04 – 04 -20011 న మొవ్వలో ”శ్రీ క్షేత్రయ్య పదకవితా సమాఖ్య ” నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత
శ్రీ ఖర ఉగాది కవిత ——–అభినవ రాముడెవరో రావాలి
కాలకేయాది దానవులతో పాటు
సహోదరి సుర్పనఖ భర్తనూ చంపి
ఆమె అఘోరిస్తే యుద్ధం లో బందుత్వాలుండవు
ఆని రావణ నీతి బోధించాడు లంకాధిపతి
ఆమె నిస్టురాలకు చలించి
సోదర తుల్యుడైన ఖరుణ్ణి
దండకారన్యాది పతిని చేసి
పద్నాలుగు వేల రాక్షస సైన్యానికి
సోదరుదూ డుషనుడిని సైన్యాధి పతిని చేసి
ఆమెకు తోడుగా జన స్థానానికి పంపాడు
ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా
\ సాగవచ్చునని అభయ ప్రదానమూ చేసాడు
పెచ్చురేగిన ఆ మూక ఆకృత్యాలకు ఆంటే లేదు
అడ్డు ఆపు అసలే లేదు
సాధారణ జన జీవితం ,మునిగణ జీవితం
ప్రమాదపు అంచున పడింది
మునిజనుల కోర్కెపై వారికి అభయ ప్రదానం చేసి
ఆ ఖరాది దానవ సంహారం చేసి వీర విహారం సృష్టించాడు శ్రీ రాముడు
మళ్లి ఆ ఖరుడే ఈ ఏడు రాజ్యం యేలు తాడట
ఏ బీభాత్చాలు సృస్తిస్తాడో వున్న వాటికీ తోడూ
అసలే మనమున్నది కారుణ్యం ,దయ ,సానుభూతి లేని జన దండకారణ్యం
అడుగడుగునా , గాంధారి కొడుకులు ప్రబలు తున్న విపత్కర స్థితి
హింస ,దౌర్జన్యం ,అవినీతి ముప్పేటగా వురి బిగిస్తోంది
సెజ్ లు నాన్ వెజ్ లుగా పీక్కు తింటున్న రాబందులు
కుంభ కోణాలు spectrum గా వింత రంగులీనుతున్న సమయం
విచ్చలవిడి తనం పెచ్చరిల్లు తున్న దినాలు
అందుకే జనస్థాన వృత్తాంతం పునరావ్రుత్తమవాలి
అభినవ శ్రిరాముడెవరో రావాలి
ఖరాది దానవ సంహారం చేయాలి
అప్పుడే శ్రీ ఖర శ్రీకరమై శుభ కరమై ,సౌభాగ్య, సంతోష సంపత్కరమవుతుంది
ఆ తర్వాత వచ్చే” నందన ”కు ఆనందాన్ని అందించే పునాది అవుతుంది .
దుర్గా ప్రసాద్
04 – 04 -20011 న మొవ్వలో ”శ్రీ క్షేత్రయ్య పదకవితా సమాఖ్య ” నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత

