Tag Archives: కిరాతార్జునీయం

కిరాతార్జునీయం-.41(చివరి భాగం )

  కిరాతార్జునీయం-.41(చివరి భాగం ) 18 వ చివరి సర్గ -2(చివరి భాగం ) అర్జునుని సఫలత చూసిన ప్రమథగణం అతని తపస్సును ఫలితం మహా గొప్పదని కీర్తించారు –‘’తపసికృత ఫలే ఫలజ్యాయసీ –స్తుతిరివ జగదే హరేఃసూనునా ‘’.అర్జునుడు ప్రత్యక్ష మహా దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు –‘’ఓ శంకరా !పరమ దయామతివి ,భక్తసులభుడవు ,,శరణమిచ్చే వాడివి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం -40 18 వ చివరి సర్గ -1

కిరాతార్జునీయం -40 18 వ చివరి సర్గ -1 తన భుజబలం శివునిపై ప్రదర్శించాలనుకొన్న అర్జునుడిని  శివుడు ముద్గరం అనే ఇనుప ఆయుధం  వంటి పిడికిలితో పొడిచాడు –‘’ధనురపాస్య సబాణధిశంకరః –ప్రతి జఘాన ఘనైరివ ముష్టిభిః’’ .కిరాతార్జునులు  ముష్టి యుద్ధం చేస్తూ వ్రేళ్ళతో చేతులు చరఛి పట్టుకొ౦టే కలిగిన బండరాళ్ల వంటి ధ్వని పర్వత గుహలలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం ) ప్రతీకార  సమర్ధుడైన పార్ధుని చేయి ఆ సమయం లో  సాయ పడకపోయినా ,పూర్వపు ఉపకారం తలచుకొని అమ్ములపొది నుంచి అతి కష్టంగా వేరు పడింది .కృతజ్ఞుడైన సత్పురుషుడు మొదట ఉపకారం చేసిన వాడైనా ,తత్కాలం లో ఉపయోగపడని మిత్రుడిని వదలటం సహజమే .-‘’పరాన్ముఖత్వేపి కృతోపకారా—త్తూణీ ముఖాన్మిత్ర కులాది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.38 17వ సర్గ -2

కిరాతార్జునీయం-.38 17వ సర్గ -2 అత్యంత లాఘవంగా సునాయాసంగా బాణాలు వదులుతున్న అర్జునుడు ప్రమథులకు ,కంటి దోషమున్నవారికి ఒకే చంద్రుడు అనేక బింబాలుగా కనిపించినట్లు ,అనేకంగా కనిపించాడు –‘’శశీవ దోషావృతలోచనానం –విభిద్యమానః ప్రుథ గా బభాసే ‘’.సేన దయనీయం చూసి శివుడుకూడా క్షోభ చెందాడు .పెద్ద చెరువే అయినా తరంగాలవలన సూర్యబింబం వణుకుతున్నట్లు – శివుడి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.37 17వ సర్గ -1

కిరాతార్జునీయం-.37 17వ సర్గ -1 ప్రయోగించిన అస్త్రాలన్నీ వ్యర్ధం కాగా ,తనప్రియ గాండీవం ద్వారా ధైర్యాన్ని పెంచుకొన్న అర్జునుడిపౌరుషం  బాగా అతిశయించింది –‘’ధృతం గురు శ్రీర్గురుణాభి పుష్యన్ –స్వపౌరు షేణేవ శరాసనేన ‘’.గొప్ప పరాక్రమ శీలితో తాను  యుద్ధం చేస్తున్నందుకు సంతోషించాడు కాని శత్రువు వృద్ధి బాధించింది .పర్వతం పై మండే అగ్నిలా కనిపించాడు .పొగ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.36 16 వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.36 16 వ సర్గ -3(చివరి భాగం ) అర్జున సర్పబాణ సముదాయం వలన సిద్ధులు ,పక్షులు సంచరించే మార్గం ఆగిపోయి ,అగ్ని అన్ని వైపులకు వ్యాపించటం చేత దిక్కులు పొగతో నిండిపోయాయి .శత్రువులు ముట్టడించిన నగరం లాగా ఆకాశం కనిపించింది .-’’’వృతం నభో భోగి కులైరవస్థా౦-పరోపరుద్ధస్య పురస్య భేజే ‘’.శివుడు వెంటనే గారుడాస్త్రాన్నిసర్పాల బాధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.35 16 వ సర్గ -2

కిరాతార్జునీయం-.35 16 వ సర్గ -2 అర్జునుడు ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి కిరాత శివునిపై గణాధిపతి పౌరుషం పోగొట్టే ‘’ప్రస్వాపనాస్త్రం ‘’అంటే గాఢ నిద్ర నిచ్చే అస్త్రం ప్రయోగించగా అర్ధ రాత్రి చీకటి దట్టంగా అంతటా వ్యాపించింది .-‘’స సంప్రధార్యైవ మహార్య సారః –సారం వినేష్యన్ సగణస్యశత్రోః-‘’.ప్రస్వాపనాస్త్రం ద్రుతమాజహార –ధ్వాంతం ఘనానద్ధ ఇవార్ధ రాత్రః’’ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  కిరాతార్జునీయం-.34 16 వ సర్గ -1

  కిరాతార్జునీయం-.34 16 వ సర్గ -1 కిరాత వేష శివుని అసాధారణ రణనైపుణ్యాన్ని చూసిన అర్జునుడికి కోపం వచ్చి,తాను  యుద్ధం లో గెలవక పోవటానికి కారణాలు ఊహించటం మొదలు పెట్టాడు -ఇలా అనుకొన్నాడు ‘’ఈ యుద్ధంలో మదజలం కారే పర్వతాలవంటి,యుద్ధ కష్టం తెలిసిన  ఏనుగులు కనిపించటం లేదు .ఎత్తైన పతాకాలతో రంగులతో సూర్యకాంతిని నానా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.33 15వ  సర్గ – 4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.33 15వ  సర్గ – 4(చివరి భాగం ) శివుడు అర్జున బాణ మేఘాన్నితన బాణాలతో తొలగించాడు .అర్జునుడికి దీటుగా బాణ ప్రయోగం చేశాడు శివుడు .శివుడి బాణాలు తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తాయి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జున ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది శృ౦ఖలా  యమక శ్లోకం .శివ బాణాలు స్వర్గ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.32 15వ  సర్గ – 3

కిరాతార్జునీయం-.32 15వ  సర్గ – 3 కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్తమ  పరాక్రమ వంతులు .ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రువు తీవ్ర ఖడ్గంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధభారం వహించగల దిట్ట ఎంతటి శత్రువుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.31 15వ  సర్గ – 2

కిరాతార్జునీయం-.31 15వ  సర్గ – 2 కుమార స్వామి శివ సేన పారిపోవటాన్ని చూసి మందలిస్తూ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపోయి వచ్చారు ?మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు .రజోగుణమున్న కేవల మానవ మాత్రుడు.-‘’‘నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం ) ‘’అర్జున తపస్వి శాంతం మొదలైన గుణాలతో వశీకృతమైన దేవతలుఅతడికి భయపడి , మనకు కనిపించకుండా మనపై బాణాలు వేస్తున్నారా ?లేకపోతే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపోతోంది శివ సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.29 చతుర్దశ సర్గ -3

కిరాతార్జునీయం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.28 చతుర్దశ సర్గ -2

కిరాతార్జునీయం-.28 చతుర్దశ సర్గ -2 కిరాతునితో కిరీటి ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’మీ రాజు నా స్నేహానికి యోగ్యుడు అని ఎలాచచెప్పగలవు ?అతడికి మునులంటే ఈర్ష్య .గుణోన్నతులైన వారిని ద్వేషించే విరోధులు సజ్జనులకు ఎప్పుడూ శత్రువులే –‘’సఖా న యుక్తః కథితఃకథం త్వయా –యదృచ్ఛయా సూయతి యస్తపస్యతే –గుణార్జనోచ్ఛ్రాయ విరుద్ధ బుద్ధయః –ప్రకృత్యమిత్రా హి సతామసాధనః … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.26 త్రయోదశ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.26 త్రయోదశ సర్గ -3(చివరి భాగం )  శివుడు పంపిన భిల్లుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు ‘’సూర్య తేజస్సు ను మించిన నువ్వు వరాహాన్ని చంపిన మా నాయకుడి బాణాన్ని అపహరించటం తగిన పనికాదు.మనువు మొదలైన వారు ఉత్తమ మార్గాలను బోధించారు. నువ్వే అధర్మగా ప్రవర్తిస్తే మిగతావారి సంగతేమిటి ?ఆత్మజ్ఞానులైన యతులు జనన మరణాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.25 త్రయోదశ సర్గ -2

కిరాతార్జునీయం-.25 త్రయోదశ సర్గ -2 శంకరుని బాణం రెక్కల నుంచి వచ్చిన ధ్వని పాములపై గరుత్మంతుని  దాడి లాగా హృదయాన్ని చెవుల్ని భేదిస్తూ ప్రతిధ్వనించింది .శివుని మూడోకంటి అగ్ని జ్వాలలాగా పిశంగ(ఎరుపు ) వర్ణపు కాంతితో ప్రకాశిస్తూ అత్యంత వేగంగా వస్తూ ఆకాశం లో పిడుగులు పడినట్లు అనిపించింది .-‘’నయనాదివ శూలినః ప్రవృత్తై-ర్మనసోప్యాశుపరంయతః పిశంగైః-విదధే విలసత్తడిల్లతాభైః-కిరణైర్వ్యోమని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.24 త్రయోదశ సర్గ -1

కిరాతార్జునీయం-.24 త్రయోదశ సర్గ -1 అర్జునుడు దగ్గరకొస్తున్న సూకరాన్ని చూశాడు .అది చీల్చటానికి వీల్లేని పర్వతంలా ,రెండు కోరలతో భయంకరం గా ఉంది .కోపం తో నిక్క బొడుచుకున్న జడలతో విజయమే ప్రధానంగా మిగతా వ్యవహారాలూ మాని వస్తున్న పందిని అర్జునుడు చూసి ,అనమాని౦చగా, మనసులో అనేక ఊహలు తోచాయి .అది ముట్టెతో బలిసిన చెట్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.23పన్నెండవ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.23 పన్నెండవ సర్గ -2(చివరి భాగం )   మహర్షులు దర్శించిన శివుడు హిమాలయం పై ఉండటం తోపర్వతాలు సముద్రాలు ఆకాశం దిక్కులు అన్నిటినీ కల్గిన ఈ విశ్వాన్ని తన ప్రకాశం తో వ్యాపించి నట్లున్నాడు .రెండు మోకాళ్ళు చేర్చి భయంకర శేషుడనే సర్పం తో చుట్టి ఉన్న శంకరుడు సూర్యకా౦తితో లోకాలోక పర్వతాల దాకా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.22      పన్నెండవ సర్గ -1

కిరాతార్జునీయం-.22 పన్నెండవ సర్గ -1 ఇంద్రుడు అంతర్ధానమయ్యాక,ఇంద్ర తనయుడు సంతోషం తో అలసట లేకుండా శంకరుడిని మెప్పించటానికి తపస్సు ప్రారంభించాడు .సూర్యునికి ఎదురుగా ఒంటికాలిపై నిలిచి ,బాహ్యాభ్యంతర శుచితో జయమే లక్ష్యంగా ,నిరాహారుడై ఎన్నో రోజులు దీక్షగా తపస్సు చేశాడు –‘’అభి రశ్మి మాలి విమలస్య ,ధృత జయ ధృతేరానాషు షః-తస్య భువి బహు తిథాస్తిథయః.ప్రతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.21      పదకొండవ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.21 పదకొండవ సర్గ -4(చివరి భాగం ) అర్జునుడు ముసలి తాపసి వేషంలో ఉన్న ఇంద్రునితో ఇంకా చెబుతున్నాడు ‘’మనిషి అభిమానం తో ఉన్నంతకాలం సంపద నిలుస్తుంది .కీర్తికూడా స్థిరంగా ఉంటుంది .మానహీనుడు యశోహీనుడు ,సంపత్ హీనుడౌతాడు.వాడికి లోకం లో ఇంకేమీమిగలదు .—తావదాశ్రీ యతే లక్ష్మ్యా –తావదస్య స్థిరం యశః -పురుష స్తావదేవాసౌ యావన్మానాన్నహీయతే ‘’ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.20    పదకొండవ సర్గ -3.

కిరాతార్జునీయం-.20         పదకొండవ సర్గ -3. అర్జునుడు ఇంద్రుడితో’’ఇలాంటి ప్రియవచానాలు ఎవరు చెబుతారు .నీలాంటి బుద్ధి మంతులకు  తప్ప మరొకరికి సాధ్యం కాదు ‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.19      పదకొండవ సర్గ -2

  కిరాతార్జునీయం-.19 పదకొండవ సర్గ -2  ఇంద్రుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రాణుల్ని చంపి చంచలమైన సంపదలు పొందేవాడు నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లుగా ఆపదలకుఆశ్రయమౌతాడు .-‘’ఉదన్వానివ సి౦దూనామాపదామేతిపాత్రతాం .’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తాయి .దాన్ని రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు, దుఖం మరొకటి లేదు .ఆపదల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.18      పదకొండవ సర్గ -1    

కిరాతార్జునీయం-.18 పదకొండవ సర్గ -1  ఇంద్రకీలం నుంచి జండా ఎత్తి స్వర్గం వెళ్లి ఇంద్రునితో అర్జునముని   జితేన్ద్రియత్వాన్ని చెప్పగా, ఆయన చాలా  సంతోషంపొంది ,ఆశ్రమానికి వృద్ధముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో  ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రుని అర్జునుడు చూశాడు .తెల్ల వెంట్రుకలు జడలు కట్టి,అస్తమయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త  ఏందు కరైరహ్నః పర్యంత ఇవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.17      దశమ సర్గ -3(చివరి భాగం )   

కిరాతార్జునీయం-.17 దశమ సర్గ -3(చివరి భాగం ) అర్జునునిపై అప్సరసలు నిల్పిన చూపులో రసభావాలు లేనేలేవు .చేతులు అభినయించలేదు .చూపు అర్జునునిపైనే నిలిచిపోయింది తప్ప మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్లవం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-సితతురగే  న చచాల నర్తకీనాం ‘’.పాదాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.16      దశమ సర్గ -2            

కిరాతార్జునీయం-.16 దశమ సర్గ -2 అన్ని దిశలా అర్జున పుష్పాలు వికసి౦చటం తో దాని పరిమళం వ్యాపించి ,అంతా కామ వికారం పొంది ,ధైర్యం సడలి కొత్త అనుభవం పొందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్తరాగాలతో గళమెత్తిగానం చేస్తోంది –పరి భ్రుత యువతిః స్వనం వితేనే –నవనయోజిత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15 దశమ సర్గ -1 తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం ) ప్రియునితో కొత్త కలయికతో ఒక నాయిక ఒళ్ళు గగుర్పొడిచి,చెమట పొటమరించి ,అలాగే గుండెపై పడుకొన్నది .అలంకారం చెదిరినా అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పోగొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని ఆపలేక పోయాయి అంటే సరి పోతుంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2 చంద్రుడు దగ్గరకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పోగొట్టుకొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస పీల్చుకొన్నట్లున్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః ‘’.స్వచ్ఛ పగడ కాంతి కళలతో నాలుగువైపులా అంధకారాన్ని దూరం గా పైకి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1

  కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1 జలక్రీడల తర్వాత ప్రియుల పొందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొరలగ ముత్యాలహారం కదలికగా కాంతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం ) చిగురాకులు కోయటం తో అచ్చరల చేతులు ఎర్రబడ్డాయి .పుప్పొడి అంటి పాలిండ్లు పసుపు రంగు పొందాయి. పూల వాసనతో శరీరాలు పరిమళం పొందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రుళ్ళి పడుతున్నారు. ఏనుగు తొండం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1 తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దేరారు .ఆనగరం నానా వర్ణాలతో ఇంద్ర ధనుస్సును తలపిస్తోంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం చేస్తుంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై  ప్రసరించి విద్యుత్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం ) ఇంద్రకీలం పై సమతల నదీ తీర ప్రదేశం మీదఇసుకలో  గుర్రాలు దిగాయి .ఆకాశ గమనం లో ఆరితేరినవి కనుక వాటికి సమతలం చేరటం సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తులు స్పష్టంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు మేఘ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1 దేవేంద్రుడికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దేరారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం  మరింత పెరిగింది .ఆ అందం చూడటానికి సహస్రాక్షుని కళ్ళు చాలటం లేదు.  ఇంద్రుని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో  బయల్దేరారు .ఆ ధ్వని విమానాల్లోంచి ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -2.

  కిరాతార్జునీయం- ఆరవ సర్గ -2. పూల కోసం చిగురాకుల దోసిళ్ళతో చెట్లను వంచుతూ ,పడుకోవటానికి కొత్త మెత్తని లేబచ్చిక తో భూమిని కప్పుతూ అనుకూల వాతావరణం ఏర్పాటు జరిగింది .మేఘాలు లేని ఆకాశం నుంచి జారే నీటి బిందువులు నేలపై దుమ్మును అణచి వేశాయి .తపో నిమగ్నుడైన క్రీడికి అన్నీ ప్రశాంత వాతావరణం కలిపిస్తున్నాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1.

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1. ఇంద్ర కీల పర్వతం చేరిన ఇంద్ర తనయుడు అర్జునుడు బంగారు రంగు చరియలతో ఉన్న శిఖరాన్ని చూసి ,గంగానదికి ఎదురుగా వెడుతూ విష్ణుమూర్తి గరడుని పై అధిరోహించినట్లు   అధిరోహించాడు.తుమ్మెదల ఝ౦కారమే  జయజయ ద్వానాలుగా, గాలికి వంగి ఊగుతున్న  పూల చెట్లే వంది మాగధుల్లా పూలతో అభిషేకించాయి .-‘’పవనేరి తాకుల విజిహ్మ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-3(చివరి భాగం)

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-3(చివరి భాగం) . శంకరుడు పార్వతి పాణి గ్రహణం చేసేటప్పుడు శివుడి చేతి కంకణం వంటి సర్పం జారి పడితే , భయపడిన  శుభావహమైన ఓషధులున్నపార్వతి చేతిని గ్రహించాడు .ఆమె చూపులూ భయం పొందాయి –‘’విన్యస్త మంగళ మహౌషధరీ శ్వరాయ –స్రస్తోరగ ప్రతి సరేణ కరేణ పాణిహ్’’.పర్వత మణి కాంతులు ఆకాశం లోకి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-2.

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-2. యక్షుడు అర్జునునితో ‘’తెల్లని మంచు తో ఉన్న హిమవన్న గ శిఖరాలు ఆకాశాన్ని అనేక భాగాలుగా చేస్తున్నాయి .అంటే ఈ పర్వతాన్ని చూసిన వారి పాపాలు తొలగిస్తోంది .పర్వతం మధ్యభాగం లోని వృక్షా లెక్కిచూసి  దాన్ని కొంచెం గా నే వర్ణించ గలం.వేదాలు కూడా పరమాత్మను కొంచెమే పరిచయం చేయగలవు .బ్రహ్మ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-1

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-1 . హిమాలయం చేరిన అర్జునుడు అది మేరు పర్వతాన్ని జయి౦చా లనే కోరికతో అంటే దిగంతాలకు వ్యపించాలనే ఉత్కంఠ తో అంతటి ఎత్తుకు ఎదిగిందా అని పించింది .దానికి మూడు కారణాలు కనిపించాయి అతనికి .ఒక వైపు సూర్య కిరణాలతో ప్రకాశిస్తూ,మరో వైపు దట్టమైన చీకటి ఆవరించి ఉంది .ముందువైపు అట్టహాసంతో ప్రకాశిస్తూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-12

వేద వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’నీ శత్రువులు అపకారం చేసినాఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉండటం వలన  నీ ప్రజ్ఞా సౌశీల్యాలు లోకానికి తెలిశాయి .వాళ్ళు అట్లా అపకారం చేసి ఉండకపోతే లోకానికి నీ గొప్పతనం  తెలిసేది కాదు .కనుక వాళ్ళ అపకారం నీకు ఉపకారం అయింది అంటే శత్రువులుకూడా ఒక్కోసారి ఉపకారులౌతారన్నమాట .శత్రువులకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- నాల్గవ సర్గ- 2.

కిరాతార్జునీయం- నాల్గవ సర్గ- 2. యక్షుడు శరదృతు వైభవాన్ని అర్జునుడికి అడగకపోయినా వివరించాడు ‘’శుభం భాగ్యం ఇచ్చే ఈ శుభ సమయం లో పనుల ఫలితం కలిగి కృతర్ధత లభిస్తుంది .నిర్మలమైన నీరు ,నీరు లేని మేఘాలున్న ఈ శరత్తు మీకు జయం చేకూరుస్తుంది అర్జునా !ఇప్పటిదాకా వర్షర్తు గొప్ప ప్రేమతో లోకాన్ని ముంచింది .ఇప్పుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం నాల్గవ సర్గ .

కిరాతార్జునీయం నాల్గవ సర్గ . పాశుపాతాస్ర సాధనకోసం అర్జునుడు యక్షుని తోడుగా తీసుకొని ఇంద్ర కీలాద్రి చేరాడు .అక్కడ కనిపించిన ప్రకృతి  సౌందర్య వర్ణననమే చతుర్ధ సర్గలో మహాకవి భారవి వివరించాడు.ఆ  అందాలు అనుభవిద్దాం చెలికత్తెల సముదాయం లో యవ్వనం లో ఉన్న ప్రియురాలిని నాయకుడు చేరుకున్నట్లు ,లోకులకు ఇష్టుడైన అర్జునుడు పచ్చగా పండి వరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-14

కిరాతార్జునీయం-14 ద్రౌపది అర్జునుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొంది ,శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-13

కిరాతార్జునీయం-13 అర్జునుడు ఇంద్రకీలాద్రిపై  తపస్సు చేయటానికి వెళ్ళబోగా దుఖం భరించలేని ద్రౌపదీ దేవి కన్నీరు నిండగా  ,నల్లకలవలపై మంచు బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రాలు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో మూసుకోలేకపోయింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జునుడు గ్రహించాడు .అర్జునుని చేరి  గద్గద కంఠం తో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-11

కిరాతార్జునీయం-11 ఈ విధంగా శత్రువులచే పొందిన అపకారం, అవమానాలకు క్షుభితుడైన భీమసేనుడిని పరమ శాంత, రాజనీతి విషయాలతో యుధిష్టిరుడు ఊరడిస్తున్న సమయంలో కోరిన మనోరధం మూర్తీభవించి తనంత తానె వచ్చినట్లు  వేదవ్యాసమహర్షి అరుదెంచాడు .పరస్పర విరోధం కల పశు పక్ష్యాదులను తన శాంత దృష్టితో విరోధం పోగొట్టి ,ప్రేమకలిగిస్తూ ,సమస్త పాపక్షయ కర తేజస్సు వెదజల్లుతూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-10

కిరాతార్జునీయం10 ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment