తెలుగు నాటక దినోత్సవం సందర్బం గా

.ఇవాళ తెలుగు నాటక రంగ దినోత్షవం .ఆ కదా ,కమా మీషు న తెలియ జేస్తున్నాను .ఆధునిక నాటకం కన్యాశుల్కం 1882august ప్రదర్శనతో ప్రారంభం .అది పుస్తకం గా వచ్చింది 1897lone .ఒకసారి విహంగ వీక్షణం గా తెలుగు నాటకాలను నటులను ,రచయితలను జ్ఞాపకం చేసుకొని అంజలి ఘటించటం మన కనీస కర్తవ్యమ్ .1860 లోkoraaada raama మ చంద్ర శాస్త్రి ”మంజరీ మధు కరీయం ”నాటకం రాసారు .ధార్వాడ నాటక సమాజం ప్రేరణతో 1860 లో వీరేశలింగం గారు ”వ్యవహార ధర్మ బోధిని ”రాసారు .
అందులో న్యాయవాదుల లంచగొండి తనాన్ని ఎండకట్టారు .విద్యార్ధులతో ప్రదర్శించారు .1880  లో రాజమండ్రికి చెందిన వావిలాల వాసుదేవ శాస్త్రి ”నందక రాజ్యం ”రాసారు .ఇందులో నియోగి, వైదీకి తగాదాలను చూపారు .ఇదే మొదటి స్వతంత్ర తెలుగు సాంఘిక నాటకం ..కొండుభోట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి 31  సాంఘిక నాటకాలు రాసారు. గుంటూరు లో ”హిందూ నాటక సమాజం ”స్థాపించి ఆంధ్రదేశం అంత ప్రదర్సనలు ఇచ్చి నాటక వ్యాప్తికి విశేష కృషి చేసారు .ఇవి పౌరాణిక నాటకాలు అవటం విశేషం .వేణీ సంహారం నాటకాన్ని వడ్డాది సుబ్బరాయ కవి రాసి ప్రదర్సనలు ఇచ్చారు .”హిందూ నాటకోజ్జీవ సమాజం ”స్థాపించి నాటక సేవ చేసారు .బందర్లో నాదెళ్ళ పురుషోత్తమ కవి నేషనల్ theotrical  సొసైటీ పెట్టి తెలుగు హిందీ లలో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు .1887 లో ధర్మవరం రామ క్రిషమా చార్యులు బళ్ళారి లో ”సరసవినోదిని”నాటక సమాజాన్ని పెట్టి నాటక ఉద్యమం నడిపారు .విషాద నాటకాలకుఆద్యుడు  వీటిలో పాటలు కుడా వుండటం ప్రత్యేకత .ఆంధ్రదేశం అంతా నాటక వ్యాప్తి చేసారు ధర్మవరం వారు .దీనితో వచన నాటకాలు తగ్గాయి .సంగీత నాటకాల జోరు పెరిగింది .చిలకమర్తి ”గయోపాఖ్యానం ”తిరుపతి వెంకట కవుల ”ఉద్యోగ విజయాలు”ప్రదర్సింపని వూరు వుండేది కాదు .తెలుగు నాటకం అంత ప్రాచుర్యం పొందింది .పద్య నాటకానికి పట్టాభిషేకం జరిగింది .
క్రమం గా వ్యాపార పధ్ధతి ప్రవేశించింది .చాలా నాటక సమాజాలు ఏర్పడ్డాయి .పోటీలు పెరిగాయి .పాత్రోచిత భాష ప్రాధాన్యత పెరిగింది .ఈ నేపధ్యం లో వేదం వెంకట రాయ శాస్త్రి గారి ”ప్రతాప రుద్రీయం ”నాటకం వచ్చి పాత్రోచిత  భాషకు విలువ పెరిగింది .స్వతంత్ర ఉద్యమం లో చ్చారిత్రక నాటకాలకు ప్రాచుర్యం కలిగింది .ఉద్యమ స్ఫూర్తికి చాల దోహదం చేసాయి ch.నాటక నిర్వహణలో ప్రయో galu చేసారు .వైవిధ్యం కోసం పరితపించారు .డబ్బు విపరేతం గా ఖర్చు పెట్టి మోయలేని బరువుతో దివాలా తీసాయి కూడా .హార్మోనియానికి ప్రాధాన్యత పెరిగింది .సంగేత దర్శకులకు గిరాకి పెరిగింది .పద్యం,పాట ,హార్మోనియం కలిసి చెవి తుప్పు వదిలించాయి కొండవీటి చాంతాడు లాంటి రాగాలు జిలేబి చుట్టల లాంటి రాగ విన్యాసాలు పుట్టుకొచ్చి భయం కూడా కల్గించాయి .
బందర్లో”ఆంద్ర నాటక ప్రోత్సాహక సంఘం ”ఏర్పడి ధర్మవరం వారి ”చిత్ర నలీయం  ”నాటకానికి పోటీలు నిర్వహించింది .తర్వాత చిలకమర్తి వారి ”ప్రసన్న యాదవం ”శ్రీపాద వారి ”బొబ్బిలి యుద్ధం ”నాటకాలకు పోటీలు నిర్వహించారు .ఉత్తమ నటులకు ,ఉత్తమ ప్రదర్శనకు బహుమతులిచ్చారు .దీనితో నాటక విమర్శ కూడా మొదలయిందని చెప్పవచ్చు .మల్లాది రామ కృష్ణ శాస్తి అరిగారి  మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు ఆనాటి ప్రఖ్యాత నాటక విమర్శకులు గా గుర్తింపు పొందారు .
నాటక రంగం లో ప్రసిద్ధి చెందిన ఆనాటి నటుల్లో ముందుగ పేర్కొన తగిన వారు తాడిపత్రి రాఘవాచార్యులు ఆయనే బళ్ళారి రాఘవ ధర్మ వారం వారి మేనల్లుడు .ధర్మవరం వారిని”ఆంధ్ర నాటక పితామహుడు ”అని గౌరవం గా పిలుస్తారు .రాఘవ తెలుగు ఇంగ్లీష్ ,కన్నడ ,నాటకాలలోచిర స్మరనీయ నటన ప్రదర్శించి జేజేలు అందుకున్న మహోత్తమ నటుడు .సంస్కారి .ఆధునికతనను ప్రవేశ పెట్టిన వాడు .పాశ్చాత్య దేశాల నటులందరి తో ఆయనకు పరిచయాలున్దేవి vi .ఆ ప్రభావాన్ని తెలుగు నాటకం మీద తెచ్చాడు .స్థానం నరసింహారావు స్త్రే పాత్రలు ధరించి మంత్ర ముగ్ధుల్ని చేసారు సత్యభామ పాత్ర నభూతో గా నటించారు .గోవింద రాజు సుబ్బారావు ,వేమూరి గగ్గయ్య ,పీసపాటి అద్దంకి శ్రీరామ మూర్తి ,అద్దేపల్లి అఘురామయ్య ,సూరిబాబు తిలకం కన్నాంబ వరలక్ష్మి ది.వి ,సుబ్బారావు  అబ్బూరి .బందా కనక లింగేశ్వర రావు

gabbita durga prasad
16-4-11 తెలుగు నాటక రంగ దినోత్షవం sandarbham గా pratyeka rachana

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.