ఆలోచనా లోచనం
తల్లికి పిల్లలపై సమాన ప్రేమ వుండాలి
తల్లి ప్రేమను మించింది లోకం లో లేదు .ఆమెకు ఎంతమంది సంతాన మయినా అందరి పైన ఒకే రకంగా ,సమనం గా ఆప్యాయతను ,ప్రేమను కురిపిస్తుంది .అందరు సమానం గా అభివృద్ధి చెందాలని ఆ కాంక్షిస్తుంది .ఇది లోక సహజం .ఇలా కాక దీనికి విపర్యం గా ప్రవర్తించిన వారు ,కొందరి పై అధిక ప్రేమ చూపించిన వారు చరిత్ర లో నిందార్హు లైన వారెందరో వున్నారు .ఇది మనుష్యుల విషయం లోనే కాదు పశు పక్ష్యాదుల విషయం లోను అంతే. వేదం లో సురభి అనే ఆవు తన కున్న సంతానం పై ఒకే రక మయిన ప్రేమ వుందని తెలియ జేసే కధ ఒకటి వుంది విందాం రండి .
గో జాతికి తల్లి సురభి అనే గో మాత ఆమె ఒక సారి కన్నీరు కారుస్తూ దేవేంద్రుని సరను జోచ్చింది .ఆయన వచ్చిన కారణ మేమిటో తెలియ జేయ మన్నాడు .సురభి గద్గడ స్వరం తో ”దేవరాజ 1nee రక్షణలో త్రిభువనాలు సుఖసంతోషాలతో వున్నాయి .ఒక్క నా గో సంతానానికి మాత్రమే ఎక్కడ లేని కస్తాలువచ్చాయి ”అంది .కారణం ఏమిటని సురెంద్రుడు అడిగాడు .సురభి ”లోకం లో బలమైన పశువుల తో బాటు బలహీన మయిన పశువులను కట్టి మనుష్యులు నాగలి దున్నుతున్నారు .ఆ పని భారం తట్టు కో లేక బక్క చిక్కిన పశువులు నెమ్మదిగా అడగులు వేస్తుంటే ములు కర్ర తో కొట్టి పొడిచి హింసిస్తున్నారు .అది చూడ లేకుండవున్నాను .”అని వెక్కి వెక్కి ఏడ్చింది .దేవేంద్రుడు ఓదారుస్తూ ”నీకు అధిక సంతానం కదా అన్నిటికి ఈ బాధ లేదు కదా ?కొన్ని పశువులకే గా ఈ కష్టం ఇది లోకం తీరే కదా ?”అన్నాడు .అప్పుడు సురభి ”నిజమే .తల్లికి పిల్లలంతా సమానమే .కొందరి మీద ఇష్టం ,మరి కొందరి మీద అయిష్టం ఏ తల్లికి వుండదు .బిడ్డలు ఎందరున్నా తల్లి అందరు సమానం గానే సుఖం గానే వుండాలని కోరుకుంటుంది .గాయ పాడిన వారిని ,బాధ పదే వారిని ,తల్లి ఎంతో ప్రేమతో చూస్తుందని నీకు తెలుసు .కనుక పనిచేయలేని ,బలహీనం గా వున్న నా సంతానాన్ని కనికరించి రక్షించు ”అని ప్రాధేయ పడింది సురభిగోమాత .ఇంద్రుడు ఆమె పిచ్చి ప్రేమకు సంతోసించి పరమానంద భరితుడై ,నాడు .సురభి పై విపరీతంగా జాలి కలిగింది .వెంటనే సంకల్ప బలం తో ఆ ప్రాంతమంతా పెద్ద వర్షం కురిపించాడు .భూము లన్ని గుల్ల బారి గడ్డి ,తృణధాన్యాలు బాగా పండాయి .పశుగ్రాసం పుష్కలంగా లభించటం తో పశువులు ఇష్టం గా మేసి బలం పుంజుకున్నాయి .పసువులలోనే ఇంత ఆపేక్ష వుంటే మనుష్యులలో వుండటం ఆశ్చర్యం కాదు .
వేదం లోని ఈ కధను ద్రుత రాస్త్రునికి వ్యాస మహర్షి హిత బోధ గా చెప్పాడు .దుర్యోధనుని పై వున్న అధిక పుత్రా ప్రేమను వదిలించు కోలేక తన మనసు లోని మాటను వ్యాసునికి చెప్పాడు .కర్తవ్యమ్ బోధించ మన్నాడు .అప్పుడు మహర్షి పుత్ర మొహం లోకం లో సామాన్యమైనది మైనది కాదని కౌరవులని ప్రేమించి నట్లే పాండవులను ప్రేమించమని కురు పాండవులిరువురు ఆయనకు రెండు కళ్ళు గా భావించాలని ,ఏ కంటికి నెప్పి వచ్చినా బాధ గానే ఉంటుందని ఈ విషయం లో సురభి అనే గోమాతను ఆదర్శం గా తీసుకో మని ధర్మ బోధ చేసాడు .సరి అయిన సమయం లో చెడు మార్గాన నడుస్తున్న కొడుకు దుర్యోధనుడిని మందలించి సన్మార్గం వైపు త్రిప్పక పొతే విపరీత పరిణామం సంభవిస్తుందని హెచ్చరించాడు .అప్పుడు ఆ కొడుకు అలవి కాని వాడై ,విసృంఖలం గా ప్రవర్తించి వంశానికి ,కులానికి రాజ్యానికి చేటు తెస్తాడు .సంఘం దుర్నీతి మయం అయి ,ప్రజలు కష్టాల పాలు అవుతారు .అందుకే అందరు సురభి లాగ సమ బుద్ధిని కలిగి ప్రవర్తించాలి .గుడ్డి ప్రేమే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమై కురు వంశ నాశనానికి హేతు వైందని అందరు గుర్తించాలి
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనంశీర్షికలో సే ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 12 -04 -11 నా prasaramayi
—

