నవ్వుల పువ్వులు

నవ్వుల పువ్వులు


               ”నవ్వవు జంతువుల్ ,నరుడు నవ్వును నవ్వులు చిత్తవ్రుత్తికిన్
               దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు ,కొన్ని విష ప్రయుక్తముల్
              పువ్వులు వోలె ప్రేమ రసముల్ వెలిగ్రక్కు ,విశుద్ధ మైన ,లే
             నవ్వులు ,సర్వ సుఖ దమనంబులు,వ్యాధులకున్ మహౌశాధముల్

 అని జాషువా గారు నవ్వు కు నిర్వచనం చెప్పారు .నవ్వును గురించి ,నవ్వు ఉద్యమాన్ని గురించి కొన్ని విశేషాలు .హుమార్ అనే హాస్య త్రైమాసిక పత్రిక ఇరవైఎల్లకు పైబడిగా అమెరికా నుంచి వెలువడు తోంది .humor ఆంటే ఆర్ద్రత ,తడి ,తేమ ,ద్రవం అని అర్ధలున్నా న్నయిటహాస్యకారుని ఖ్యాతి వినే వారి చెవుల్లో వుంటుంది కాని చెప్పే వారి నోట్లో ఉండదని తేల్చేసాడు shakespeare    .”స్వేచ్చ హాస్యాన్ని ఉత్పత్తి చేస్తే ,హాష్యం స్వేచ్చను ఉత్పత్తి చేస్తుంది ”అంటాడు జీన్ పాఉల్ సాత్రే .ప్రతి జంటకు వివాహం చేసే మారు వేషం లో వున్న పురోహితుడే హాష్యం అన్నాదిన్కోడు   .హాస్య భావన లేని ఏ మనస్సు చక్కగా సంఘటితం కాదు అన్నాడు colridge మహాశయుడు దేశం నాగరికతకు అత్యుత్తమ పరీక్ష హాశ్యాం  .చావటం తేలిక హాస్యమాడటం కష్టం అని తేల్చాడు ఇంకో ఆయన. చిరు నవ్వే విజయ సాధనం అన్నాడు ఒక మహానుభావుడు .మనిషికి దైవం ప్రసాదించిన వరం హాష్యం  చివరిగా ”విస్వశ్రేయః హాష్యం .”
             ఇప్పుడు కొన్ని హాస్య గుళికలు మింగుదాం .”నువ్విచ్చిన చెక్ బౌన్సు అయింది”అన్నాడు డాక్టర్ పేషెంట్ తో .”నా జ్వరం మళ్ళీ వచ్చింది .దేనికేమంటారు? ”పేషెంట్ గడుసు సమాధానం .
    ఒక నౌకరు యజమానికి తన భార్య రాసిన వుత్తరం చదివి పెట్టమన్నాడు .చదవటం మొదలెట్టేసాడుయజమాని వెంటనే యజమాని చెవులు ముసేసాడు నౌకరు ఎందుకురా ఆంటే ”మొగుడు పెళ్ళాల విషయం కదా మీరు వినకూడదని అన్నాడు వాడు .
           ఒక గోరి మీద ఇలా రాసి ఉందట ”ఇతను అతి బద్ధకిష్టు ఒకరోజు గాలి కుడా పీల్చటం మానేసాడు ”.”నన్ను మొట్టమొదట ‘అచ్చేసి ‘దేశం మీదకు వదిలింది పురిపండా గారు అన్నాడు శ్లేషతో శ్రీ శ్రీ
    ”మనం ముసలి వాల్ల  మయామని  ఎప్పుదనిపిస్తుంది ఒక ముసలి ఇంకో ముసలితో ”బర్త్ డే కేకు ఖర్చు కన్నాcandles  ఖర్చు ఎక్కువైనపుడు అన్నా డురెండో ముసలి

”బాపు ! భూమ్మీద నడుస్తుంట్ ఎన్నో జీవులు చని పోతున్నయి అని వాపోయాడు ఒకడు గాంధీ దగ్గర .అక్కడే వున్న పటేల్ అంత వర్రీ వద్దు నాయనా బుర్రకింద   పెట్టి కాళ్ళు పైకెత్తి నడు ”అని వాయిన్చాదట
      ”నేను తెలివి తక్కువ వాన్నని నీకు అనుమానమా ”అన్నాడు మునిమాణిక్యం ”చా నాకా అనుమానం లేసమైన లేదు ”అంది భార్య కాంతం .
   దువ్వురి వెంకట రమణ శాస్త్రి గారు గొప్ప వ్యాకరణ పండితుడు ఆయన అంత్య దశలో చూడటానికి వచ్చిన ఆయన ఎలావుంది అని అడిగాడు ”ఏముందీ అచ్చుకో  ప్రయత్నం ,హల్లు కో ప్రయత్నం లా వుంది ”అన్నాడు వ్యాకరణ భాషలో
”పనైందా పిన్ని గారు ? అని అడిగింది పక్కింటి ఇల్లాలు ”లేదమ్మా ఇంకా ఆయన ఇంటికి రాలేదుగా వస్తే కాని పూర్తీ చేయలేరు కదా? అంది అమాయకం గా పిన్ని
  ”ఎప్పుడు డబ్బు ,డబ్బు ,అంటావు బుద్ధి జ్ఞానం కావాలి”అన్నాడు భర్త ”అవి ఎట్లాగు మీ దగ్గర లేవు గా అందుకే డబ్బు కావాలి ”గడుసు పెళ్ళాం చమత్కారం
    నవ్వుల్లో రకాలు చెప్పారు  భమిడిపాటి కామేశ్వర రావు గారు అందులో మచ్చుకు కొన్ని తుపాకీ నవ్వు ,కోతి నవ్వు ,దగ్గు నవ్వు ,విషపు నవ్వు కొనాఊ పిరి నవ్వు
చివరగా ”హాసం జనజీవన  విలాసం -హాసం మానవ హృదయ లాస్యం -హాష్యం ,లాస్యం లేని ఆస్యం (మొగం )విషాదానికి దాస్యం -కావాలి హాష్యం అందరకు వుపాస్యం ”                            ఇదంతా నా స్వంతం కాదు సేకరణ     గబ్బిట దుర్గా ప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

2 Responses to నవ్వుల పువ్వులు

  1. JYN Sarma's avatar JYN Sarma says:

    కొన్ని చోట్ల తెలుగు సరిగ్గా టైపు చేయబడకపోవడం తప్పితే….. విషయం బాగుంది

    Like

    • gdurgaprasad's avatar gdurgaprasad says:

      కొన్ని పదాలు టైపు చెయ్యడం కష్టం గా ఉంది. మార్పులు చేసాము. ధన్యవాదాలు.

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.