Category Archives: కవితలు

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత వేసవిలో కడుపు ని౦డా తినటాకికి చిన్న రసాలిచ్చావ్ అవిబాగా కాయటానికి నూజివీడు ఆగిరిపల్లి మామిడి తోటలిచ్చావ్ వాటిని దించటానికి ఉగ్గాల పగ్గాలిచ్చావ్ ,రవాణాకు రోడ్లు, లారీలిచ్చావ్  అందుకే ఓ దేవుడా !నువ్వు నాకు పిచ్చపిచ్చగా నచ్చావ్ . అమ్మకోటానికి సంతనిచ్చావ్ ,అ౦దులో శివా కొట్టు నిచ్చావ్ కొనటానికి … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం  కవిత నా వీక్షణానికి  రోజా నవ్వలేకపోతోంది నా మాటల సంగీతానికి పుష్పాలు వికసి౦చ లేకపోతున్నాయ్ . తాజాదనమున్న హారపు నవ్వులేని ప్రదర్శనకు వెళ్లి ఏం ప్రయోజనం ? చీకటి రాత్రి ఆమె దువ్వుకోని తలతో ఒక్క క్షణమైనా  చందమామను చూడకపోతే? దక్షిణానిలం వసంతాలు తెచ్చినా … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత పెద్ద భవంతిలో చెదలు తిన్న కొయ్య దూలాల  గూడు వెనకాల ఒక చిన్నారి పిచుక తల్లికోసం ఏడుస్తోంది దగ్గరలో ఉన్న పొలం లో తూనీగలు పట్టే తల్లి పిచుక విన్నది ఎవడో తుంటరి వెధవ నా చిట్టి తల్లిని పట్టుకు పోవాలని ప్రయత్నిస్తున్నాడనుకొంది గుండెని౦డా ప్రేమతో … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

11-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత

1-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత ఇక్కడికి రండి పతిత ,అపవిత్ర ,బహిష్కరి౦పబడ్డ వారంతా ఇక్కడికి రండి అందరం కలిసి అమ్మవారి ని పూజిద్దాం అన్నికులాల దేశాల వారు ‘ఆమె పాదాల చెంత ప్రక్కప్రక్కన నిల్చి నిర్భయంగా చేరితే దేవాలయం ,పూజారి మత గ్రంథాలకు కట్టుబడకుండా చేరితేనే ఆ దేవతను  నిర్దిష్టంగా ఆరాధించగలం … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత నువ్వెందుకు వెనక్కి తిరిగిచూడటం  లేదో నాకు తెల్సు  దేవాలయంలో దైవ సాన్నిధ్యం కోసం ఆట బొమ్మలకు దూరంగా ఉండటానికే   నీ ఇల్లు వదిలేశావ్. హృదయంతో ఆటలాడుతున్నావని తెలీకనే నీ దనే దాన్ని దూరంగా వదిలేయటానికే అది అనంత కన్నీటికి దారి అని తెలీక నీ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత అడవి పక్కన ఎవరు నడుస్తారు ? అతడెవరో నాకు తెలుసు ననుకొంటా లయాత్మకంగా రాత్రి నిశ్శబ్దాన్నిచీలుస్తూ అర్ధరాత్రి వేళల్లో అతని చిరుగంటలమువ్వలు లేపుతాయ్ అతని వంపు తిరిగిన ముంగురులు నా హృదయ శిలపై జలపాతమై ధ్వనిస్తాయ్ . ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

 రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

7- రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత బజార్లలో నీ విలాసవంతమైన కార్లు పరుగు దీస్తున్నాయ్ నీపెద్ద నౌకలు సముద్రాలలో వాణిజ్య విహారం  చేస్తున్నాయి నీ వేగవంతమైన ఆవిరి ఇంజన్లు రైళ్లు నడుపుతున్నాయ్ దేశమంతా నీ యంత్రాలు ,మొక్కలతో నిండిపోయింది ఇవన్నీ ఎవరి వలన  నీకొచ్చాయో చెప్పగలవా  ? ఎవరి నెత్తుటితో నీ భవనాలకు ఎర్రరంగు … Continue reading →

Posted in కవితలు | Tagged | 1 Comment

5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్  ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్  ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత   ఇవాల్టి అధికారం ముళ్ళు, దెయ్యాల చేస్టలకు ప్రతినిధి అధికార దాహంతో అక్కడ రాక్షసులు ఆటాడుకొంటూ తీరిక కేకుండా ఉన్నారు భయపడకు ఓ మానవాత్మా దుఖంతో పొంగిపొరలి కన్నీరు కార్చకు పాతళలోకపు తాగుబోతు ఇక ఎంతో కాలం అక్కడ ఉండలేడు అన్యాయం, చేసిన తప్పుల ముళ్ళతో   … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మాతా ఆనందమయీ రాక –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

మట్టి విగ్రహం వెనకాల ఎంతకాలం దాగి ఉంటావు ? స్వర్గం ఈ నాడు దయా రహిత క్రూరుల చేత అణచ బడి ఉంది. దేవునిపిల్లలు కొరడా దెబ్బలు తింటున్నారు వీరోచిచ యువకులు నిర్దాక్షిణ్యంగా ఉరి తీయబడుతున్నారు భారత దేశం ఇవాళ వధ్యశిల అయింది ఇంకెప్పుడు వస్తావ్ ఓలయకారుడా ? భగవత్ సైనికులు  నేడు సుదూర ప్రాంతాలలో … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత  

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత ఓనా ప్రియాతి ప్రియా !నేను వెళ్లాల్సి  ఉంటుందని అనొద్దు. నాతో ఆటలాడ వద్దు వద్దు వద్దు వద్దు . ఇవాళ తోటలో పూలు చెప్పని  భావాలతో శ్రుతికలుపుతున్నాయ్ వాటిని నేను సిగ్గుతో ,బాదితభావాల వలన  చెప్పలేకపోతున్నాను. ఈ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చి నన్ను చుట్టేసిందో … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

కొత్త కొలువుకూటం 

కొత్త కొలువుకూటం  ఈ మధ్యదాకా ”గౌరవ సభ ” నలభై రోజుల్నించి ”కౌరవ సభ ” ఇప్పటిదాకా ”పూతు ”సభ  ఇప్పుడేమో ”బూతు సభ ” మొన్నటిదాకా ”అమ్మ ”కు వందనం  నేడేమో ” నీయమ్మా నీ యాలి ”లకు అందలం   ఇంతవరకు ప్రజా పాలనే ధ్యేయం  ఇప్పుడు ”విధ్వంసం కూల్చివేతలే ”ఆదర్శం   మాటకు  చేత … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -2

శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -2 సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి 4-లయన్ శ్రీ బందా వెంకటరామారావు –విజయవాడ -9393483147 ఆశించి భంగపడిన ఆంధ్రమాత ? ప్యాకేజీలకై ఆశించి భంగపడిన అధికార పక్షం ప్రత్యేకహక్కులకై … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ విళంబి ఉగాది కవి సమ్మేళన కవితలు 

శ్రీ విళంబి ఉగాది కవి సమ్మేళన కవితలు  సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి 1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375 దగా దగా దగా ఆది నుంచి దగా దగా దగా రాచకీయ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

ఏక వీర శివకుమారి ఆశీరభినందనలు

సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో విశ్వనాథ వారి ‘’ఏక వీర ‘’నవలపై గంటన్నర సేపు ఏకదాటి ప్రసంగం చేసిన శ్రీమతి బెల్లం కొండ శివ కుమారికి కవుల ఆశీరభినందనలు 1-శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం –విజయవాడ -99859 732 39 1-జ్ఞాన పీఠాధిపతివిశ్వనాథ కవి వ –రేణ్యు నవలా … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు

విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు ఈ సారి విలంబి ఉగాదికి హోసూరు తెలుగు వారు 53 కవితల  ‘’అనపపువ్వులు ‘’పూయించారు .అనుములు ఒకరకమైన ధాన్యం అని అనుకొంటాను .వాటిపూలు తెల్లగా స్వచ్చంగా మన చిక్కుడు పూలలాగా ఉంటాయని పిస్తోంది .రాయలసీమలో అనపకాయల వాడకం ఎక్కువ అని తోస్తోంది .కనుక అర్ధవంతమైన నామ ధేయం ఈ కవితా … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు

కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు అన్న చందంగా ఉంది మన భారతీయ బ్యాంకుల స్థితి . కస్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి నగానట్రా కుదువబెట్టి ,పొలం పుట్రా అమ్మేసి ఆపత్కాలం లో  అదనుకు ఆదు కుంటుందని నమ్మకం తో బాంకుల్లో ఆశగా కూడ బెడితే అనాయాసం గా మోసం చేసి దోచుకుని ప్రజల ,బాంకుల ,ప్రభుత్వాలనెత్తిపై శటగోపం … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

గణ తంత్ర లో తంత్రమే మిగిలింది 

గణ తంత్ర లో తంత్రమే మిగిలింది ఇన్నేళ్ల గణ తంత్రం లో మిగిలింది అన్నిటా తంత్రమే అదీ  దుస్తంత్రమే మనపాలిటి దౌర్భాగ్యమే    మర్చిపోయింది జన గణమన్సులనే    జనగణన ”తలల లెక్కింపు ” ప్రతి ఎన్నిక ముందూ తప్పని సరే  ఓట్లు రాల్చుకోటానికి నోట్లు పంచుకోటానికే  గణతంత్ర వేడుక రాష్ట్ర పతి ముందు రోజు తీపి కబుర్లతో  … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

 సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2

సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2 24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -2 6-శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు –గుంటూరు -9573423303 సాహితీ బంధం మనుషులను కలిపి –మనసులను ముడి వేసి –మురిపింఛి మెరిపించు దివ్యౌషధము –సాహిత్యము . ఎల్లలను చెరిపేసి –ఎల్లవారికి … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు

             సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు 24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు 1-       సహజ కవి డా ఐనాల మల్లేశ్వరరావు –తెనాలి -9347537635 సీ –‘’సాహితీ బంధంబు సత్సంగముం బెంచి-సచ్ఛీల సుధలను చవుల జూపు సాహితీ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం పై కవితలు

అందరికి వందనం -సరసభారతి అనేకమంది కవులను ఆహ్వానించి వసుధైక కుటుంబం పై కవి సమ్మేళనం ను హేవిళంబి ఉగాది వేడుకలనాడు నిర్వహించిన సంగతి అందరికి తెలుసు .ఆ కవితలను పుస్తక రూపం గా తెచ్చే ప్రయత్నాన్ని శ్రీ వసుధ బసవేశ్వర రావు గారికి అప్పగించాం .ఇంకా ఎక్కువ మంది కవుల కవితలను కూడా చేర్చాలనే సంకల్పం … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం

 వసుధైక కుటుంబం మిత్రులారా మిత్రత్వం తో సేవ చేద్దాం రండి అందరి హృదయాలను గెలుద్దాం రండి ఇతరులూ మనలాంటి వారేనని గ్రహిద్దాం  స్పర్ధ ,ఘర్షణ శాశ్వతంగా విడనాడుదాం అనవసర పోటీ మనస్తత్వాన్ని త్యజిద్దాం సాటివాడి సర్వస్వాన్నీ బలం జులుం తో దోచుకొనే ఆలోచనకు స్వస్తి చెబుదాం మన భూమాత సకలం ఇచ్చే కల్ప వృక్షం కోరికలు … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా రెండున్నరేళ్ళ ఆరటమై వేచి ఉన్నాను హోదాకు నే చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా నీ వెంట నే తిరుగుతున్నానుగా … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి ‘’నువ్వైనా చెప్పవమ్మ సాంబనువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికిశివుడికి ‘’అన్న తనికెళ్ళ భరణి పాటకు పేరడీ ‘’నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి  – నువ్వైనా రద్దు చేస్తే వచ్చే కష్టం నష్టం  తెలియ లేకనే దబాయింపు సెక్షన్ లో పడిలొల్లి లొల్లి … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది . ‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మోతాదు మించిన మోదుడు

మోతాదు మించిన మోదుడు మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు ఏదో పొడి చేస్తాడనుకొంటే  పొడిచి పారేశాడు సామాన్యుడిని ,ముసలి ముతకా  బీదజనాన్ని రోడ్డున పడేసి రద్దు తో మోదీ జనాన్ని మోది మోది బాది పారేసి లబోదిబో మనిపించాడు . నల్ల కుబేరుల నేమీ పీక లేక నలుపు తెలుపౌతుందని నమ్మి అడ్డ దిడ్డంగా అర్ధ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

శని రాత్రి –కవిత

శని రాత్రి –కవిత         19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత.           అనిలం తో అనలం … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

‘మా అన్నయ్య’ – కవితా సంకలనం మీద పద్య స్పందన

18.11.2016 సాహిత్యాభిమానులైన మిత్రులకు, శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ, గారి అభినందన లేఖా మకరందము నమస్కారములు !  నేను ఈమధ్య ‘మా అన్నయ్య’ అనే కవితా సంకలనం మీద నేను రాసి పంపిన  సమీక్షను మీరు చదివే ఉంటారు. అందులో ప్రస్తావించిన కొన్ని కవితా మకరందాలను ఆస్వాదించి, ప్రముఖ కవి, పండితులు, మిత్రులు శ్రీ రామడుగు … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5

 అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5 18-18 పురాణాలూ చెప్పగల సమర్ధులు     ఒకదాని లోంచి ఇంకోదానిలోకి దూకే మహనీయులు     ఏది మొదలెట్టి ఏమి చెబుతున్నారో అర్ధంకాని అసహాయులు    ఈ మధ్యే ‘డ్రాయర్ పురాణం ‘’అరగంట సుమారు చెప్పారట    అసలు విషయం కంటే ఏదైనా చెప్పగల సమర్ధులు    భర్త స్నానం చేసి … Continue reading →

Posted in కవితలు, రచనలు | Tagged , | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-4

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-4 16-ప్రధాని గా ఉన్నాయన  చేస్తున్నది గారడీ మోళీ  మాట మార్పు క్రియా శూన్యతా విశ్రు౦ఖల కేళీ చట్టసభల్లో పదే పదేచెప్పిందే చెయ్యలేని కంగాళీ సభల్లో ఉపన్యాసపు హోరుతో ఆడే హోళీ క్రియా శూన్యత్వం లో అగ్రగామిగా నిల్చిన రించోళీ ఇలా అయితే కొద్దినెలల్లోనే పార్టీ అయిపోతుంది  ఖాళీ పార్టీ కాషాయానికి, … Continue reading →

Posted in కవితలు | Tagged , | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3 11-ఎన్టి .ఆర్ .కు భారత రత్న ఇవ్వండి   ఎ.యెన్ .ఆర్ .కు ఇంకేదో ఇవ్వండి అని అడిగేవాళ్లే కాని నాటి మహానటులు  నాగయ్య గారి కి బళ్ళారి రాఘవ గారికి గౌరవ స్థానం ఇవ్వమని అడిగేవారు లేరు   కనీసం నందీఅవార్డ్ లను నాగయ్యస్మారక ,రాఘవ స్మారక  అవార్డ్ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2 3-ఆఘమేఘాలమీద రాజధాని అమరావతి   ఉందోలేదో తెలియక పోయినా అనుమతి     బొక్కసం బొక్కే అయినా కేంద్రం  విదిలించకున్నా పరాయి దేశాల పుణ్యమా అని సాగిపోతోంది అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి . 4-గ్రాఫిక్స్ కే పట్టం కట్టి ఇచ్చారు బహుమతి ‘’బాహు బలికి ‘   … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి

అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి 1-రేపు ‘’పవన్ ‘’కమలం నెత్తి మీదెక్కుతాడు   ‘’జగన్ ‘’ను దువ్వకపోతే నెత్తిన ‘’చేతులే ‘’ కమలం సైకిల్ దోస్తీ మహా అయితే ఇంకో ఏడాదేమో అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి . 2-గడ ఎక్కి ముద్ర గడ దూకుతానని బెదిరింపు  మధ్యలో తోకముడిచి ఎప్పుడూ కుంటి సాకుతో జంపు లేస్తే … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

‘ మా అన్నయ్య ”ఆత్మీయ కవితా స్రవంతి-7

33-అందరికన్నా నా అన్న మిన్న –శ్రీ చింతపల్లి వెంకట నారాయణ –కైకలూరు -9441091692 త్రేతాయుగం లో లక్ష్మణుని అన్న శ్రీ రాముని కన్నా ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని అన్న బలరాముని కన్నా కలియుగం లో శ్రీనివాసుని అన్న గోవిందరాజుల కన్నా వర్తమాన కాలం లో తెలుగు యువత అన్న ఎన్ .టి.ఆర్ .కన్నా … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -5

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -5 21-కష్ట జీవి అన్నయ్య – శ్రీమతి కోనేరు కల్పన-విజయవాద -9246493712  అన్నయ్యంటే ఆత్మాత్మ బంధువు –ఒక అపురూప ఆనంద తారంగం ‘’మా అన్నయ్య ‘’అని అంటుంటే కించిత్ గర్వం కూడా నాన్న అంట అండ –అందమైన భరోసా కూడా అలాంటి అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు ఉన్న … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4

  మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4 15-ఆత్మ బంధువు అన్న –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం -9849812443 సి –అమ్మానాన్నల యనురాగ మార్ణ వమైన – అన్నయ్య అనురాగ మంబరమగును అన్నయ్య కురిపించు  అనురాగ వర్షమ్ము అంబు దమ్ముల తీరు హర్ష మొసగు సాదరంబాగు మామ సోదరున్ సందిట –బాలార్కుని కిరణ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3

   మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3 11- ఆత్మీయ అనురాగ పుంభావ మూర్తి అన్నయ్య –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీపట్నం -9247558854 ఊహ తెలిసిన నుంచి ఉద్యోగ భారంతోనో ,వయసు దూరం తోనో నాన్న నాకు అరుదుగా కనిపించే వ్యక్తి అయినపుడు ‘’అన్న ‘’అంటే అందుబాటులో ఉండే’’ నాన్నే ‘’నని పించేది … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2

    మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2          5-అన్నయ్యకు స్వాగతం –కుమారి .మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ –ఉయ్యూరు -9666020842 ఓ విలక్షణ మైన ప్రేమ స్వరూపం అన్నయ్య జీవిత ప్రయాణం లో ఓ తోడు అన్నయ్య ఆడపిల్లలకు పుట్టింటి బలం అన్నయ్య అమ్మానాన్న ల అనురాగ రూపం అన్నయ్య అందుకే … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి

మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి సరాసభారతి  ,శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది .వేడుకల సందర్భంగా 3-4-2016 ఆదివారం  ‘’మా అన్నయ్య ‘’శీర్షిక పై నిర్వహించిన ఆత్మీయ కవి సమ్మేళనం లో వెల్లి విరిసిన కవితా స్రవంతి-            ఉయ్యూరు విశిష్టత –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ -9908344249 శా-ఉయ్యూరా !ఇది పండితుల్ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

సంఘం – బందా వేంకట రామారావు

Posted in కవితలు | Tagged | Leave a comment

స్వాగతం లో సునామీ -కవిత ,నిరసన గళం వినిపించిన కవిత -,అమరుడు కాదు అర్జునుడు

  

Posted in కవితలు | Tagged | Leave a comment

డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారి 2016నూతన సంవత్సర శుభా కాంక్షలు

శ్రీ వెంకటేశ్వర శర్మగారికి ఈ ఉదయం ఫోన్ చేసి కొత్త సంవత్సరం పై కొత్త పద్యం ఏదైనా ఉంటె చెప్పమని అడిగితె వెంటనే ఫోన్ లోనే 8 పంక్తుల తేట గీతి పద్యాన్ని చెప్పారు .మీకోసం వారి పద్యాన్ని అందిస్తున్నాను –  నూతన సంవత్సర శుభా కాంక్షలతో –దుర్గా ప్రసాద్ -తే .గీ -”రెండు వేల … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1

’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1 48వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ‘’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1 వేదిక –టాగూర్ గ్రంధాలయం –విజయవాడ తేది ,సమయం -18-11-15-బుధవారం –సాయంత్రం -6గం లకు నిర్వహణ –రమ్యభారతి ,సరసభారతి, మల్లెతీగ సాహితీ సంస్థలు కవితలు 1-ఐతే ఒకే –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

ఓ ఆత్మీయ అంకురం – బందా

ఓటరు అనబడే అశ్వికునికి తనను మోసే(ఎన్నుకుని ఆధికారాన్ని అందించిన)జవనాశ్వమంటే ఎంతో ఇష్టం — కానీ తనకు కావల్సిన మార్గంలో ఆ అశ్వం వెళ్ళేందుకు అప్పుడప్పుడూ అదిలిస్తూ వుండాలి —  అలాగే ఓటరు అనబడే మావటికి తన మదగజమంటే ఎంతో ఇష్టం , కానీ తన లక్ష్యసాధనలో అంకుశాన్ని వినియోగించి ఆ  మదగజాన్ని నియంత్రించాలి — అదే … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

కలాం కు సలాం చేస్తూ—–బందా

Posted in కవితలు | Tagged | Leave a comment

జననం – మరణం – బందా

జన్మదినాన  మరణించే ముష్కరుడొకరు !  జనన మరణాలను జయించిన మాన్యుడు మరొకరు !   జననానికి ముందు వుండదు మతం !   మరణించిన పిమ్మట మతం గతం  !    ఈ జనన మరణాల మధ్యనే  మతం !    ఆ మతం సర్వ సమ్మతం కావాలి !!     ఇది త్రికాల వేదం … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment