గాంధీ స్మృతి శాంతి యాత్ర ఉయ్యూరు విశేషాలు

ఇవాళ గాంధీ స్మృతి శాంతి యాత్ర బాగా జరిగింది .వందలాది విద్యార్ధులు స్వచ్చంద సంస్థలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వారు ,వర్గాల వారు పాల్గొన్నారు రాజేంద్ర ప్రసాద్ నాయ కత్వం లో బాగా జరిగింది .వీరమ్మ గుడినుంచి యాత్ర బయల్దేరి లక్ష్మి talkies దగ్గర గాంధీ బొమ్మను చేరి ఆయనకు పూలమాలలు వేసి ,బంగాళా లో మీటింగ్ జరిపాము .నేను మాట్లాడాను గాంధీ 1921
లో మహాత్ముడు కస్తుర్బా తో పట్టాభి తో విజయ వాడ నుంచి బందరు వెళ్తూ ఏప్రిల్ఐదవ తేది న వుయ్యూరు వచ్చారు వెయ్యి మంది పురజనులుబంగాళా  ల దగ్గర ఆయనకు స్వాగతం పలికారు .ఆయన ఆగి పది నిముషాలు మాట్లాడారు ప్రతి ఇంట రాట్నం వుండాలని ,స్వదేశి ఉద్యమాన్ని బాల పరచమని ప్రజల్ని కోరారు .అప్పటికి  అప్పుడు ఒక వంద రూపాయలు స్వచ్చందం గా వసూలు చేసారు గాంది గారు అప్పుడు లోక మాన్య బాల గంగాధర తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు నినాదానికి ధన సహాయం కోసం దేశం లో తిరిగారు ఈ వంద రూపాయల నిధిని స్వరాజ్య నిధికి జమ చేసారు ఇక్కడినుంచి పామర్రు మీదుగా బందరు వెళ్లారు .అక్కడ పుర సన్మానం జరిగింది

రెండవ సారి గాంధీ ఖద్దరు నిధి కోసం ఆంధ్ర వచ్చారు 1929  ఏప్రిల్ లో .హైదరాబాద్ లో బయల్దేరి జగ్గయ్య పేట,నందిగామ నూజివీడు మీదుగా విజయవాడ 11 వ తేదిన వచ్చి అక్కడినుండి రాత్రి ఎనిమిది గంటలకు వుయ్యూరు రహదారి బంగాళా చేరారు .ఆ రోజు రాత్రి బంగాళా లోనే బస ,నిద్ర ఆయనతో వచ్చిన వారందరికి మా ఇంటికి ఎదురుగా వుండే సూరి శోభనాచలపతి గారు వాళ్ళ దొడ్డిలో వంట చేయించి తరతమ భేదం లేకుండా ఒకే పంక్తి లో భోజనాలు పెట్టి అందరికి ఆశ్చర్యం కలిగించారని మా అమ్మ గారు చెప్పారు .గాంధీ గారు ఆయన విశాల దృక్పధాన్ని మెచ్చారట మర్నాడు ఆంటే ఏప్రిల్ 1 2 వ తేది ఉదయం ఆరు గంటలకే కుమ్మమూరు వెళ్లారట .అక్కడ మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి గారు మిగిలిన పెద్దలు అపూర్వ స్వాగతం చెప్పి ఖద్దరు నిధికి గాంధీ గారికి 400 రూపాయలు సమర్పించారట .కొందరు నగలు కూడా సమర్పించారట అక్కడ బయల్దేరి వుయ్యురుకు ఉదయం ఏడున్నరకు వచ్చారు గాంధీ వెంట పట్టాభి సీతా రామయ్య గారు అయ్యదేవర కాలేస్వర రావు గారు వున్నారు వుయ్యూరు cbm  స్కూల్ లో గాంధీ గారి సభా జరిగింది వుయ్యుర్ పంచాయితీ బోర్డుఇతర  మిత్ర పుర్సాప్రముఖులు ఘనం హనం గా సత్కరించారు మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు సన్మాన పత్రం రాసి చదివి సమర్పించారు అప్పుడు ఆయన  సిబియం స్కూల్ లో తెలుగు పండితులు గాయత్రి అనంత రామయ్య గారు మొదలయిన పుర ప్రముఖులు పాల్గొన్నారు .ఖద్దరు నిధికి 667 రూపాయలు ఒక\\\బంగారు ఉంగరం కొన్ని నిజాం నాణాలు గాంధీజీకి సమర్పించారు గాంధీనివిశ్వశాంతి  v nti ప్రదాతగా సుహృద్భావ సంపన్నుని గా వర్ణించారు సన్మాన పత్రం లో అంతే కాదు గాంధీ అహింస సిద్ధాంతం వల్ల ప్రపంచం లో భారత దేశం అత్యన్నత స్థితికి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు మహాత్ముడు చాల సంతోషించి గొప్ప సందేశం ఇచ్చారు .అందరు ఖద్దరు  ధరించాలి అన్నారు .బాల్యవివాహాలు చేయరాదని జాతీయ పునర్నిర్మాణానికి సంఘ సంస్కరణ అవసరం అని ఉద్బోధించారు .పంజాబు రాష్ట్రం తప్ప మిగిలిన రాష్ట్రాలలో ఆంధ్ర దేశం ఖద్దరు ఉత్పత్తిలో ముందు వుంది అని శ్లాఘించారు మహాత్ముడి ni పాద ధూళితో పునీతమై ఆయన బస తో ధన్యమైన ఈ రహదారి బంగాలను ఇక నుంచి ”మహాత్మా గాంధీ రహ దారి బంగాళా ”అని పిలవాలని దానికి తగ్గట్టు పంచాయితీ ,మండల పరిషత్ ,mlc  లు స్పందించి వెంటనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని చెప్పాను వేలాది ప్రజలు నా  ప్రతిపాదనకు మిన్ను ముట్టే హర్ష ధ్వానాలు చేసారు . ఆనందం తో తన్మయున్నయాను వెంటనే వుయ్యురుసర్పంచ్ శ్రీ అంగడాల వెంకటేశ్వర రావు ,మండలాధ్యక్షురాలు శ్రీమతి సోర్నల సంతోష కుమారి రేపే తీర్మానాలు రాసి ఆమోదిమ్పజేసి ప్రభుత్వానికి పంపుతమన్నారు రాజేంద్ర ప్రసాద్ తన వంతు కృషి చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తెప్పిస్తానని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు చివరిగా నేను గాంధీ గారి సందర్శనం చూపిన ప్రభావాన్ని గురించి చెప్పాను కుమ్మమూరు లో మైనేని గోపాల కృష్ణ గారి అక్క గారు అన్న పూర్ణమ్మ గారు గాంధీ రాక తో పులకించి ఆయన సందేశానికి ఆమోదం గా ఆరోజు నుంచి ఖద్దరు వస్త్రాలు కట్టటం ప్రారంభించారని ఇప్పటికి 85  ఏళ్ళ వయసు దాటినా ఖద్దరు కట్టుతున్నారని అనగానే జనం చాప్పట్లతోన్ ఆమెను అభినందించారు .అంతే కాదు గాంధీ గారి ఇంకో ఆదర్శం కులాంతర వివాహాన్ని ఆమె ఆచరించి మార్గదర్శి గా వున్నారని చెప్పాను ఆమె కమ్మ వారికులంలో పుట్టారు ఆమెతో పాటు గుంటూరు మెడికల్ కాలేజీ లో చదువుతున్న బ్రాహ్మల కులానికి చెందిన రాచకొండ నరసింహ శర్మ గారిని ప్రేమించి ,పెద్దల అంగీకారం తో వివాహం చేసుకొని చరితార్దు లయారు .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో చూపిన విదుషీమణి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు ఇప్పటికి ఆ వృద్ధ దంపతులు విశాఖ పట్నం లో ఎంతో అన్యోన్యం గా పిల్ల పాపలతో మనుమలు ,మనుమా రాళ్ళతో హాయిగా వున్నారని చెప్పాను .మళ్ళీ ఆనంద తరంగాలు వెలువడినాయి .తర్వాత రాజేంద్రుని కృషి దీక్ష ఈ కార్య క్రమన్న్ని విజయ వంతం చేసాయని స్లాఘించాను అందరి సహకారం తోడ్పాటు వుంటే ఏదైనా దిగ్విజయం అవుతుందని చెప్పాను  ”ఆంధ్ర ప్రదేశ్ లో గాంధీజీ ”అనే పుస్తకాన్ని స్వతంత్రసమర యోధుడు ,విద్వాంసుడు విశ్వనాధ సత్య నారాయణ గారి తో జంట కవిత్వం చెప్పిన కృష్ణా జిల్లా కొడాలి వాస్తవ్యులు కొడాలి ఆంజనేయులు ఇగారు రాసారని అందరు చదివి తెలుసుకో దగినవి అందులో చాల వున్నాయని తెలియ జేశాను చివరిగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ”భారత భాగ్య విధాత ”అన్న పేరుతొ రాసిన రెండు పద్యాలూ చదివి మహాత్మునికి నివాళు లర్పించాను  ఈ చారిత్రాత్మక ఘట్టం లో పాలు పంచుకున్నందుకు ఆనందం గా గర్వం గా వుంది . . .

‘యుగ పురుషుమ్దవంచు ,పురుషోత్తమ మూర్తి వటంచు,ముర్తిమ

జ్జగాదనరాగ  శాంతిమయ సాత్విక శక్తి వటంచు ,వేనవేల్
మొగముల ప్రస్తుతించెను ,ప్రమోదముతో ,జగమెల్ల నిన్ను ,ఏ
మగుదురు నీకు తొల్లి మహమ్మదు ,క్రీస్తును ,బుద్ధ దేవుడున్ ”
”నిండు మనస్వి ,విశ్రుత వినీత పునీత యశస్వి
సాత్వికాఖండ తపస్వి  —-సత్య సహకారము చిటారు కొమ్మ పై పండిన పండు ,
బ్రహ్మ రుషి భారత భాగ్య విధాత గాంధీజీ ”

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

1 Response to గాంధీ స్మృతి శాంతి యాత్ర ఉయ్యూరు విశేషాలు

  1. Rani's avatar Rani says:

    గాంధీ గారు వుయ్యురు వచ్చారని, ఈ మీ పోస్ట్ చదివాకే తెలిసింది.
    చాలా మంచి విషయాలు రాస్తున్నారు. కృతజ్ఞతలు 🙂

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.