ఆలోచనా లోచనం లో ఈ రోజు ఆంటే 19 -04 -11 న ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది
ఆలోచనా లోచనం
” పూజను బట్టి పురుషార్ధం ”
మనం చేసే పూజను బట్టి ఫలితం ఉంటుందని ధర్మ శాస్త్రాలు వుద్గో ఘోషిస్తున్నాయి .ఎంపిక చేసుకున్న.ఆ దైవం ఏ రూపం లో పూజిస్తే ,పుర్నానుగ్రహం తో మన కోర్కెలను నెరవేరుస్తాడో ముందే గ్రహించాలి . దైవం పట్ల నిష్ఠ వుండాలి .ఆ విధి విధానాన్ని ఆచరించి మనోభీస్తాన్ని నెరవేర్చు కోవాలి ఇది తెలిసి అర్జునుడు శ్రీ కృష్ణుడు శివుణ్ణి అర్చించి విశేష ఫలితం పొందితే అది తెలియక వేరొక విధానం లో పరమేస్వరున్ని పూజించి ఫలితం పొందలేక పోయాడు అశ్వథామ .ఈ వివరాలు మహాభారతం లో ద్రోణ పర్వం లోని చిన్న కధ వివరం గా తెలిపింది
మహా భారతయుద్ధం భీభత్చం గా జరుగుతోంది .ద్రోనసుతుడు ,మహా శస్త్రాస్త్ర నిపుణుడు అస్వస్తామ ,కృష్ణార్జునుల్ని తీవ్ర శరాఘాతం తో చీల్చి చెందాడు తున్నాడు .శరీరాలు గాయాలై రక్తం వరదగా పారుతోందికృష్ణార్జునులకు .అర్జునుడు ఇవేమీ లెక్క చేయకుండా అస్వస్తామ ను తీవ్ర బాణాలతో బాధిస్తూనే వున్నాడు .వీరిద్దరిని ఇంక ఏమి చేయ లేనని తేర్మ్కానిన్చు కున్నాడు .కోపం ,పరాభవం తో చెలరేగి పోయాడు .పరిస్థితి చెయ్యి దాటి పోతోందన్న ఆవేశము తోడైంది .చివరి ప్రయత్నం గా నారాయనాస్త్రాన్ని ప్రయోగించాడు మంత్ర పూతం గా .ఈ దెబ్బ తో వారిద్దరి పని సరి అనుకోని ఆనందించాడు .మహా మహిమాన్వితమైన ఆ నారాయణాస్త్రం కృష్ణార్జునులను ఏమీ చేయలేక పోయింది .చిరునవ్వు వీరిడైతే చిరాకు అతనిదయింది .ఎందుకు తన అస్త్రం విఫలమయిందో తెలియటం లేదు ద్రోణ సుతుడికి .తీవ్రం గా విచారించాడు .ఆవిశాయమేదో చేల్చుకోవాలని వ్యాసమహర్శిని ధ్యానించాడు .ఆయన ప్రత్యక్షమైనాడు .నమస్కరించి ”ఇది ఏమి మాయో తెలియటం లేదు స్వామీ దేవ గంధర్వాది జాతులను కూడా బాదిన్చాగాలిగిన దివ్యాస్త్రమైన నారాయణాస్త్రం కేవలం మనుష్యులైన కృష్ణార్జునులను దహించ లేదు కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం గా వుంది తెలియ జేయండి ”అన్నాడు అస్వస్తామ .అప్పుడు వ్యాసమహర్షి నవ్వి ”ఎవరు చేసుకున్న పుజాఫలితం వారికి లభిస్తుంది .నువ్వు పరమేస్వరున్ని ప్రతిమా రూపం లో అర్చిన్చావు .వాళ్ళిద్దరూ లింగరూపం లో వున్న శివుడిని ఆరాధించారు .పూర్వజన్మలో మీరు చేసుకున్న పూజాఫలితమే ఇప్పుడు ఆ రూపం లో ఫలితం గా కన్పిస్తుంది .లింగార్చన చేసిన వారిని శివుడు మెచ్చి రక్షిస్తాడు .అందుకే కృష్ణార్జునులను నీ నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది .”అని సవివరం గా తెలియ జేశాడు మహర్షి వ్యాసుడు .అసలు రహస్యం అప్పుడు తెలిసింది అతనికి .శివుణ్ణి లింగ రూపం లో ,అభిషేకం చేసి పూజ చేస్తేనే ఆయన సంతోషించి అభీస్త సిద్ధినిస్తాడని .కనుక శివ ప్రతిమను పూజించటం కంటే ,శివలింగాన్ని పూజిస్తే అధిక ఫలితం ఈ విషయాన్ని ఆనుసాసనిక పర్వం లో కూడా శ్రీ కృష్ణుని చేత ధర్మరాజు కు చెప్పించాడు వ్యాస మహర్షి శివలింగ సన్నిధానం లో చేసే ప్రతి పని ఆయురారోగ్య ఇస్వర్యాలనిస్తుందని తెలియ జేసారు .
ఇంతకీ లింగం ఆంటే ఏమిటి ?సమ్యక్ జ్ఞానమే లింగం .అని శైవ ఆగమాలు బోధిస్తున్నాయి .శివ లింగమే పరబ్రహ్మమని చెప్పాయి .ఓంకారమే లింగం .శివపురాణం లో లింగమే తన రూపు అని శివుడే చెప్పాడు . లింగాన్నే అర్చించమని కుడా చెప్పాడు .శివలింగం ఆంటే శివుని యొక్క లింగం అని మాత్రమే కాదు శివుడే లింగం అని శైవ ప్రకాశిక లో వుంది .పద్మపురాణం కూడా లింగానికే శివార్చన చేయాలని బోధించింది .త్రికాల శివలింగార్చనశ్రేస్తామని ఉపనిషత్తు వుద్ఘోషించింది .కనుక సాధకుడు ఇందులోని రహస్యం గ్రహించి ,తన కోర్కెలను తీర్చుకోవటానికి తన ఇష్టదైవం ఏ రూపం లో అర్చించితే ,ధ్యానిస్తే భక్త సులభుడై వరదానం చేస్తాడో ,ఆపదల నుంచి రక్షిస్తాడో ,తెలుసుకొని పూజించి అభీష్ట సిద్ధిని పొందాలి .ఇదే ఈ కధలోని ధర్మ సూక్ష్మం .ఆ ధర్మ సూక్ష్మం తెలిసి శ్రీకృషుడు ,అర్జునుడు శివలింగార్చనచేసారు అందుకే అస్వత్తామ ప్రయోగించిన నారాయణాస్త్రం శివుని అనుగ్రహం వల్ల వారిని ఏమీ చేయ లేక పోయింది .ఇది తెలియక అస్వత్తామ శివప్రతిమనే పూజించి ,నారాయాన్నాస్త్ర ప్రయోగ ఫలితాన్ని పొందలేక పోయాడు .కనుక పూజను బట్టే పురుషార్ధం లభిస్తుందని తెలుసుకోవాలి .
గబ్బిట దుర్గా ప్రసాద్


చక్కగావివరించారు
LikeLike