులపై 200 లకు పైగా రీసెర్చ్పేపర్లుసమర్పించారు . ”గుండె జబ్బు -నివారణోపాయాలు ”పుస్తకాన్నిమూర్తిగారు ఆంగ్లం లో రచిస్తే ,వారి అర్ధాంగి సులోచనగారు తెలుగులోకి అనువాదం ,చేసి ప్రచురించిన ఘన వైద్యులు శ్రీ మూర్తిగారు . వివాహ బంధం –సంతానం రాధా కృష్ణ మూర్తిగారు శ్రీమతి శకుంతల గారిని వివాహమాడా రు .వీరి సంతానం 1-శ్రీ రాజేశ్వరరావు2- శ్రీమతి ఉమ3-కుమారి హేమ 4-శ్రీనివాస ప్రసాద్ గార్లు . ఈ నలుగురూ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లో ఆరోగ్య శాఖా సంబంధ వృత్తులలో స్థిరపడ్డారు . దురదృష్ట వశాత్తు శ్రీమతి శకుంతలగారు కేన్సర్ వ్యాధితో 1981 లో మరణించి కుటుంబానికి తీరని శోకం కలిగించారు . బండారు వారి బంగారు దాంపత్యo 1983 లో మూర్తిగారు గుంటూరు జిల్లా రేపల్లె లోని యల్లాప్రగడ వారి ఆడబడుచుప్రొఫెసర్ శ్రీ యల్లాప్రగడ రామ మోహన రావు గారి చెల్లెలు డా శ్రీమతి సులోచన ఏం డి . గారిని ద్వితీయ వివాహం చేసుకొన్నారు .శ్రీమతి సులోచనగారు 1969 కాకతీయ యూని వర్సిటీ లో ఏం. బి . బి. ఎస్.,1973 లో ఉస్మానియా యూనివర్సిటీలో డి. జి …
462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 ) (చివరి ఆర్టికల్ ) చిన్మయ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యం లో ‘’సంస్కృతం లో నూతన ఎల్లలు ,భారతీయ విజ్ఞానం ‘’పై 2017 జూన్ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 ) తెలంగాణా రాష్ట్రం సిద్దిపేటలో శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ జన్మించారు .వీరిది పండిత వంశ౦ .పితృ ,పితామహులందరూ సంగీత సాహిత్యాలలో దిగ్దంతులే .తండ్రి నారాయణ శాస్త్రి పండితులేకాక ప్రతిభా వ్యుత్పన్నులు ,సంగీత కళా మర్మజ్ఞులు . … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760) భరత చంద్ర రే గుణకార్ 18 వ శతాబ్ది ప్రముఖ సంస్కృత బెంగాలీకవి .రాజాస్థానకవి కూడా .అన్నపూర్ణ మంగళ కావ్యం తో సుప్రసిద్ధుడయ్యాడు .భరత చంద్ర గా సుపరిచితుడు .నాడియా మహా రాజు కృష్ణ చంద్ర ‘’గుణకార్’’బిరుదు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 ) నేపాల్ లో ఫుల్గమ ప్రాంతం లో రాంజీ ఠాకూర్ జన్మించాడు .వైష్ణవ కవి గోవింద ఠాకూర్ ,ప్రసిద్ధాకవి ,సవతి సోదరుడు రుచికర్ ఈ కవి పూర్వీకులు .లక్ష్మీ కాంత్ ఝా ,వి ఆర్ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 ) 13-10-18 99 న ఢాకా లో దుర్గామోహన భట్టాచార్య జన్మించాడు .1900 లో కుటుంబం ముర్షీదాబాద్ జిల్లా సహనగర్ లాల్ బాఘ్ కు తరలి వెళ్ళింది .నిరుపేద కుటుంబం అయిన౦దున పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలకుపంపించలేక పోయారు .వీధిబడిలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 446-మధ్య ప్రదేశ్ రాష్ట్ర గీర్వాణ భాషాసేవ (20 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 446-మధ్య ప్రదేశ్ రాష్ట్ర గీర్వాణ భాషాసేవ (20 వ శతాబ్దం ) మధ్యప్రదేశ్ లో డా కైలాష్ నాధ్ కట్జూ తర్వాత1957 లో ముఖ్యమంత్రి అయినపండిట్ రవి శంకర్ శుక్లా హయ్యర్ సెకండరీ స్కూల్స్ లో సంస్కృతభాషను కంపల్సరీ చేశాడు .డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో సంస్కృతం అభ్యసించేవారికి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978) 1808 లోనే బైబిల్ కు సంస్కృత అనువాదం ప్రారంభమైంది .1843లో కలకత్తా బాప్టిస్ట్ మిషన్ హీబ్రూ భాషలోని బైబిల్ ను సంస్కృతం లోకి అనువదించి ముద్రించింది . కలకత్తాలోని సేరమ్ పూర్ లో విలియం కారీ మూల గ్రీకు భాషలోని న్యూ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 ) కేరళకు చెందిన సంస్కృత కవి ,మహా విద్వా0సుడు పి. సి . దేవాస్సియా 1906 లో జన్మించి నూరేళ్ళ నిండుజీవితం గడిపి2006 లో మరణించాడు .ఆయన రచించిన క్రీస్తు భాగవత మహాకావ్యం బహు ప్రశస్తి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968)
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968) వేదాలనూ ,ఖురాన్ నూ ,హిందూ మతాచార్యుల సిద్ధాంతాలను ,మహమ్మద్ ప్రవక్త సూక్తులను అనర్గళంగా ,సభా రంజకంగా చెప్పగలిగే సమర్ధుడు ,సంస్కృత పండితుడు ,లక్నో లోని నద్వతుల్ ఉలేమా లేక నద్వా మదరసా పండితుడు .1968 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ (3 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ (3 వ శతాబ్దం ) జైన సంప్రదాయం లో మొదటి పదకొండు అంగాలు అంగ వాసర్పిణి కాలం లో బాగా శిధిలమైనా సంరక్షింప బడ్డాయని స్వే తాంబరు విశ్వాసం .ఆ కారణం వలననే మూడవ శతాబ్దికి చెందిన దేవర్ధిగని క్షమా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 ) క్రీశ 66 లో జన్మించి 90 లో సిద్ధి చెందిన స్వేతాంబర దిగంబర జైనా చార్యుడు భూతబలి . ఈయన ‘’షట్కా0డ ఆగమ0 ‘’ను పుష్పదంతా చార్యునితో కలిసి ప్రాకృత భాషలో రచించాడు .మధుర ప్రాంతం లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 439-తిలోయ పన్నతి కర్త -యతి వృషభ (క్రీ శ . 551)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 439-తిలోయ పన్నతి కర్త -యతి వృషభ (క్రీ శ . 551) జైన మతాచార్యుడు ,గణిత శాస్త్ర వేత్త ,ఆర్య మంఖ,నాగహాస్తి ల శిష్యుడు యతి వృషభ .తనగురించి పెద్దగా చెప్పుకోలేదు కానీ గుప్త యుగం పాలించిన 231 ఏళ్ళ తర్వాత అని చెప్పాడు .కనుక ఈయన కాలం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 438-పంచసంధి వ్యాకరణ కర్త -బనార్సి దాస్(1587-1643)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 438-పంచసంధి వ్యాకరణ కర్త -బనార్సి దాస్(1587-1643) 1587 లో జన్మించి 1643 లో మరణించిన బనారసీ దాస్ తన జీవిత చరిత్ర ‘’అర్ధ కథానక ‘’గ్రంధం రాశాడు .అందులో జైన దేవాలయాలలో జరిగే పూజలు ,ఉత్సవాల గురించి వర్ణించాడు . 1635 లో జైన గురువు పండిట్ రూప్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద (క్రీపూ 8 -క్రీశ 44 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద (క్రీపూ 8 -క్రీశ 44 ) కుంద కుందాచార్యుల అసలు పేరు పద్మనంది .ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కుంద కుందే గ్రామవాసిగా భావిస్తారు . కృష్ణా నదీ తీర వాసి కృష్ణాజిల్లా వాసి అనే ప్రచారమూ ఉంది . … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627) అక్బర్ నవరత్న మంత్రులలో ఒకడైన కవి అబ్దుల్ రహీం ఎ -ఖానా 1556 లో జన్మించి 1627 లో మరణించాడు .ఉర్దూ ద్విపదలకు ఖగోళ శాస్త్ర గ్రంధానికి ఆయన మారుపేరు సంస్కృతం లో రెండుగ్రంధాలు రాసిన … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961) 1961 ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ముస్లిం జమీందారీ కుటుంబం లో నహీద్ ఆబిదీ జన్మించింది . సంస్కృతం అభిమాన విషయంగా గా తీసుకొని కమలామహేశ్వరి కాలేజీ నుండి డిగ్రీని ,మీర్జాపూర్ కె వి డిగ్రీ కాలేజీ నుంచి ఏం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936 10-3-1936 న శ్రీ భాష్యం నరసింహాచార్య ,గోపమాంబ దంపతులకు శ్రీ విజయ సారధి వరంగల్లు లో జన్మించారు .తల్లి ,అమ్మమ్మ గానం చేసే జయదేవుని అష్టపదులు సంస్కృత శ్లోకాలను వింటూ ఆభాషపై అభి రుచి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965) జి యెన్ బి గా లబ్ధ ప్రతిష్ఠుడైన జి యెన్ బాల సుబ్రహ్మణ్యం తమిళనాడు మాయవరం లోని గుడలూర్ లో 6-1-1910జన్మించాడు తండ్రి నారాయణ స్వామి అయ్యర్ సంగీతజ్ఞుడు .అరియకపూడి రామానుజ అయ్యర్ మానసిక గురువు .లా పాసై … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856) తంజావూర్ కు చెందిన చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం వడివేలు అనే నలుగురు సోదరులను తంజావూర్ సంగీత చతుష్టయ0 అంటారు .భరతనాట్యం కర్ణాటక సంగీత వ్యాప్తికి వారి కృషి మరువలేనిది .తంజావూర్ మహారాజు షెర్ఫోజి ఆస్థాన సంగీత విద్వా0సులుగా ఉండేవారు . తరువాత తిరువాన్కూర్ మహారాజు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333) మధ్వాచార్య శిష్యుడు ,దాస సంప్రదాయ కర్త నరహరి తీర్ధ విజయనగర సామ్రాజ్య రాజగురువు ,యతీంద్రుడు 1323 లో జన్మించాడు .ఈయనది ఆంద్ర దేశమే నని భావిస్తారు .పుర్వాశ్రమ నామం శ్యామ శాస్త్రి .కళింగ రాజుల మంత్రి గా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891) కర్ణాట రాష్ట్ర జాతీయ గీతం ‘’కాయో శ్రీ గౌరీ ‘’రాసిన బసవప్ప శాస్త్రి 1843 లో మైసూర్ జిల్లా నరసా0ద్ర గ్రామం లో జన్మించాడు . సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు . కాళిదాసుని శాకుంతల మాళవికాగ్నిమిత్ర మొదలైన సంస్కృత నాటకాలను … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 ) కర్ణాటక లో 1799 లో జన్మించిన సంగీత వేత్త మైసూర్ వాసుదేవరావు త్రాగరాజస్వామి శిష్యుడు వాలాజపేట వెంకటరామణ భాగవతార్ శిష్యుడు .గురువు ఈయనను మైసూర్ మహారాజు మూడవ కృష్ణ రాజ ఒడియార్ కు పరిచయం చేయగా ఆసంగీత ప్రతిభకు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర భాగవతార్ (1815-1892 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర భాగవతార్ (1815-1892 ) కేరళలో నూరానిలో 1815 లో జన్మించి 1892 లో మరణించిన పాలఘాట్ పరమేశ్వర భాగవతార్ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు . తిరువాన్కూర్ రాజు ,ప్రముఖ వాగ్గేయ కారుడు స్వాతి తిరుణాల్ కు చాలా సన్నిహితుడు అభిమానమైనవాడుకూడా … Continue reading
గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)
గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961) 28-5-1865 న కర్ణాటకలో లోమధ్వ బ్రాహ్మణకుటుంబం లో జన్మించిన సుప్రసిద్ధ కర్ణాటకసంగీత విద్వా0సుడు ,త్యాగరాజస్వామి శిష్యుడు మైసూర్ వసుదేవాచార్య పద్మ భూషణ పురస్కార గ్రహీత . మైసూర్ మహారాజా ఆస్థాన వైణిక విద్వా0సుడు వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం అభ్యసించాడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 ) కేరళలోని ఓలాపమన్న మన్న వంశీకుడైన నారాయణన్ నంబూద్రి పండిత వంశ సంజాతుడు . 1910 లో జన్మించి 1989 లో చనిపోయాడు .ఋగ్వేదం లో మహా నిష్ణాతుడు .త్రిచూర్ బ్రాహ్మణ సర్వస్వ0 అధ్యక్షుడు .ఋగ్వేదాన్ని కరస్పాండెన్స్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 406-చిత్రోదయమణి కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 406-చిత్రోదయమణి కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991) కేరళకు చెందిన సాంబశివ శాస్త్రి ‘’చిత్రోదయమణి ‘’కావ్యం రాశాడు .తిరువనంతపురం మహారాజు చిత్ర తిరుణాల్ ,ఆయన వంశ పురుషుల గురించి రెండు సర్గలలో వర్ణింపబడిన కావ్యం .చేర రాజులలో చెంగుత్తవన్ ప్రస్తావన చేసి ఆయనను చేరమాన్ పెరుమాళ్ అన్నాడుకవి .తర్వాత ముకుందమాల … Continue reading
గీర్వాణ కవులకవితాగీర్వాణం -3 401-కామ సందేశ కర్త -మాతృ దత్త (16వ శతాబ్దం
గీర్వాణ కవులకవితాగీర్వాణం -3 401-కామ సందేశ కర్త -మాతృ దత్త (16వ శతాబ్దం కేరళకు చెందిన మాతృ దత్త కవి ‘’కామ సందేశం ‘’కావ్యం రాశాడు .మేల్పత్తూర్ కు చెందిన ఈ కవి వ్యాకరణ వేత్త .నారాయణ భట్ కుటుంబానికి చెందినవాడు .కావ్యం మొదటిభాగం లో 66 ,రెండవభాగం లో 69 శ్లోకాలున్నాయి .భార్యతో ఆనందంగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం ) కేరళకు చెందిన 14 వ శతాబ్దపు కవి పూర్ణ సరస్వతి -పూర్ణ జ్యోతిష్యుని శిష్యుడు .ఉత్తర మలబార్ లోని కాట్టుమటం ఇళ్లాం కు చెందినవాడు .పూ ర్ణ సరస్వతి వంశాన్ని పరశురాముడు ఆశీర్వదించి నట్లు ఐతిహ్యం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 ) కేరళలో తిరువనంత పురం లోని చెంపల0తి లో 1885 లో నారాయణ గురు జన్మించాడు .తండ్రి మదన్ ఆసన్ ,తల్లి కుట్టిఅమ్మ .గురుకుల పద్ధతిలో ప్రాధమిక విద్య ఉన్నత విద్య 1887 వరకు నేర్చాడు .ఈకాలం లోనే తర్క … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం కేరళకు చెందిన 18 వ శతాబ్ది సంస్కృతకవి రామపనివాద గొప్ప సంస్కృత విద్వా0సుడు .ఆ కాలపు ఎందరో రాజుల సంస్థానాలలో మన్ననల నందుకున్నవాడు .ప్రాకృతభాషలోనూ అసామాన్య పాండిత్యం ఉన్నవాడు సంస్కృత ,ప్రాకృతాలలో చాలా రచనలు చేశాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 393- ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 393- ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 ) ఆంగ్ల సామ్రాజ్య సంస్కృత మహా కావ్యం రాసిన ఏ .ఆర్. రాజరాజ వర్మ కోయి తంపురన్ కేరళ దేశీయుడు .తల్లి కుంజి కావు తంబురాట్టి ,తండ్రి వాసుదేవన్ నంబూద్రి . ఆయన రాసిన 30 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430) తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధిలో ప్రతి రోజు తెల్లవారుఝామున స్వామిని మేల్కొల్పటానికి ఆలపించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సుప్రభాతాలలో తలమానిక మైనది .దీన్ని రాసే అదృష్ట0 పొందినవాడు ప్రతి వాది భయంకర శ్రీ అనంతాచార్య … Continue reading
గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )
గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 ) సంస్కృత కన్నడ వ్యాకరణా ల లోతులు తెరచిన యెన్ రంగనాధ శర్మ 7-1-1916న కర్ణాటకలో నాడహళ్లి లో జన్మించాడు .బెంగుళూరు చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో 1948 నుండి 1976 వరకు నాలుగు దశాబ్దాలు సంస్కృత కన్నడాలు … Continue reading
గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3 388-సుధాపరిమళ వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )
గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3 388-సుధాపరిమళ వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 ) మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వెంకట నాధుడుగా తమిళనాడు భువనగిరిలో 1597లో కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో తిమన్నభట్ట గోపికాంబ దంపతులకు జన్మించారు .మధురై లో బావ లక్ష్మీ నరసింహాచార్యులవద్ద శాస్త్రాధ్యనం చేసి ,కుంభకోణం శ్రీమఠం లో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 386-మధ్వ విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 386-మధ్వ విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310) ద్వైతమత స్థాపనాచార్యులపై మధ్వ విజయం రాసిన నారాయణ పండితాచార్య శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు త్రివిక్రమ పండితా చార్య కుమారుడు .మధ్వ విజయం 16 సర్గల మహాకావ్యం . మధ్వాచార్యులు సమకాలీకులవటం వలన ఈ గ్రంధం మన విద్యారణ్యులవారి శంకర విజయంలాగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912 1-8-1912 న కడూర్ కృష్ణ జాయిస్ కర్ణాటక శృంగేరిలో శేషమ్మ ,సుబ్బా జాయిస్ దంపతులకు జన్మించాడు .అలంకార ,అద్వైతాలలో విద్వాన్ డిగ్రీ పొంది హోల్ నరసాపూర్ ,ఆధ్యాత్మ ప్రకాశం కార్యాలయం లో పని చేశాడు .తర్వాత బెంగుళూర్ శృంగేరి శంకర … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 383-శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య (1922-2015)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 383-శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య (1922-2015) గలగరి పండరీనాథాచార్య 22-7-1922 న కర్ణాటకలోని గలగరి అనే కుగ్రామం లో జన్మించాడు . తండ్రి కూర్మా చార్యులు . చిన్నతనం లో చదువు ఒకటవ తరగతి తో ఆగిపోయింది .వెంటనే వేదాధ్యనం తండ్రివద్ద ప్రారంభించాడు . 1944 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936 వాడిరాజాచార్య రాఘవాచార్య పంచముఖి లేక వాచస్పతి పంచముఖి 17-9-1936 న కర్ణాటకలోని ధార్వార్ లో జన్మించాడు . తండ్రి వైద్య రత్న ఆర్ ఎస్ .పంచముఖి .తల్లి కమలాబాయి .తండ్రి ప్రసిద్ధ ఎపిగ్రఫిస్ట్ ,ఆర్కియాలజిస్ట్ ఇండాలజిస్ట్ చారిత్రాత్మక పరిశోధనలో జీవితమంతా గడిపినవాడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953) టి వి కపాలి శాస్త్రి తమిళనాడులోని మద్రాస్ లో మైలాపూర్ లో 1886 లో తంత్ర శాస్త్ర బ్రాహ్మణా కుటుంబం లో జన్మించాడు .తల్లి ఉగ్గుపాల తోనే సకల శాస్త్ర వేద సారం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త -కొండవీటి వెంకటకవి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త –కొండవీటి వెంకటకవి (1918 – 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. వీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 380-వాసుదేవ వాగ్వేణు కర్త -డా.ఉమాచంద్ర శేఖర్ వైద్య (1952)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 380-వాసుదేవ వాగ్వేణు కర్త -డా.ఉమాచంద్ర శేఖర్ వైద్య (1952) –19-9-1952 లో పంజాబ్ లో జన్మించిన డా ఉమావైద్య కవికులగురు కాళిదాస సంస్కృత యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పని చేశాడు .సంస్కృత మరాఠీ హిందీ ఇంగ్లిష్ లవ్ అపార పాండిత్యం సంపాదించాడు అనర్గళ వక్త కూడా .సంస్కృత పాళీ వ్యాకరణం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 379-అన్వీక్షికి వ్యాఖ్యాత -కపిలామహర్షి (క్రీ.పూ. 650-575 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 379-అన్వీక్షికి వ్యాఖ్యాత -కపిలామహర్షి (క్రీ.పూ. 650-575 ) -అన్వీక్షి కి సంప్రదాయ వ్యాఖ్యాత -కపిలమహర్షి . ఆత్మ విద్యకు మరోపేరు అన్వీక్షి కి మనువు తన ధర్మ శాస్త్రం లో ఆత్మ విద్య ను అన్వీక్షికి అని పేర్కొన్నాడు .తర్వాత ఇది ఉపనిషత్తులలో ఒక భాగమైంది .యదార్ధానికి అన్వీక్షికి ఉపనిషత్తులకు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 377– సమన్వయ యోగ ప్రచారకులు -స్వామి శివానంద (1887-1963
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 377– సమన్వయ యోగ ప్రచారకులు -స్వామి శివానంద (1887-1963 తమిళనాడులో తిరునల్వేలి వద్ద పత్తమదైలో స్వామి శివానంద సరస్వతి కుప్పుస్వామిగా 8-9-1887 న జన్మించారు .త0జావూరు మెడికల్ స్కూల్ లో చదివి ”ఆంబ్రోసియా ”అనే మెడికల్ జర్నల్ నడిపారు .మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ ప్రాక్టీస్ చేశారు .పేదలకు ఉచిత … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 376— చతుర్వర్గ చింతామణి కర్త -హేమాద్రి పంత్ (1259-1274)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 376— చతుర్వర్గ చింతామణి కర్త -హేమాద్రి పంత్ (1259-1274) దేవగిరి యాదవ రాజ మంత్రి హేమాద్రి లేక హేమాద్రి పంత్ .కరణాధిపుడు అని పిలుస్తారు . 1263 లో పండరీపురం లోని పాండురంగ విఠల దేవాలయ నిర్మాణం లో హేమాద్రి భూరి విరాళమండించినట్లు శిలాఫలకం ఉంది .గొప్ప పరిపాలనా దక్షుడేకాక సంస్కృత … Continue reading