కొల్లేరు -అవినీతి వ్యాసాలు

రవీంద్ర నాథ్ గారు నమస్తే పంపిన అవినీతి పై ఆర్టికల్ ,ఇవాల్టి జ్యోతి లోని కొల్లేరు వ్యాసం రెండు చదివాను .దొంగ ఎక్కడో వుండదు .మనమధ్యే   వుంటాడు .వాడు మనలాగే దొంగ అని కేకలు పెట్టి తప్పించుకుంటాడు న.వ్యవస్థ భ్రస్టు పట్టింది కొత్త కాలు,కీలు పెట్టాల్సిందే overhaul చేసే పరిస్థితి రావాలి హజారే తో ఎవరో ఒకరిద్దరు అవినీతి పరులు కలిసి నంత మాత్రాన వారి మీదే మీడియా ద్రుష్టి పెట్టి అసలు సమస్యను ఆయన వ్యక్తిత్వాని మరిచింది .ఆ మాత కొస్తే గాంధి గారి స్వతంత్ర పోరాటం లో ఆయనా వెంట వున్న వాళ్ళందరూ సచ్చీలురేన ?బడా పారిశ్రామిక వేత్తలు లేరా ?అంతమాత్రాన ఉద్యమం నీళ్ళు కారిండా .లేని పోనీ వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం ,గంపల కొద్ది న్యూస్ కుమ్మరించటం మానియా అయింది ఇందు లోంచి బయట పడాలి కొనే ,అమ్మే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి రావాల్సిన tax  అక్కడి కక్కడే వసూలు అవ్వాలి ఇది నాకు తెలిసినంత వరకు నేను మూడు సార్లు అమెరికా వెళ్లి చూసినా మేరకు అక్కడ తక్ష్ సూటిగా ప్రభుత్వానికి చేరుతుంది బిల్లు లేకుండా వస్తు విక్రయం జరగదు అందుకే తక్ష్ రూపం లో వాళ్ళు చాల లాభ పడుతున్నారు .మనకున్న చట్టాలన్నీ లోసుగులే చెయ్యి తడిపితే అంతా హుష్ కాకి .ప్రభుత్వానికి బొక్క అధికార్ల కు పక్క పండగ .దీనిపై స్పష్టమైన విధానం వుండాలి .ఎవరి డబ్బో దోచి వేరెవరికో పెట్టి సంఘ సేవ పేరు చెప్పి ,బడా బాబుళను ఆడుకొని ఎంగిలి మెతుకులు మిగిలిన వారికి విదిల్చి పోజు కొత్తటటం గత ఆరేడు ఏళ్ళుగా విచ్చల విడి అయింది .అదేమని ప్రస్నిన్చినవాడు ప్రగతి నిరోధకు దయ్యాడు ఆ భ్రమ ఇంకా వదల లేదు పార్టీలు అన్ని కుర్చుని చక్కని చర్చ చేసి దేశానికి ఏది హితం ,ఏది అహితం అని నిబంధనలు చేసుకొని ,స్వయం నియంత్రణ చేసుకోవాలి అరవైయేళ్ళు దాటి స్వాతంత్రం పొందినా మన విధానం ,జన విధానం అంటూ లేదు అమెరికా ను నెత్తికెత్తుకున్న వాళ్ళు,చైనా ,రష్యా లను మోస్తున్న వారు గానే మిగిలి పోయారు కాని మన కు ఏమి కావాలో ఆలోచి నిర్ణయాలు చేయ లేని అసమర్దుల మయాం  స్వార్ధం నారా నరాల జీర్నించింది ముద్రలు వేయటం ఫాషిన్ అయింది

          ఇక కొల్లేరు విషయానికి వస్తే అక్కడి కొంగలకు  కాళ్ళు ,రెక్కలు వున్నాయో లేదో కాని ,అక్కడి భూములకు రెక్కలు వచ్చి యెగిరి పోతున్నాయి అక్కడ రాజ కీయమే .పర్యావరణ స్పృహ నశించింది ప్రకృతి తో మానవుడు సహ గమనం చేయాలి దాని భద్రతా తనదిగా భావించాలి లేక పొతే అదే మనల్ని కబలిస్తుందన్న సత్యాన్ని అందరు గ్రహించాలి ఇది మనకు సంబంధించింది కాదు అని మనమెవరమూ తప్పించుకోరాడు విషయాలు ప్రజలకు తెలియ జెప్పాలి వాళ్ళ కు అర్ధ మాయే రీతిలో అప్పుడు కొంత అయిన చలనం వస్తుంది ప్రభుత్వాని నడిపే వారి లో చిట్టా సుద్ధి లోపించటం,చెంచ గాళ్ళ ప్రయోజనాలు కాపాడటం తో సమసి ఇంత కాలం పెరిగి పెద్దదయింది స్పృహ వస్తున్నా సమయం లో ఏదో సంక్షోభం ,అలజడి .సమస్యను పక్క దారి పట్టిస్తున్నాయి నిజాయితీ లేని నాయకుల వల్ల జరుగు తున్న అనర్ధం ఇది
 .            అందర్నీ ఆలోచిమ్పజేస్తూ స్పృహ కలిగిస్తూ ,వివరాలు అందిస్తూ ,విశ్లేషిస్తూ మీరు రాస్తున్న aartcles సమాజ హితమైనవి .నిరంతరం రాయండి జన చైతన్యం తెండి
                                                             గబ్బిట దుర్గా ప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.