Tag Archives: రచనలు

మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 

మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 1-విద్యా వ్యవస్థ భ్రష్టు కు ”ఆదిమూలం ”2-ఒళ్ళంతా ,నోటినిండా బూతులతో -”నాని” ,”నాని” ,”నాని ”౩-ఆయన ఆర్ధిక విషయం వింటే ”బుగ్గన ”వేలేసుకోవాల్సిందే ‘ఆశ్చర్యంగా 4-రోడ్ల బాగు సేత ఏ”ధర్మానా ”లేదు5-అమరావతి ప్రజల చేతిలో ”బొచ్చె”పెట్టె మున్సిపాలిటి 6-గుడులు గోపురాలు ధార్మిక సంస్థల ”పల్లీ”ల హాంఫట్ కు నోరు ”వెల్ల ”బెట్టాల్సిందే … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

‘’ ఘూర్జరాంధ్ర ‘’అవుతుందేమో గోవి౦దా రామ !

‘’ ఘూర్జరాంధ్ర ‘’అవుతుందేమో గోవి౦దా రామ ! అమరావతికి సమాధి కట్టారు గోవి౦దారామ రోడ్లన్నీ తవ్వి మెరకేసుకొంటున్నారు గోవిందా రామా ఇన్సైడ్ ట్రేడింగ్ బూచి బూమరా౦గైనా,గోవిందా రామా అక్కడి రైతులకేది ఊరట గోవిందా రామా గేట్లు బిగించి అమరావతిని ముంచి గోవిందా రామ ‘’కొ౦పకొల్లేరు ‘’చేశారు గోవి౦దా రామా పులిచింతల గేటు విరిగితే గోవిందా రామా … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

బెయిల్ ఇచ్చి బతికించండి

బెయిల్ ఇచ్చి బతికించండి’’ నాకు మీ హాస్పిటల్స్ వద్దు , మీ కోవిడ్ ట్రీట్ మెంటూ వద్దు నా తోటిఆది వాసీలున్న చోటికి నన్ను వెళ్ళనీయండి బెయిల్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి చాలు వారిమధ్య ప్రశాంతంగా కన్నుమూస్తాను ‘’ అని ప్రాధేయపడ్డ స్టాన్ స్వామి పట్ల అందరూ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి’’ఉపా’’తో ఉరేశారు . గిరిజన హక్కుల … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

 వింత వీజీవా ?

 వింత వీజీవా ? అంటే అర్ధం కాలేదా ఇంత ఈజీయా? అని. చరణదాసి సినిమాలో రామారావు ఫోటో చూసి ‘’ఇది డాక్టర్ గారి ఫోటోవా ‘’?అని అడుగుతుంది సావిత్రి .ఒక సారి గేపకం చేసుకోండి .అక్కడినుంచి సరఫరా అయిన ‘’వా ‘’ ఇది . ఇది శీర్షికమాత్రమే . ‘’తాతయ్యా !నీ అకౌంట్ నుంచి అయిదువందలకోట్లు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దుంప రాష్ట్రం

దుంప రాష్ట్రం అదొక దుంప రాష్ట్రం .కరోనా కోరల్లో నలిగి గిలగిలలాడుతోంది .నాయకుడు ప్రతిపక్షాల ఇళ్ళపై జులుం చేయిస్తున్నాడు .పోలీస్ పెద్దాయన ఎస్ బాసిజం తో లాక్కొస్తున్నాడు .ఇసి అడుగులకు మడుగు లోత్తుతూ కప్పదాటు యవారంలో ఉంది .సినీ ప్రముఖులు అధినాయకుని కి భుజకీర్తులమరుస్తూ ,ప్రక్కరాస్ట్రం విలన్  దాన శూర వీర కర్నుడుగా వెలిగిపోతుంటే ,షూటింగ్ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

నీలాచలేశ్వర స్తవం

   నీలాచలేశ్వర స్తవం శ్రీ కపిల కృష్ణ శర్మ కవి ‘’కర్మశ్రీ ‘’నామధేయం తో ‘’నీలాచలేశ్వర స్తవం ‘’ రచించి సర్వ సమైక్య భావ గరిష్టుడు ,అనవతర పర సేవా తంత్రుడు ,సత్పుణ్య శాలి ,దాన సద్ధర్మాదిమానవీయ నియమ పాలనా రతుడైన తన తండ్రి కపిల కామేశ్వరునికి అంకిత మిచ్చాడు .ఈపుస్తకం నరసాపూర్ లోని కమలాకుటీర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంధ్రా జాకీర్హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్

 ఆంధ్రా జాకీర్ హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్ తణుకు కంటి డాక్టర్ డా .హుసేన్ అహ్మద్ జీవిత కథ ను  తణుకు చారిత్రిక పరిశోధక బహు గ్రంథ రచయిత  శ్రీ కానూరి బదరీ నాథ్’’ ప్రశాంత పథకుడు డా .హుస్సేన్ అహ్మద్’’గా రాసి ఆవిష్కారం అయిన మర్నాడే  చర్లవారి పురస్కారం అందుకొన్న మల్లవరం లో మాకు జనవరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  పూలదండకు మరణ శిక్షా ? 

      పూలదండకు మరణ శిక్షా ?  కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం అసూయకు దారితీసిందా శివదాసన్ ! కొచ్చీ మెరైన్ డ్రైవ్  వీధిలోనే పడుకుంటూ నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే నీపైనే అసూయా ? … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

   ధర్మవరం

   ధర్మవరం ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ  పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి … Continue reading

Posted in సమీక్ష | Tagged , | Leave a comment

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు హోసూరు ప్రాంతం వరకవి శ్రీ కైవారం తాతగారు జగత్ ప్రసిద్ధులు వారి సమగ్ర చరిత్రను త్రవ్వి తీసి డా అగరం వసంత్ఒక పుస్తకాన్ని వెలువరించాడు .దాదాపు అంతటి ప్రసిద్దే ఉన్న శ్రీ అంజనప్ప స్వాములు గురించి  ఆ ప్రాంతం వారికెవరికీ  పెద్దగా తెలీదు .కాని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 5 Comments

”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్ లో

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ  వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్  లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అదొక్కటే మందు అన్నిటికి  

అదొక్కటే మందు అన్నిటికి వార్ రూమ్ లో పార్టీ అగ్ర నేతలు భేటీ అయ్యారు .ఎజెండా ఏమిటో ఎవరికీ తెలీదు ఆ ఇద్దరికీ తప్ప .టీ సరఫరా నిరంతరంగా జరుగుతోంది. తాగి శీతాకాలపు చలికి కొంచెం ఉపశమనం కలిగించుకొంటున్నారు .ఇంతలో ‘’జోడీ ‘’వస్తే ,లేచి నిలబడి అభివాదం చేశారు .నంబర్ 2మొదలు పెట్టాడు ‘’మనం ఏది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పదేళ్ల కిందటి ”ఎలర్జీ ”మళ్ళీ జూన్ తెలుగు విద్యార్థిలో ప్రత్యక్షం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 క్షత్ర బంధూపాఖ్యానం

క్షత్ర బంధూపాఖ్యానం ఈ పేరే మనకు కొత్తగా  అని పిస్తుంది .దీన్ని రచించిన  కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో  ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ 

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ మా బామర్ది బ్రహ్మం పరుగెత్తుకొచ్చాడు వగర్చు కొంటూ ” ఏంట్రా విశేషాలు ?”అడిగా . ”బావా ! ఒకప్పుడు కాలిఫోర్నియా లో గోల్డ్ రష్ జరిగిందని లక్షలాది జనం బంగారం కోసం ఇల్లూ  వాకిలీ వదిలి అక్కడికి వెళ్లి బంగారం కోసం ప్రతి అంగుళం త్రవ్వారని విన్నావా … Continue reading

Posted in రచనలు, రాజకీయం | Tagged | Leave a comment

కొత్త కొలువుకూటం 

కొత్త కొలువుకూటం  ఈ మధ్యదాకా ”గౌరవ సభ ” నలభై రోజుల్నించి ”కౌరవ సభ ” ఇప్పటిదాకా ”పూతు ”సభ  ఇప్పుడేమో ”బూతు సభ ” మొన్నటిదాకా ”అమ్మ ”కు వందనం  నేడేమో ” నీయమ్మా నీ యాలి ”లకు అందలం   ఇంతవరకు ప్రజా పాలనే ధ్యేయం  ఇప్పుడు ”విధ్వంసం కూల్చివేతలే ”ఆదర్శం   మాటకు  చేత … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

తొలి లేక శయన ఏకాదశి

ఒకప్పుడు భగవాన్ శ్రీ కృష్ణుడు ,యుదిస్టిరుడైన ధర్మరాజుకు ప్రధమ లేక తొలి లేక శయన ఏకాదశి విశేషాలను తెలియ జేశాడు .దీన్ని బ్రహ్మదేవుడు తన పుత్రుడు నారదమహర్షికి తెలిపాడు అని భవిష్యోత్తర పురాణం పేర్కొన్నది .ఈ సందర్భం గా మాంధాత మహారాజు వృత్తాంతం తెలియ జేయబడింది .మాంధాత పాలనలో ఒకసారి తీవ్ర అనావృస్టి ఏర్పడి భయంకర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర పతంజలి యోగి -మాస్టర్ సి.వి.వి

అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని” అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి ”వ్యాసం జులై గురు సాయిస్థాన్  లో ప్రచురితమైంది -దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురు శిష్యులు ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ?

గురు శిష్యులు గురు -శిష్యా! ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ? శిష్య -అయిదుగురుకదా గురూ గురు -మరి సీఎం లు ఎందర్రా ? శిష్య – ఐదారుగురు  గురూ గురు -అదేంట్రా ఒక్కరే ఉండాలి కదా శిష్య -ఉండాలి నిజమే .అసలు సీఎం జగన్ .కీ సీఎం  విజయసాయి ,సూపర్ సీఎం కేసీఆర్ సుప్రీం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’ హోసూర్ బస్తీ యువక బృందం తరఫున డా అగరం వసంత్ కూర్పరిగా వెలువడిన 13వఉగాది కవితల’’పొత్తం’’నాకు ఈరోజే 8వతేదీ శనివారం ఉదయం అందింది .మధ్యాహ్నం చదివి సాయంత్రం స్పందిస్తున్నాను .ముఖచిత్రంగా ‘’పటికపువ్వులు ‘’తమఅందాన్ని , వైభవాన్ని తెలియ జేశాయి .పటిక ఒక స్పటికం కూడా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి తరిగొండ వెంగమాంబ

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి తరిగొండ వెంగమాంబ ”గురు సాయిస్తాన్ మే  సంచికలో పునర్ముద్రితం -దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు

 సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు అందమైన శీర్షిక భావాన్ని ప్రతిబింబించే పచ్చని చేలు, అందులో పండిన బంగారు మొలకలు , ధాన్యం  తో అబ్బు ఆర్ట్స్ అలరించిన అలరించిన ముఖ చిత్రం తో ,లోపలి కవితా శీర్షికలకు  అంతే ప్రతిభతో గీసిన ‘’పాణి ‘’చిత్రాలతో ,చూడంగానే ‘’చేను చెక్కిన శిల్పాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మూసీ ”మార్చి సంచికలో వికారి ఉగాది పద్యాలు

మూసీ ”మార్చి సంచికలో వికారి ఉగాది పద్యాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ కిటుకేమిటి ?

ఈ కిటుకేమిటి ?  కరటక దమనకులు ఆంధ్రా కు అన్నీ ఇచ్చేశాము . ఇంతఇ చ్చాము అంత ఇచ్చాము .మీ స్టిక్కర్ సీఎం మిమ్మల్ని మోసం చేస్తున్నాడు కేంద్రం నుంచి ఒక్కపైసాకూడా బాకీ లేదు అని చానల్స్ లో అక్కడక్కడా తెచ్చిపెట్టుకున్న జనాలమధ్య డబ్బాలు బాగానే కొట్టారు ఈమధ్య .పాపం పెద్దమనిషి రాజనాధ్ మాత్రం నిజాయితీగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము              గ్రంథ కర్త పరిచయం పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్ జననం -27-06-1940-ఉయ్యూరు తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి. వివాహం –ప్రభావతి తో(21-02-1964) ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు            కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998) సంతానం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు –నవంబర్ తెలుగు విద్యార్థి లో నా వ్యాసం

         

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గ్రంధాలయ సందర్శన యాత్ర -సరస్వతీ తీర్ధ యాత్ర -రమ్యభారతి (నవంబర్ -జనవరి )లో నా వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు జీవితం చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి       తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం. ఆధునిక యుగాంధ్ర సారస్వత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురం సమ్రాట్ గా పట్టాభి షేకం జరిగాక ,ధర్మరాజు కాకుండా మిగిలిన నలుగురు సోదరులు శ్రీ కృష్ణుని సందర్శించి ,రాబోయే కలియుగ విశేషాలు వివరించమని ప్రార్ధించారు .సరే అన్న ఆయన తాను  నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు సంధిస్తానని ,వాటిని  వెంబడించి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’ ఒసే సీతా ఓసారి రావే .పక్కింటి మామ్మగారి కేకలాంటి పిలుపు .’’ముసిలీ !సీత అనిపిలవోద్దని లక్షన్నర సార్లు చెప్పా .సీత్ అని పిలవమని లక్షన్నోక్క సార్లు నోరెత్తి మొత్తుకున్నా.అసలెందుకు పిల్చావ్ ? ‘’ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్ .సీతమ్మ తల్లి పేరు కావాలని నేను మీ నాన్నతో పెటిస్తే  ఇప్పుడేంటి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

   ధనికొండ హనుమంతరావు

   ధనికొండ హనుమంతరావు ఒకప్పుడు’’ రేరాణి ‘’పత్రిక చదవని వారంటూ ఉ౦డేవారుకాదు ..చదవక పొతే గిల్టీగా ఫీలయ్యేవారుకూడా .అంతటి ప్రభంజనం సృష్టించి౦ది  ఆ’’ రాత్రి రాణి ‘’..ఈ పత్రిక సంపాదకుడే ధనికొండ హనుమంతరావు .గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు మండలం లో ఇంటూరు గ్రామం లో హనుమంతరావు 1919 లో జన్మించాడు .బి ఏ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేడియో టాక్

సాహితీ బంధువులకు శుభకామనలు -మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భం గా విజయవాడ రేడియో కేంద్రం వారు గాంధీజీ -సత్యం ,అహింస ,సత్యాగ్రహం  సహాయ నిరాకరణ అనే 4 అంశాలపై రాసి ప్రసంగించమని కోరగా ,రాసి ఇవాళే రేడియోస్టేషన్ కు వెళ్లి  రికార్డ్ చేసిశాను .ఇవి ఉదయం 6 గంటల” సూక్తి సుధ ”లో అక్టోబర్ 6 ,8 … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి తెలంగాణా కామారెడ్డి జిల్లా రామన్నపల్లి మండలం ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది .కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు . శివుని ఆత్మస్వరూపం తో  ఇక్కడ కాలభైరవస్వామి కొలువై ఉన్నాడు .ఇదికామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న క్షేత్రం .పంటపొలాలమధ్య పింక్ రంగు దేవాలయం దూరం నుంచే ఆకర్షిస్తుంది .దోమకొండ సంస్థానాదధీశులకాలం … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు

హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం విజయవాడలో శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న శారదాస్రవ౦తి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వెళ్లి ,అందరూ మరచిపోయిన కమ్మని తెలుగు హాస్య రచయిత శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారి గురించి మాట్లాడాను .ఆ విషయాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

నేను రాసిన ‘సిద్ధ యోగిపుంగవులు” పుస్తకం లోని ”త్రికాలజ్ఞాని మహాయోగి గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి ”వ్యాసం సెప్టెంబర్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రించారు -దుర్గాప్రసాద్ s —

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒక శకం సమాప్తి ,అయితే ?

ఒక శకం సమాప్తి ,అయితే ? మచ్చ లేని ,భీతిలేని ,ప్రజాస్వామ్య విలువలున్న,మిత్రధర్మం పాటించే రాజకీయ నీతి ఉన్న ,ఎదిరిని ఎప్పుడు ఎదిరించాలో ఎప్పుడు చూసి  దెబ్బ దిమ్మ తిరిగేట్టు కొట్టాలో చాణక్యం తెలిసిన , కర్మ భూమి భారతాన్ని అన్ని విధాలా ప్రపంచపటం పై అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ,ఫెడరల్ రాజ్యాంగ ధర్మాన్ని అక్షరాలాపాటించిన ,విదేశీ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి,  ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా  నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది ,  కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఎవరీ అర్యముడు ?

ఎవరీ అర్యముడు ? దీన్తస్సాదియ్యా ఏదైనా మనసు లో పడితే అదేమిటో తెలుసుకొనే దాకా తోచదు .మళ్ళీ ఇవాళ గీత విభూతి యోగం లో శ్లోకమొకటి ఆలోచనకు పదును పెట్టింది – ‘’అన౦తశ్చాస్మి నాగానాం ,వరుణోయాదసామహం –పిత్రూణామర్యమా చాస్మి యమః సంయతామహం ‘’ నాగులలో అనంతుడు అంటే ఆదిశేషు డను ,జలం ఇచ్చే వాళ్ళలో వరుణుడను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి కాశీ అంటే వారణాసి లో శ్రీ వారాహి దేవి అమ్మవారి ఆలయానికి  కొన్ని ప్రత్యేకతలున్నాయి .ఆలయం భూ గృహం లో ఉండటం ఒక విశేషం అయితే ,రోజూ ఉదయం 5-30  గంటలనుండి 7-30  గంటల వరకు  రెండు గంటలు  మాత్ర మే తెరచి ఉండటం మరొక విచిత్రం .తర్వాత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు? భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ – ‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యోగి నివృత్తి నాధుడు

యోగి నివృత్తి నాధుడు నాధ సంప్రదాయానికి చెందిన నివృత్తి నాధుడు 13 వ శతాబ్దపు మహారాష్ట్ర కు చెందిన మహా భక్తుడు,కవి ,తత్వవేత్త మహాయోగి .మొదటి వర్కారి సంత్ అయిన సంత్ జ్ఞానేశ్వర్ కు పెద్దన్నయ్య , గురువుకూడా .మహారాష్ట్ర  గోదావరీ తీరం లోని  పైఠాన్ దగ్గరున్న ఆపెగావ్ లో దేశస్థ బ్రాహ్మణ  కుటుంబం లో జన్మించాడు .అప్పుడు ఆ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు . సరసభారతికి, నాకు అత్యంత  ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి డాక్టర్ బావగారు ,ఆయన అక్కగారు డా శ్రీమతి అన్నపూర్ణ గారి భర్తగారు ,’’లంపెన్ ప్రోలి టేరియట్’’ కథా శిల్పి శ్రీ రావి శాస్త్రిగారి తమ్ములు౦ గారు అయిన ,  డా శ్రీ రాచకొండ నరసింహ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”  

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం” ఢిల్లీ లో మేక  చర్మాలు అంటే తోళ్ళ తో పంది ఆకారపు సంచులలో నీళ్ళు నింపుకొని  వీపుకు  లేక బుజానికి  వ్రేలాడ దీసుకొని  ఇళ్ళకు నీళ్ళు చేర్చే వారిని ‘’భిస్టీలు ‘’అంటారు .వీళ్ళు ముస్లిం తెగకు చెందినవారు .మేక తోలును చాలా శుభ్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment