ఊయల సేవ
— ఆలయ వుత్శవ సంప్రదాయం లో ప్రభాతసేవ అర్చన కళ్యాణం కైంకర్యం నీరాజనం ఊరేగింపు ఊయల సేవ ముఖ్య మైనవి ఇవన్ని ఈ నెల రోజులు జరుపు కున్నం చివరిదైన ఊయల సేవలో ధన్య మవుదంనిత్యం మనల్ని కంటికి రెప్ప ల కాపాడుతున్న ఆ దేవ దేవునికి కొంచెం విశ్రాంతి నివ్వాలనే తలంపు మానవునికి కల్గి ఇలా సేవలో ధన్యత చెందుతున్నాడు .
”ఎటులైన భక్తీ వచ్చుటకే ప్రయత్నమూ సేయవే మానస ”అనేది త్యాగరాజ సూక్తి .అందుకే ఆయన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గుడి ఆ గుడిలో కావ్య గన సరస్వతి కనిపిస్తుంది .ఆధ్యాత్మిక భావం తో సంగీతం ,కవిత్వం, త్యగరాజ కీర్తనలలో ధాన్యం చెందాయి .వేదాంత సారం తో బ్రహ్మానంద రసానందాన్ని పొందిన మహాను భవుడు .భక్తియే జీవన్ముక్తి సదనం గ భావించి తరించాడు .దర్శనాలు అనేకం అయిన దైవం ఒకడే నని భావించి గణ వేదం తో శ్రీరామా పరబ్రహ్మాన్ని అర్చించి స్మరించి గానం చేసి ధన్యుదయాడు .మనము కూడా ఇక్కడ ఈ సువర్చలన్జనేయ స్వామి వారి సన్నిధి లోవరిలోనే సర్వ దేవత దర్సనం చేసి ఆ సంగీత సరస్వతిని అర్చించి నీరాజనలిద్దాం .
”ANY KIND OF SOUND IS ENERGY ” అన్నారు .మనసు నిర్మలం చేసుకొని భక్తితోఈస్వరార్పణం చేసే సంగీతమే రాణిస్తుంది .”ఎవరని నిన్ను కీర్తించా వలనయ్యసివుదివో మాధవుదివో కమలభావుడవో పరబ్రహ్మవో ”అని అందర్నీ ఒక్కరి లోనే చూస్తాడు త్యాగయ్య .”సీత,గౌరీ ,వా వగేస్వరియును స్త్రీ రూపము లంద ,లోక కోటు లంద ”అని అడుగుతాడు .నాదం పరబ్రహ్మ స్వరూపం .దాన్ని ఉపాసించి TARINCHARAYANA .నాదం అనేది యోగాభాషలో ”అనాహతం ”అక్కడే స్వాతీ నక్షత్రం వుంటుంది .వాయు సంబంది .మన దేవుడు వాయు పుత్రుడిగా .సప్త స్వరాలు ఇక్కడే పుడతాయి స్వాతీ నక్షత్రం లోనే మకర సంక్రమణం అయింది ఈ ఏడు .అపూర్వ మైన పుణ్య సమయం .అద్భుత భక్తీ భావం తో స్వామిని సేవించి తరిద్దాం .”అందుకే స్వాదు ఫల ప్రద సప్తస్వర రాగ నిచయ సహిత హరిహరాత్మక భు,సుర శరజన్మ గానేసాదులు ”వుపసించి తరించారట .”సరగున పదములకు స్వాంతమను సరోజమును సమర్పించిన వా అరెందరో మహాను భావులు” ”హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచు పులక శరీరులై యానంద పయోధి నిమగ్నులయి ముదంబున యశము గల వారెందరో మహాను భావులు ”అని పొగిడారు త్యాగరాజు .
”బాల కనక మయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విద్రుత శరజాల సుభద కరుణాలవాల ఘన నీల నవమల్లికాభారణ ఏలా దయ రాదు?” పరాకు చేసేవేల సమయము కాదు ”అని ప్రాధేయ పడ్డాడు ఆ భక్త కవి ”పదము త్యాగరాజ నుతుని పై గానిది పడితే నేమి ఎడ్చితే నేమి ”అని భక్తిని ప్రదర్సిస్తాడు .”సకల భూతము లందు నీవై యుండగా మది లేక బోయిన చిరుత ప్రాయము నాడే భజనామృత రస హీన కుతర్కుడైన పరధనముల కొరకు నొరుల మది కరగబల్కి కడుపు నిండ తిరిగినట్టిదుడుకుగల నిన్నే ద్దుకుదొరకొడుకు బ్రోచురా అని తన తప్పు లన్ని విన్న విన్చుకున్నాడు నీవే తప్ప వేరే దిక్కు లేరని మొర పెట్టు కున్నాడు భక్త త్యాగయ్య ?”
”మరుగేలరా ఓ రాఘవ చరాచర రూప పరాత్పర ,సూర్య సుధారాకర లోచన అన్ని నీవనుచు అంతరంగమున ,తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య నిన్నే గని మది నెన్న జాల నొరుల ,నన్ను బ్రోవ వయ్య త్యాగరాజ వినుత ”అని అన్నీ E ఆయనే అంటాడు ..నాదోపాసన ఒక్కటే తరించే మార్గం అందుకే ”శోభిల్లు సప్తస్వర సుందరుల భాజిన్చవే మనసా”అన్నాడు ”తలచితే మేనెల్ల పులకరించేని రామకనుగొన్న ననడమ I కన్నీరు నిన్దేదిని ఆలసించు వేల జగమంతా తరుణ మయ్యేని -చెంతనుండ నాడు చింతలు తొలగేని ”అని విశ్వాసం ప్రకటించాడు .
సద్భాక్తిలో జనులున్డటం చూసి యముడు చిన్తిస్తున్నాడట ”సతతము సుజను లెల్ల సద్భజన చేయుట చూచి చిన్తిన్చుచున్నాడు యముడు ”అని భక్తీ గొప్ప తనం చాటాడు .భక్తునికి భగవంతునికి భేదం లేదు .”నీవే నేనైనా నీవాడు గాక త్యాగరాజు వేరా //”అని ధైర్యం తో జ్ఞానం తో చెప్పాడు .”నీదు పలుకు పలుకురా నీదు కులుకే కులుకురా ,నీదు తళుకే తళుకురా ”అని మధుర ప్రేమతో ఆ రాధించాడు . త్యాగరాజ పంచరత్న కీర్తనలు జగత్ప్రసిద్ధం .అందులో మొదటిది ”జగదానంద కరక ”రెండోది ;”దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ”మూడవది సాధించెనే మనసా ”నాల్గవది ”కాన కాన రుచిరా ” అయిదవది ఎందరో మహాను భావులు ”వరుసగా అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ విజ్ఞానమయ ,ఆనందమయ కొసలకు ప్రతీకలు గ పండితాభిప్రాయం .అంటే అయిదు మెట్లుగా బ్రహ్మానందాన్ని పొందే ప్రయత్నం అన్న మాట ఇంతకీ ఆంజనేయుడికి సంగీతానికి ఏమిటి సంబంధం ?సంగీతం రెండు రకాలు ఉత్తరాది సంగీతం దక్షిణాది సంగీతం మొదటి దాన్ని హిందూ స్తాని అంటారు దీనికి ఆద్యుడు హనుమంతుడు అందుకే దాన్ని హనుమద్గానం అని కూడా అంటారు రెండవదాన్ని కర్ణాటక సంగీతం అంటారు దీనికి నారదుడు మూల పురుషుడు కనుక నారద గానం అంటారు
తుంబుర నారద హానుమలు గొప్పసంగీత వేత్తలు ,విద్వాంసులు .అందుకే హనుమ సన్నిధి లో ఈ సంగీత రస లహరి .
గబ్బిట దుర్గా ప్రసాద్
15 -01 -1996 నశ్రీ SUVARCHALANJANEYA స్వామి ఆలయం లో ధనుర్మాసం సందర్భం గ జరిగిన పవళింపు సేవ లో మాట్లాడిన మాటలివి.

