ఆలోచనా లోచనం
మాలిన శరీరానికి తపస్సే సంస్కారం
—————————————–
ధర్మ్సాధనకు వుద్దేసిమ్పబడింది మానవ శరీరం .ఆ విషయాన్నీ మరచి పోయి దాన్ని మన చేష్టలతో ,ఆలోచనలతో మలినం చేస్తుంటాం .మంచి శరీరానికి మంచి మనసు అవసరం .ఈ రెండు దారి తప్పితే వ్యధా భరిత జీవితం అనుభవించాల్సిందే .తన దుశ్చర్య వల్ల దురాలోచన వల్ల జరిగిన అనర్ధాన్ని చిట్టచివరకు కానీ తెలుసుకో లేక పోయాడు ద్రుత రాస్త్రుడు .కన్నులే కాదు ,మనసు హృదయం కూడా గుడ్డివే అయాయి ఆయనకు .అప్పటిదాకా గుర్తుకు రాని పరలోక ధ్యాస ఇప్పుడు కలిగింది అందుకే తపస్సు తో తన శరీర మాలిన్యాని దగ్ధం చేసుకోవాలని అనుకున్నాడు .దీన్ని వివరించే మహా భారత కధను తెలుసు కుందాం. .
ఒక రోజు రాజు అయిన ధర్మ రాజు ను బంధువుల్ని తన సమక్షం లోకి పిలుచుకున్నాడు ద్రుత రాస్త్రుడు ..చాల కాలం ప్రాపంచిక విషయాలతోమలినమయిన p తన శరీరాన్ని ,మనసును
తపస్సు తో సంస్కరించుకోవాలని అనుకుంటున్నానని తెలియ జేసి అనుమతి కోరాడు .విదుర ,సంజయ ,గాంధారి కుంతిలతో కలిసి ఆయన హస్తిన వదలి కురుక్షేత్రం చేరాడు .అక్కడ ఆశ్రమం లో తీవ్ర తపస్సు చేసాడు .ఇక్కడ ధర్మ రాజడులు వారి వివరాలేమీ తెలియక బాధ పడ్డారు .ఎట్టకేలకు ధర్మ రాజు అనుజులతో ,,బంధు గణం తో బయల్దేరి ద్రుత రాష్ట్ర మహర్షి ఆశ్రమం చేరారు .తల్లికి ,గాంధారి ,ద్రుత రాస్త్రునికి నమస్కరించారు వారంతా .అయితె వారికి అక్కడ ధర్మస్వరూపుడు నీతి విశారదు అయిన విదురుడు కనిపించ లేదు .చాలదిగులు ల చెందారు ధర్మ రాజాదులు .ఆ విషయమై ప్రశ్నించారు పెడతంద్రిని .దానికి ఆయన ”విదురుడు మహా జ్ఞాని అధికారం లో వుండగా అతను చెప్పిన నీతి బోధలు న్నా తలకు ఎక్కలేదు .పెడచెవిని పెట్టి కురువంశ నాసనాన్ని నా చేతుల మీదుగా తెచ్చుకున్నాను ..ఇప్పుడు నా మనసు నా వశం లో వుంది .స్థిర చిత్తం తో తపస్సు చేసు చేసుకుంటున్నాను .శరీరాన్ని ,మనసును పరిశుద్ధం చేసుకున్నాను .కాని విదురుడు నా నీడ కూడా తనపై పడకూడదని ఏమో ఎక్కడో దూరం గా పోయి తపస్సు చేసు కుంటున్నట్లు తెలిసింది ఒంటరి గానే వున్నాడు .సర్వాన్ని త్యజించాడు విదురుడు .కొన్ని రోజులు నీరు ,గాలి మాత్రమే ఆహరం గా స్వీకరించి తపస్సు చేసాడట.ఆ తర్వాత అదీ మానేశాడట అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుంటాడు ”అని చెప్పాడు
ధర్మ రాజడులు విదురుని కోసం వెదికారు .దూరం గా ఎక్కడో విదురుడు కన్పించాడు ,తాను ధర్మ రాజు నని ఆయన దర్సనం కోసమే వచ్చానని ,యుదిస్టిరుడు బిగ్గరగా అరుస్తూ చెప్పాడు ,యివేమీ పట్టించు కోకుండా నీతి కోవిదుడు ,మహా తపస్సంపంనుడు ,జితేంద్రియుడు అయిన విదురుడు పొదల చాటుకు వెళ్లి పోయాడు .ధర్మ రాజు అతికష్టం మీద ఆయన వున్న పొద దగ్గరికి చేరాడు .అర్ధనిమీలిత నేత్రాలతో మౌనం గా నిలిచి పోయాడు విదురుడు .విదురుని తల అంతా జడలు కట్టింది .శరీరానికి ఆచ్చాదన లేదు .ధూళి దు దుసర గ్రస్త మయింది .ఎవరిని గుర్తు పట్టే స్థితిలో లేదు .తాను ధర్మరజునని తెలియ చెప్పినా ,ఆయనకేమీ పట్డులేదు .పరమహంస స్థితి పొందాడు .చివరికి కనురెప్పలు ఎత్తి చూసాడు .వెంటనే యోగమార్గం లో శరీరం త్యజించాడు .ఆయన దివ్య తేజస్సు ధర్మరాజు శరీరం లోకి చేరింది .దీనితో ధర్మరాజుకు నూతన శక్తి తేజం కలిగాయి .బుద్ధి బలము హెచ్చింది .విదురుని శరీరం చెట్టుకు చేరబడి నిద్రపోతున్నట్లుగా కన్పించింది .ఆయన మృతదేహానికి అగ్నికార్యం చేయాలనీ సంకల్పించాడు ఇంతలో అశరీర వాణి విదురుడు యతిఆ యాడని ,అగ్ని సంస్కారం చేయ కూడదని హితవు చెప్పింది .యోగాగ్నితో పునీతుడై పరమ హంసయై ,యతి అయి న మహా పురుషుడు ,పుణ్యముర్తి విడురదేవుడు .ధ్రుతరాస్త్ర ,దుర్యోధనుల రాజ్యం లో తాను చెప్పిన నీతి బోధలు వారి చెవికి యెక్క లేదు .తాను ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితి లో వుండి పోవాల్సి వచ్చింది .అదే ఆయన్ను బాధించి తీవ్ర తపస్సమాదికి ప్రోత్చాహించింది .మాలిన్య రహితుడై పునీతుడయాడు .తపస్సుకు యోగానికి అంతటి శక్తి వుందని ఈ కధ మనకు అందించిన సందేశం.
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనం శీర్షికతో ధారా వాహికంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 05 -04 -2011 న ప్రసారమయిన రచన .

