భార జలం
శతాబ్దాలుగా వెనుక పాడిన సీమ
నాడు రత్నాలు పండినా -నేడు రాళ్ళమయం
— దశాబ్దాలుగా పంటకు వంటకే కాదు
— దశాబ్దాలుగా పంటకు వంటకే కాదు
అనంత శక్తిని పండించే మానవ అణు రియాక్టర్ క
భార జలం లాంటి ప్రాణ జలానికి నోచు కోక
శాప గ్రస్తులైన ప్రజల దాహార్తిని తీర్చే యత్నం
ప్రజల ప్రభుత్వాల చేత కాని తనం తో
దాహార్తులు అనుక్షణం నింగి కేసి ఆశగా చూస్తుంటే
మానవ సేవా తత్పరతతో కాదన్నది ఔననిపించి
అసాధ్యమన్నది సుసాధ్యం చేసి గడువుకు ముందే
అనంత poor ను అత్యంత pure జలంతో అభిషేకించి
సుజల ,సుఫల వరదానం చేసిన bhaabhaa బాబా
సత్య శివ సుందర విలసితం
ప్రేమ ,త్యాగ సేవా త్రివేణి సంగమం
అపర భగీరదులు ,అనంత కరుణా సంపన్నులు
మతత్రయానికి భాష్య కారులు
అఖిల ప్రపంచాన్ని సనాతన ధర్మ భూమి వైపుకు
ఆకర్షించిన సమదర్శి ,సనాతన సారధి
దైవమె అయిన మానవ ప్రయత్నం శక్తి తో
కృషి చేయాల్సిందే నని తెలియ జెప్పిన అవతార మూర్తి
శ్రీ సత్య సాయి బాబా మానవత్వం మూర్తీభ వించిన కారుణ్య మూర్తి
గబ్బిట దుర్గా ప్రసాద్
24 -11 -1995 న సాందీపని మాసపత్రికకు రాసిన కవిత

