గొల్లపూడి మారుతీరావు గార్కి జన్మదిన శుభాకాంక్షలు
“నేను”
పెద్దమేడ ముందు వీళ్ళ కుటుంబం . మేడ మీది కుటుంబం వీళ్ళకు ఆశ్రయం . నిజo చెప్పాలంటే వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించే ఆ మేడ మీద కుటుంబం వుంది .”ఆశ్రయం కంటే ఆత్మీయత ఎక్కువ .” ఆంటే బాగుంటుంది .తరతరాల స్నేహం అది .తరగని గని వంటిది .మేడ వారింట్లో ప్రతి పండక్కీ వీళ్ళకూ పండగే .వీళ్ళ ఆనందమే మేడ కుటంబం ఆనందం .ఏ పండగ వచ్చినా వాళ్ళు వీళ్ళు కలిసి మెలిసి వుంటారు .ఆనందిస్తారు .అన్ని తరాల్లోను రెండు కుటుంబాలు పాటించాయి .ఆ ఇంట్లో పెళ్లి ముచ్చట్లు ,బదిలీలు ,చదువు సంధ్యల వివరాలన్నీ వీళ్ళ ఎదుట మాట్లాడాల్సిందే .అంత చల్లని మనసున్నవాళ్ళు . మేడ ఇంటి వారి పెద్దబ్బాయి పెళ్లి జరిగింది .కుందనపు బొమ్మ లాంటి కోడలు కాపరానికి వచ్చింది .వాళ్ళ అమ్మ అన్నీచూడమని అంటుంది. .ఏదీ చెప్పదు . తెలుసుకోవటమే తమ పని అంటుంది . అడిగితె అన్నిటికి ముభావమే . ఇవ్వడమే కాని పుచ్చుకోవటం తెలీని కుటుంబం వీళ్ళది .తల్లి ఔన్నత్యమే ఈ పిల్లల్ని అంత వాళ్ళను చేసింది .
వేసవి లో సందడే సందడి రెండు ఇళ్ళకు హడావిడే హడావిడి . మేడ కుటుంబం పిల్లలు , ఈ పిల్లల పై ఒక కన్నేసి ఉంటారు. ఎప్పుడు వీళ్ళు చిరునవ్వు తో ఆహ్వానిస్తారు .ఇంటిల్లి పాదికి తియ్యటి మామిడి పళ్ళు ఇస్తుంది వీళ్ళ అమ్మ .అప్పుడు ఆమె ముఖం లో ఎంతో గర్వం తొంగి చూస్తుంది .ఈ ఉగాది మేడ కుటుంబం పిల్లలంతా ఇంటివారయ్యారు .వీళ్ళ అమ్మకు ఆనంద పారవశ్యం కల్గింది .ఆప్యాయత సానుభూతి ఎక్కడివా అని ఈమె ఆశ్చర్య పోయింది .మేడ పెద్దదయింది .ఈమె కూడా పెద్దదయింది .ఆ ఇంట్లోకి వెళ్ళాలని వుబలాటం .వాళ్ళు పిలిస్తేనే లోపలి వెళ్ళాలని నియమం .ఆ ఇంటి అమ్మ గారు ఆప్యాయంగా ఈ పిల్లను లోపలి తీసుకు వెళ్లి అలంకరించింది .ఆ ఇంట్లో ఈమె కూడా ఒకటి అయింది .ఆ ఇంట్లోని వైభోగం కళ్ళారా చూసింది పిల్ల .సాయంకాలానికి సోమ్మసిలింది .ఎండకి వడలి పోయింది .అమ్మ వెన్ను తట్టింది .తమకు అక్కడ స్థానం కల్పించిన వారికి అలా చేయటం తమ కుటుంబ బాధ్యత అంది తల్లి .ఇవ్వగలగటమే తమ పని అదే తమ శక్తి అని తమకు బాధ్యతలే ఉంటాయని అన్నది .ఇవ్వడం లో వున్న హాయి చాల గొప్పది అంది .ఆ మాటలకు పిల్ల పులకించింది .ఆ మాత్రుత్వపు పరిపూర్ణతకు ఉద్వేగం తో చలించి పోయింది పిల్ల .తాను చేసిన మంచి పనికి తృప్తి పొందింది. పిల్లముఖం లో వెలుగు చూసింది తల్లి .అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోయింది.మేలుకొనే ద్రుష్టి, కోరికా దానికి లేవు .
ఇంతకీ ఈమె ఎవరు?”మామిడికొమ్మ” పరోపకారమే ఊపిరిగా పెంచిన ఆ పెద్దముత్తయిదువు, ఆ పూచిన మామిడి చెట్టే ఆ అమ్మ .ఆమె శరీరం లో అంతర్భాగమే ,ఆమె ఒడిలో అందంగా పేరిగినా మామిడి కొమ్మ అదే ”నేను ”. ఇదంతా మామిడి కొమ్మ స్వగతం . ఇంత గొప్పగా ,అందం గా చిత్రించారు గొల్ల పూడి మారుతీ రావు . దాని ఆన్తర్యాన్ని, మాత్రుత్వపు మహిమను దాత్రుత్వపు గొప్పను ప్రతి ఫలాపేక్ష లేక పోవటము అద్భుతంగా చిత్రించారు .ఆయన ఏది రాసిన జీవం పోసుకుంటుంది. మనసును తట్టి లేపుతుంది. ఆలోచింప జేస్తుంది . కర్తవ్య బోధ వుంటుంది. వాక్యం రసాత్మకం అంటె మారుతీ రావు మంచి ఉదాహరణ . సుమారు అర్ధ శతాబ్దం క్రితం ఆయన కధలను ”రోమన్ హాలిడే ” పేర సంకలనం గా తెచ్చారు అందు లోని చివరి అతి చిన్న కధకు సంక్షిప్త రూపం ఇది. ఆయన 73 వ పుట్టిన రోజు కానుకగా మీకు నేను అందించాను. ”మారుతి ” లాగ ఆయనా ఆయన కధలు చిరంజీవి గా వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.

