ఉగాది కానుక
రెండు రోజుల ముందే వచ్చింది ఉగాది యావత్ భారతదేశానికి
అమావాస్యనాడు విజయం వెన్నెల పంచేసింది
అంబరాలు దాటే సంబరాన్ని ముంగిట్లోకి తెచ్చేసింది
ఊరించి ఊరించి ఉగాది కానుక నిచ్చేసింది
యవత్ప్రపంచం ఉత్కంత తో ఎదురు చూసిన వేళ
క్రికెట్ క్రెడిట్ దక్కించుకుంది సాహసం తో పోరాడి సాధించింది
ఆట ”గంభీరమై ”యువరాజ విరాజిత ”మైన వేళ
”సింహ”సద్రుసమైన పోరుతో ధనా ”ధోనీ ”(ధ్వని) యంగా
మహేంద్రుడు విజ్రుమ్భించిన వేళ
మాస్టర్ బ్లాస్టర్ చెయ్యక పోయినా
మాస్టర్ బ్లాస్టర్ చెయ్యక పోయినా
సేహ్వాగు పరుగుల వాగు పారించక పోయినా
ప్రపంచ జగజ్జెట్టి లంకను వుఫ్ఫ్ మని లంకకు నెట్టేసి
ప్రపంచపు పై కప్పు గా కప్పును సాధించిన వేళ
వాంఖేడే వాళ్ళకు ఖేదం మనకు మోదం అయినవేళ
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదించింది
నాడు ”కపిలుడు ”దేవుడైతే నేడు ”మహేంద్రుడు ”మహిమాన్వితుడు అయాడు
ఈ విజయం సచిన్ సచ్చీలనికి నిరంతర శ్రమకు సేవకు
కానుక గా చేయటం ధోని సేన వినమ్రతకు నిదర్శనం
చారిత్రాత్మక ఔచిత్యం గర్వకారణం
మేరా భారత్ మహాన్ జయహో జయహో .
గబ్బిట దుర్గా ప్రసాద్
03 – 04 -2011

