Tag Archives: దువ్వూరి

మాతృశ్రీ జిల్లెళ్ళమూడి ‘’అమ్మ’’తనం

దువ్వూరి వారికి రెండవ సారి అకస్మాత్తుగా  మాట నోట రానందున ,విషయంతెలిసిన ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి వెళ్లి అమ్మను చూసివస్తే మంచిది ‘’అని సలహా ఇచ్చారు.ఈవిషయం చాలాకాలం మనసులో ఉన్నా వెళ్లలేకపోయారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య ఎస్వీ. జోగారావు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఈ నాటి అనుబంధ మేనాటిదో ?

ఈ నాటి అనుబంధ మేనాటిదో ? దువ్వూరి వారు విశాఖయూనివర్సిటీ లో తెలుగు లెక్చరర్ గా 1941 లో చేరాక ,రెండవ ప్రపంచ యుద్ధకాల౦ లో బాంబుల భయం వలన యూని వర్సిటీని గుంటూరుకు  మార్చారు .అంత పెద్ద కాంపస్ దొరక్క  అక్కడా అక్కడా  సర్దుకొన్నారు .లెక్చరర్లు ఇక్కడ పెంచిన అద్దె ఇళ్ళల్లో ఉండలేక సతమతమయ్యారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం

దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం  ప్రౌఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పోస్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు

 దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత ‘’రమణీయం ‘’గుర్తుకొస్తాయి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు ఆసాంతం చదివి హస్త, మేధోగతం చేసుకొన్నారు .1914విజయనగరం మహారాజాకాలేజిలో విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో సంజ్ఞాపరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రారంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు వ్యాకరణాలు చప్పచప్పగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం డా .కామేశ్వరికి ట్రాన్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రాస్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ 1970-74లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి

కూతురుకాని కూతురే తల్లికాని తల్లికొన్ని బంధాలు తమాషాగా యేర్పడి శాశ్వత బంధాలౌతాయి .చిరస్మరణీయాలౌతాయి .మధుర భావ బంధురాలౌతాయి ..ఎన్నో జన్మల అనుబంధాలేమో అనిపిస్తాయి .ఆ బంధానికి రెండు వైపులవారి స్పందనలు మరింత బలీయమైతే ఇక వాటిని గురించి చెప్పటానికి మాటలే ఉండవు . .ఆనందాను నుభవమే అయి మనసునమల్లెలై విరబూసి దిగంత వ్యాప్త పరిమళీ భూతాలౌతాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘నూక వప్పెచిమాః-క్రమాత్ ”

‘నూక వప్పెచిమాః-క్రమాత్ ” ఇదేమిటి తలా తోకా లేని శ్లోకం తెచ్చి హడల గొడుతున్నావని అనుకోకండి .”స్టేషన్సు  బెబ0 శాఖాయా0 -నూ క్రా శ్యాది నిర్ణయహ ” అని -పూర్తిశ్లోకం  శ్లోకం మొదటి పాదానికే కంపరమొస్తే శేషం యేమిటి స్వామీ అనకండి . దీనికో కధ ఉంది .చెబుతా వినండి సారీ చదవండి .  దువ్వూరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రామం మసకపల్లి లో కాకర్లపూడి నరసరాజుగారు క్షత్రియ కుటుంబాలలో  మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు పుట్టటానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపోయారు .శాస్త్రిగారు విజయనగరం కాలేజి  లో పని చేస్తుండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొంఠి లక్ష్మీ నరసింహ శాస్త్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అదో పాండిత్య రాజసం

       అదో పాండిత్య రాజసం శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం  .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు

శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ  తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4 తాతగారివద్ద సంస్కృతం ప్రారంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు . తలిదంద్రులతో తమ్ముడు మరదలుతో మాట్లాడుతుండగా ఈయన వినటమే .వచ్చిన 10గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకేసి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3 దువ్వూరి వారిఊరంతా  గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపోయింది .ఈయనున్నప్పటి ఊరు అంటే 1910లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ  తర్వాత నదీ గర్భం లోచేరింది .తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో  వీరి భూములన్నీ గౌతమీ గర్భాన చేరాయి .1910కి వీరికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2 బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు 11ఏళ్ళ వయసువరకు తాళ్ళూరు,జగ్గం పేటలలో ,12,13వయసులో స్వగ్రామం మసకపల్లి (మసక తొలగించి వెలుతురు ని౦పటానికేమో ?)14దాక్షారామ ,15,16కొంకుదురు ,పిఠాపురం ,17-23దాకా ‘’ విజీ’’ నగరం ,24-కొవ్వూరు ,25-43వరకు కృష్ణాజిల్లా చిట్టి గూడూరు ,44లో విశాఖ ,45-48 గుంటూరు ,49-70దాకా వాల్తేరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర

కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు తమ జీవిత చరిత్రను అప్పటిదాకా బోధించిన ,రచించిన గ్రాంధిక భాషలో కాక, బాణీ మార్చి,వ్యావహారిక తెలుగులో హృద్యంగా రసవద్యంగా ,కమనీయంగా ,ఆయనే చిన్నయసూరి బాలవ్యాకరణానికి రాసిన ‘’రమణీయం ‘’గా ముగ్ధ మనోహరం గా ఉంది .ఎన్ని సార్లు చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments